Teeth: దంతాలు పసుపు రంగులోకి మారుతున్నాయా? ఈ చిట్కాలు పాటిస్తే మిలమిలా మెరిసిపోతాయ్!
పసుపు రంగు దంతాలు మీ చిరునవ్వుని మాయం చేస్తాయి. దాని నుంచి బయట పడేందుకు ఇవిగో మార్గాలు.
పసుపు రంగులోకి దంతాలు ఆరోగ్యానికి, అందానికి మంచివి కాదు. తెల్లగా ఉండాల్సిన పళ్ళు పసుపు రంగులోకి మారడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వృద్ధాప్యం, పళ్ళు శుభ్రంగా తోముకోకపోవడం, కొన్ని ఆహార పదార్థాలు వంటి ప్రధాన కారణాల వల్ల దంతాలు రంగు మారుతాయి. దాని వల్ల మీరు నలుగురిలో నవ్వడానికి కూడా ఇబ్బంది పడతారు. మీరు ప్రశాంతంగా, హాయిగా చిరునవ్వు చిందించడానికి ఇబ్బంది పడతారు. అలా రంగు మారిన పళ్లను ఇంట్లో దొరికే వాటితోనే శుభ్రం చేసుకుని తెల్లటి దంతాలను మీ సొంతం చేసుకోవచ్చు.
దంతాలు పసుపు రంగులో మారడానికి కారణాలు
⦿ టీ, కాఫీ, వైన్, సోడా వంటి ఇతర రకాల పానీయాలు రోజూ ఎక్కువగా తీసుకోవడం.
⦿ పళ్ళు శుభ్రంగా తోమకపోవడం.
⦿ వయస్సు రీత్యా పళ్ల మీద ఉండే ఎనామిల్ అరిగిపోవడం.
⦿ ఆహారం, పానియాల్లో ఉండే కొన్ని యాసిడ్స్.
⦿ నోటి ద్వారా శ్వాస తీసుకోవడం.
⦿ బ్లూబెర్రీస్, చెర్రీస్, దుంపలు లేదా దానిమ్మ వంటి కొన్ని ఆహారాలు.
⦿ కొన్ని మందులు వల్ల కూడా దంతాలు రంగులు మారుతాయి.
⦿ చక్కెర పానీయాలు.
⦿ ధూమపానం, పాన్ మసాలా, పొగాకు నమలడం వంటివి చేయడం.
ఇవే కాకుండా వయసు రీత్యా కూడా పళ్ళు రంగు మారిపోతాయి. వాటి నుంచి బయటపడి తెల్లటి పళ్ళు మీకు కావాలంటే ఇంట్లో దొరికే వాటితోనే ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
బేకింగ్ సోడాతో పళ్ళు తోమడం
పళ్ళు తెల్లబడటానికి ఉత్తమమైన, అత్యంత అందుబాటులో ఉన్న సహజ పరిష్కారాలలో ఒకటి బేకింగ్ సోడా. దీన్నే సోడియం బైకార్బోనేట్ అని కూడా పిలుస్తారు. దంతాలు తెల్లబడే సామర్థ్యాన్ని ఇది పెంచుతుంది. రంగు పాలిపోవడాన్ని తగ్గిస్తుంది. బేకింగ్ సోడాను పటిక పొడిని సమాన నిష్పత్తిలో కలిపి ఆ మిశ్రమాన్ని బ్రష్ తో సున్నితంగా తోముకోవాలి. వారానికి రెండు సార్లు ఈ విధంగా పళ్ళు తోముకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. బేకింగ్ సోడాతో టూత్ పేస్ట్ కలిపి కూడా బ్రష్ చెయ్యొచ్చు.
వేప పుల్ల
ఎన్నో ఏళ్లుగా వేప పుల్లతో పళ్ళు శుభ్రం చేసుకుంటూ ఉండటం చూస్తూనే ఉంటున్నాం. వేపలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి టూత్ పేస్ట్ లో ఉండవు. అందుకే ఇప్పటికీ గ్రామాల్లో చాలా మంది వేప పుల్లతోనే పళ్ళు తోముకుంటారు. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు పసుపు మరకల్ని తొలగించి దంతాలను తెల్లగా చేస్తుంది. చిగుళ్ళను కూడా బలోపేతం చేస్తుంది. నోటి దుర్వాసన తొలగించి బ్యాక్టీరియాను దూరంగా ఉంచుతుంది. నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నీళ్ళల్లో ముంచిత తర్వాత వేప పుల్లతో పళ్ళు శుభ్రం చేసుకోవచ్చు.
పండ్ల తొక్కులు
పండ్లు మీ దంత ఆరోగ్యానికి అద్భుతంగా పని చేస్తాయి. అరటిపండు, నిమ్మకాయ, నారింజ తొక్క, స్ట్రాబెర్రీ పేస్ట్ ని దంతాలకు అప్లై చేయడం వల్ల అవి తెల్లగా, బలంగా మారతాయి. నిమ్మకాయ తొక్క లేదా రసంతో కూడా బ్రష్ చేసుకోవచ్చు.
కొబ్బరి నూనెతో పుల్లింగ్
ఆయిల్ పుల్లింగ్ థెరపీ సహజమైనది, సురక్షితమైనది. అంతే కాదు ఎటువంటి ప్రతికూల ప్రభావాలను కూడా ఇది చూపించదు. నోటి పరిశుభ్రతని కాపాడుకునేందుకు ఇది మంచి మార్గం. ఈ టెక్నిక్ శరీరం నుండి విషాన్ని తొలగించి, దంతాలను తెల్లగా, ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడుతుంది. కొబ్బరి నూనె బ్యాక్టీరియాను చంపడానికి సహకరిస్తుంది.
తులసి
దంతాలు తెల్లబడటానికి తులసి ఆకులు చాలా ఉపయోగపడతాయి. ఎండిన లేదా మెత్తగా చేసిన తులసి ఆకుల పేస్ట్ ని ఆవ నూనెతో కలుపుకుని పళ్ళు తోముకోవచ్చు. తులసి మౌత్ వాష్ యాంటీప్లాక్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది బ్యాక్టీరియాను ప్రభావవంతంగా ఎదుర్కొంటుంది.
Also Read: గజినీలకు గుడ్ న్యూస్, ఆ క్యాప్ పెట్టుకుంటే మతిమరుపు పోతుందట!
Also Read: పోషకాల పవర్ హౌస్ కివీ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే అసలు వదిలిపెట్టరు