By: Haritha | Updated at : 13 Feb 2023 08:40 AM (IST)
(Image credit: Pixabay)
క్యాండిల్స్ వాడే వారి సంఖ్య తక్కువగానే ఉంది. దానికి కారణం ప్రస్తుత కాలంలో కరెంటు ఎక్కువగా పోకపోవడం. కరెంటు పోయినప్పుడు మాత్రమే వెలుగు కోసం కొవ్వొత్తులను వాడుతున్నారు. కానీ ఆరోగ్యం కోసం కూడా సువాసనలు వీచే కొవ్వొత్తులను వాడమని చెబుతున్నాయి అధ్యయనాలు. సువాసనలు వీచే సెంటెడ్ క్యాండిల్స్ వాడడం వల్ల మన ఆరోగ్యం పై ఎంతో ప్రభావం కనిపిస్తుంది.
చక్కటి నిద్ర
మనలో జీవ గడియారం అని పిలిచే ఒక నిద్రా చక్రం ఉంటుంది. అంటే రోజూ ఏ టైంకి మనం నిద్రపోతామో, మరుసటి రోజు అదే టైంకి నిద్ర వచ్చేలా చేయడమే దీని పని. ఇది ఒక సిర్కాడియన్ రిథమ్. నిద్రపోవడానికి ముందు సెంటెడ్ క్యాండిల్స్ వెలిగించుకోవడం వల్ల చక్కటి నిద్ర పడుతుంది. గదిలో తక్కువ వెలుగునిచ్చే నీలి బల్బుల కన్నా, ఇలా క్యాండిల్స్ వెలిగించుకోవడం వల్ల మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది. నిద్ర హాయిగా పడుతుంది.
జ్ఞాపకశక్తి
మెదడు చేసే అత్యంత ముఖ్యమైన విధుల్లో ఒకటి జ్ఞాపకశక్తి. మెదడుకు కావాల్సిన ప్రశాంతత, సమతుల ఆహారం దొరకకపోతే దాని జ్ఞాపకశక్తి తగ్గే అవకాశం ఉంది. జ్ఞాపకశక్తి, భావోద్వేగాలు అనేవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. రోజూ నిద్రపోయే ముందు సెంటెడ్ క్యాండిల్ వెలిగించుకుంటే సువాసన శాస్త్రం ప్రకారం జ్ఞాపకశక్తి మెరుగవుతుంది.
మానసిక ప్రశాంతత
ఒకరి మానసిక స్థితి వారు చేసే పని ఉత్పాదకతపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఒత్తిడిని కూడా కలిగిస్తుంది. ఇలా ఒత్తిడి లేకుండా ప్రోడక్టివిటీ పెరగాలంటే మీ మానసిక స్థితి చాలా మెరుగ్గా ఉండాలి. మానసిక ఆందోళన తగ్గాలి. ఈ రెండూ కూడా సెంటెడ్ క్యాండిల్స్ చేయగలదు కాబట్టి రోజూ ఒక సెంటెడ్ కాండిల్ అయినా ఇంట్లో వెలిగించుకుని ప్రశాంతంగా నిద్రపోండి.
ఒత్తిడి లేకుండా
సువాసన కొవ్వొత్తి శరీరంలో ఒత్తిడిని కలిగించే కార్డిసాల్ హార్మోన్ స్థాయిలను తగ్గిస్తుంది. అదే సమయంలో డోపమైన్ వంటి ఆనంద హార్మోన్లను పెంచుతుంది. దీనివల్ల మెదడులో రసాయనాల ప్రవాహం మెరుగుపడుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించి, శక్తిని పెంచుతుంది. కాబట్టి సెంటెడ్ క్యాండిల్స్ ఇంట్లో ఉండేటట్టు చూసుకోండి.
ఆధ్యాత్మిక ఆరోగ్యం
మీకు ఇంట్లోనే మెడిటేషన్, యోగా వంటివి సాధన చేసే అలవాటు ఉంటే, అవి చేస్తున్నప్పుడు సెంటెడ్ క్యాండిల్స్ వెలిగించుకోండి. జాస్మిన్, లావెండర్, పెప్పర్మెంట్ వంటి ఆహ్లాదకరమైన వాసనలు వీచే ఈ క్యాండిల్స్ మీలో పాజిటివిటీని పెంచుతాయి. అంతేకాదు యోగా, మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఈ వాసన పీల్చడం వల్ల ఆ రెండు మరిన్ని ప్రయోజనాలను అందిస్తాయి.
Also read: ఒక క్యాన్సర్ కణితే ఎంతో బాధిస్తుంది, పాపం ఈమెకు శరీరంలో 20 క్యాన్సర్ కణితులు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Gut Health:స్వీట్స్ తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుందా? అందుకు కారణం ఇదే
Womans Health: మహిళలూ మీ వయసు నలభై దాటిందా? ఈ రోగాలు దాడి చేసే ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త
Sore Curd: పులిసిన పెరుగు పడేస్తున్నారా? ఈ ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు
Food Habits: మీ ఆహారపు అలవాట్లు ఇలా ఉంటే రోగాల భయమే ఉండదు
Lemon Water: రోజూ నిమ్మరసం తాగుతున్నారా? దాని వల్ల ఎన్ని ప్రమాదాలున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
గంటా శ్రీనివాసరావు ఓటేస్తారా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరగబోయేదేంటీ?
KCR Tour: నేడు 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన - పూర్తి షెడ్యూల్ ఇదీ
DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య
Stocks to watch 23 March 2023: ఇవాళ్టి ట్రేడ్లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - HAL, Heroపై ఓ కన్నేయండి