News
News
X

Viral Job: భలే జాబ్, ఆ వీడియోలు చూస్తే గంటకు రూ.1500 జీతం, లక్కీ ఛాన్స్ కొట్టేసిన యువతి!

అప్పటికే అతడు ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. సహజీవనం చేస్తూ బిడ్డను కూడా కన్నాడు. అదే సమయంలో మరో యువతి ప్రేమలో పడ్డాడు.

FOLLOW US: 
Share:

నసుండాలే గానీ.. డబ్బులు సంపాదించేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. శ్రమను నమ్ముకున్నవారు రోజంతా గొడ్డులా శ్రమిస్తారు. కానీ, తమ శ్రమకు తగిన మొత్తాన్ని మాత్రం సంపాదించలేరు. తెలివిని నమ్ముకున్నవారు.. పెద్దగా శ్రమపడకుండానే డబ్బులు సంపాదిస్తారు. మోసాన్ని నమ్ముకున్నవాడు పక్కోడిని ముంచైనా సరే సంపాదిస్తాడు. ఇలా చాలామంది చాలా రకాలుగా డబ్బులు సంపాదిస్తుంటారు. అయితే, కాళ్ల మీద కాలు వేసుకుని.. కేవలం వీడియోలు చూస్తూ సంపాదించేవాళ్లను మీరు ఎప్పుడైనా చూశారా? అయితే, మీరు సరికొత్త జాబ్ గురించి తెలుసుకోవల్సిందే. 

స్కాట్‌ల్యాండ్‌కు చెందిన 22 ఏళ్ల యువతికి బంపర్ ఆఫర్ వచ్చింది. జస్ట్, వీడియోలు చూస్తే చాలు, గంటకు 20 డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.1562) చొప్పున చెల్లిస్తారు. ‘‘ఓస్ అంతేగా, ఆ పని మేం కూడా చేసేస్తాం’’ అని అనుకుంటున్నారా? అయితే, ఆమె చూడాల్సింది సాదాసీదా వీడియోలు కాదు.. పోర్న్ వీడియోలు. ‘‘అయితే, మరీ మంచిది’’ అని అనుకుంటున్నారా? మీరు పురుషులైతే పర్వాలేదు. కానీ, అమ్మాయిలకు అలాంటి వీడియోలు చూడటం కాస్త ఇబ్బందే. పైగా, ఈ విషయం నలుగురికి తెలిస్తే పరువు కూడా పోతుంది. 

అయితే, గ్రీనోక్‌కు చెందిన రెబెక్కా డిక్సన్ అనే 22 ఏళ్ల అమ్మాయిని ఈ జాబ్ వరించింది. ఈ ఉద్యోగం చేసేందుకు సుమారు 90 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. ఆ కంపెనీ కేవలం డిక్సన్‌ను మాత్రమే ఎంపిక చేసుకుంది. ఇంతకీ ఆ ఉద్యోగం ఏమిటో చెప్పుకోలేదు కదూ. ‘బెడ్‌బైబిల్స్’ (Bedbible) పోర్న్ రీసెర్చ్ ప్రాజెక్ట్‌కు ఆమె హెడ్. ఆమె ప్రాజెక్టుపై పనిచేసే ప్రతి గంటకు ఆ కంపెనీ రూ.1562 చొప్పున చెల్లిస్తూనే ఉంటుంది. 

Bedbible అనేది ఎథికల్ సెక్స్ సైట్. పోర్న్ ఇండస్ట్రీపై మరింత అవగాహన పొందడం కోసం ఈ పరిశోధన ప్రారంభించారు. ఇందులో భాగంగా శృంగార భంగిమలు, సెక్స్ నిడివి, భావప్రాప్తి, స్త్రీ-పురుషుల నిష్పత్తి తదితర వివరాలను తెలుసుకోవల్సి ఉంటుంది. ఈ సందర్భంగా డిక్సన్‌ పోర్న్ వీడియోలు చూస్తూ.. మరింత లోతుగా అన్వేషించి గణంకాలను నమోదు చేయాలి. అందులో ఆమె కనిపెట్టిన కొత్త విషయాలను పేర్కోవాలి. 

Also Read: ఎక్కువ సేపు శృంగారం చేయాలని ఉందా? ఇలా చేస్తే మీరే ఛాంపియన్!

ఈ సందర్భంగా ఆమె ఓ మీడియా సంస్థతో తన జాబ్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఇది చాలా ఆదర్శవంతమైన ఉద్యోగమని భావిస్తున్నా. పోర్న్ చూస్తూ డబ్బులు సంపాదించాలని ఎవరు కోరుకోరు? నేను చాలా చిన్న పట్టణానికి చెందినదాన్ని. నన్ను ఈ ఉద్యోగానికి ఎంపిక చేసుకున్నారని తెలియగానే చాలా ఆశ్చర్యపోయాను. ఇది ఒక గొప్ప అవకాశం. ఈ ప్రాజెక్టులో భాగమైనందుకు చాలా సంతోషిస్తున్నా. నేను చాలా ఓపెన్ మైండ్. నేను చేస్తున్న పనికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఇది ఒక సరికొత్త ఉద్యోగం’’ అని తెలిపింది. మొదటి అసైన్‌మెంట్‌లో డిక్సన్‌కు 100 పోర్న్‌హబ్ వీడియోలు చూడాలి. ఆ వీడియోల మొత్తం వ్యవధి, సెక్స్ పొజిషన్లపై ప్రత్యేకంగా నోట్స్ రాయాలి. ప్రస్తుతం ఆమె ఆ పనిలోనే ఉంది. 

Also Read: శృంగారం ఇంత సేపు చేస్తే మీరే కింగ్స్, భారతీయుల సరాసరి టైమ్ ఇదే!

Published at : 21 Jun 2022 07:07 PM (IST) Tags: Jharkhand Man Marries Two Women Wedding With Two Women Marriage With Two Women

సంబంధిత కథనాలు

మన దేశంలో పురాతన గ్రామం ఇది, ఇక్కడ బయట వారు ఏం తాకినా ఫైన్ కట్టాల్సిందే

మన దేశంలో పురాతన గ్రామం ఇది, ఇక్కడ బయట వారు ఏం తాకినా ఫైన్ కట్టాల్సిందే

మీరు తెలివైన వారైతే ఇక్కడున్న ఇద్దరి స్త్రీలలో ఆ చిన్నారి తల్లి ఎవరో కనిపెట్టండి

మీరు తెలివైన వారైతే ఇక్కడున్న ఇద్దరి స్త్రీలలో ఆ చిన్నారి తల్లి ఎవరో కనిపెట్టండి

ఇడ్లీ మిగిలిపోయిందా? అయితే ఇలా చాట్, పకోడా చేసుకోండి

ఇడ్లీ మిగిలిపోయిందా? అయితే ఇలా చాట్, పకోడా చేసుకోండి

ఇక్కడ కిలో జీడిపప్పు 30 రూపాయలకే దొరుకుతుంది, ఎక్కడో కాదు మన దేశంలోనే

ఇక్కడ కిలో జీడిపప్పు 30 రూపాయలకే దొరుకుతుంది, ఎక్కడో కాదు మన దేశంలోనే

High Cholesterol: కాళ్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే మీకు అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్టే

High Cholesterol: కాళ్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే మీకు అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్టే

టాప్ స్టోరీస్

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం