Black Pepper: చిట్టి చిట్టి మిరియాలతో ఎన్నో లాభాలో తెలిస్తే అసలు వదిలిపెట్టరు
శీతాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ ని ఎదుర్కోవాలంటే నల్ల మిరియాలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులోని ఔషధ గుణాలు రోగాల నుంచి రక్షణగా నిలుస్తాయి.
ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మసాలా దినుసుల్లో నల్ల మిరియాలు ఒకటి. దీన్నే కాలీ మిర్చ్ అని కూడా పిలుస్తారు. వంటలకి రుచి ఇవ్వడమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలని అందిస్తుంది. జలుబు, గొంతు నొప్పిగా ఉన్నప్పుడు చాలా మంది తప్పకుండా మిరియాల పొడి వేసుకుని పాలు తాగుతారు. ఇలా చేయడం వల్ల దగ్గు, నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
శీతాకాలంలో రోగనిరోధక శక్తి పెంచుకునే ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. వాటిలో నల్ల మిరియాలు కూడా ఒకటి. ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా రక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రోజూ ఆహారంలో తాజాగా నూరిన నల్ల మిరియాల పొడి చేర్చుకోవడం వల్ల దగ్గు, జలుబు తగ్గిపోతుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి నొప్పిని తగ్గిస్తాయి. విటమిన్-C పుష్కలంగా ఉంటుంది. సహజంగా రోగనిరోధక శక్తిని పెంచే అద్భుతమైన యాంటీ బయాటిక్.
మిరియాల వల్ల ప్రయోజనాలు
జీర్ణక్రియకి సహాయపడుతుంది: మిరియాలు తీసుకోవడం వల్ల కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ విడుదల అవుతుంది. ఇవి జీర్ణక్రియకి సహాయపడతాయి. ప్రోటీన్లని విచ్చిన్నం చేస్తుంది. హైడ్రోక్లోరిక్ యాసిడ్స్ ద్వారా పేగులు శుభ్రపడతాయి. వివిధ జీర్ణాశయాంతర వ్యాధుల నుంచి రక్షింస్తుంది. అందుకే తినే ఆహార పదార్థాల మీద కొద్దిగా మిరియాల పొడి చల్లుకోవడం మంచిది.
మలబద్ధకాన్ని తగ్గిస్తుంది: ఆహారంలో క్రమం తప్పకుండా మిరియాలు తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్యని పరిష్కరించుకోవచ్చు. జీర్ణక్రియ వేగవంతం చేస్తుంది. పొట్టలోని సమస్యలని నయం చేస్తుంది.
బరువు తగ్గిస్తుంది: ఇదొక మ్యాజిక్ మసాలా. గ్రీన్ టీలో వేసుకుని రోజుకి రెండు లేదా మూడు సార్లు తీసుకోవచ్చు. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఈ మసాలా దినుసులో అధిక మొత్తమల ఫైటో న్యూట్రియెంట్లు ఉన్నాయి. ఇది అదనపు కొవ్వుని కరిగించడంలో సహాయపడుతుంది. జీవక్రియని మెరుగుపరుస్తుంది.
కీళ్ల నొప్పులు తగ్గిస్తుంది: ఆర్థరైటిస్ కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించేందుకు సహాయపడుతుంది. మిరియాలులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. కీళ్ళు, వెన్నెముక నొప్పులతో ఉన్న వాళ్ళు మిరియాల టీ తీసుకుంటే చాలా మంచిది.
రక్తంలో చక్కెర స్థాయిలు మెరుగు: మిరియాలు రక్తంలో చక్కెర స్థాయిలని మెరుగుపరుస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు భోజనంలో మిరియాల పొడి చల్లుకుని తినొచ్చు. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. అయితే అతిగా తీసుకుంటే మాత్రం కడుపులో మంటని ప్రేరేపిస్తుంది.
శ్లేష్మం నుండి ఉపశమనం: నల్ల మిరియాలు శరీరంలోని శ్లేష్మ ప్రవాహాన్ని నియంత్రించే సామర్థ్యం కలిగి ఉంటుంది. చల్లని వాతావరణంలో తలలోని సైనస్ ప్రాంతంలో పేరుకుపోయే శ్లేష్మానని కరిగిస్తుంది. దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
కొలెస్ట్రాల్ ని నియంత్రిస్తుంది: కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల గుండె పోటు సంభవిస్తుంది. కొలెస్ట్రాల్ కరిగించే గుణం మిరియాలకి ఉంది. ఇందులోని పైపెరిన్ గుణం కొలెస్ట్రాల్ స్థాయిలని సమర్థవంతంగా తగ్గిస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: ఓ మై గాడ్, మహిళలకూ బట్టతల వస్తుందా? ఎందుకొస్తుంది? చికిత్స ఉందా?