Chole Bhature: ‘పూరీ-కూర’వెయ్యి రూపాయలట... ఎక్కడో తెలుసా?
ఛోలే బటురే మన నార్త్ ఇండియన్ స్టైల్ వంటకం. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు.
ఉత్తరభారతదేశానికి చెందిన రుచికరమైన వంటకం ‘చోలే బటురే’.నార్త్ ఇండియా నుంచి ఇది దేశమంతా పాకింది ఈ వంటకం. తెలుగు ఆహారప్రియులు మాత్రం దీన్ని సింపుల్‌గా ‘పూరీ - కూర’ అని పిలుచుకుంటారు. సాధారణంగా దీని రేటు ప్రాంతాన్ని బట్టి, అమ్మే హోటల్ స్థాయిని బట్టి ఉంటుంది. రోడ్డు సైడు బండ్ల మీద అమ్మితే ప్లేటు ధర రూ.30 నుంచి 40 ఉంటుంది. అదే పెద్ద హోటల్ లో అయితే రూ.300 ఉంటుంది. కానీ ఓ నెటిజన్ తాను ఏకంగా ఒక పూరీ, గుప్పెడు కూర, కాస్త సలాడ్‌కి రూ. 1000 చెల్లించాడట.
ఎక్కడంటే...?
స్వీడన్లోని స్టాక్‌హోమ్ నివసిస్తున్న ఓ భారతీయుడు దగ్గర్లోని హోటల్‌కి వెళ్లి చోలే బటురే ఆర్డర్ ఇచ్చారు. వాళ్లు రూ.1000 బిల్లు వేసిచ్చారు. అది చూసి గుండె గుభేల్ మంది ఆ వ్యక్తికి. ఆ తరువాత ప్లేటులో వారు తెచ్చిన వంటకాన్ని మరీ ఆశ్చర్యమేసింది. పూరీలాంటి ఓ రొట్టెపై, కూర ముద్దని, ఆ పైన సలాడ్ ని చల్లి ఇచ్చారు. అది చూసి కనీసం తినాలనిపించలేదు అతడికి. ఆ రెస్టారెంట్ ఏదో స్వీడన్ జాతీయులు పెట్టినది కూడా కాదు. అది పూర్తిగా ఇండియన్ హోటల్. భారతీయులంతా విదేశాలలో ఇండియన్ రెస్టారెంట్లకే వెళ్తుంటారు. అయితే ఈ మరొక వింతైన విషయం ఏంటంటే ప్లేటులో ఫోర్క్, స్పూను కూడా పెట్టి ఇచ్చారు. మనదేశంలో ఎక్కడా కూడా పూరీని స్పూనుతో లేదా ఫోర్క్ తో తినరు.
ఆ వ్యక్తి చోలే బటురేకు ఫోటోలు తీసి రెడ్డిట్ పంచుకున్నారు. ‘లేడీస్ అండ్ జెంటల్మన్... స్వీడన్లోని స్టాక్ హోమ్ లో నాకు వడ్డించిన చోలే బటురే ఇది. ఇంటిని చాలా మిస్ అవుతున్నా’ అని క్యాప్షన్ పెట్టారు. దీనికి నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. కొంతమంది ‘డిస్‌గస్టింగ్’ అని కామెంట్ చేయగా, మరికొందరు ‘కచోరీ తయారుచేయబోయి ఇలా పూరీ చేసి ఇచ్చినట్టున్నాడు’ అని కామెంట్లు చేశారు.
Read Also: నిద్ర సరిగా పట్టడం లేదా... ఈ విటమిన్ల లోపం ఉందేమో చెక్ చేసుకోండి
Read Also: అబార్షన్ చేయించుకున్నాక ఎలా ఉంటుందో తెలుసా? ఈ బాధలన్నీ భరించాల్సిందే
Read Also: ఒక సరస్వతి మొక్కను పెంచుకోండి, ఆ ఆకుల రసంతో ఎన్నో ఆరోగ్యసమస్యలు తొలగిపోతాయి
Read Also: ఈ కూరల్లో కొలెస్ట్రాల్ తక్కువ, బరువు తగ్గాలనుకునే వాళ్లకి ప్రత్యేకం
Read Also: నల్లకోడి చికెన్, గుడ్లు తింటే ఇన్ని లాభాలా? అందుకేనా దానికంత రేటు...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి