అన్వేషించండి

Blood Tests : రొటీన్​కు భిన్నంగా వైద్యులు సూచిస్తోన్న 5 రక్త పరీక్షలు.. వీటితో వ్యాధులు ముందుగానే గుర్తించవచ్చా?

Doctor Recommends 5 Blood Tests : రొటీన్ బ్లడ్ టెస్టులతో పాటు గుండెజబ్బులు, మధుమేహం వంటి వ్యాధులను ముందుగా గుర్తించేందుకు కొన్ని టెస్ట్​లు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అవేంటంటే.. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వైద్యులు ఐదు ప్రత్యేక రక్త పరీక్షలు ముందస్తు రోగ నిర్ధారణకు సిఫార్సు చేశారు.
  • అపోబి, హెచ్ఎస్-సీఆర్పీ గుండె, ఇన్ఫ్లమేషన్ ప్రమాదాలను ముందే అంచనా వేస్తాయి.
  • ఒమేగా-3, ఫాస్టింగ్ ఇన్సులిన్ పరీక్షలు జీవక్రియ ఆరోగ్యాన్ని తెలుపుతాయి.
  • హోమోసిస్టీన్ రక్తనాళాల ఆరోగ్యం, బి-విటమిన్ల లోపాలను గుర్తిస్తుంది.

5 Blood Tests May Reveal Hidden Health Risks : సాధారణంగా ఆరోగ్యాన్ని చెక్ చేసుకోవడానికి చాలామంది బ్లడ్ షుగర్, లిపిడ్ ప్రొఫైల్, లివర్, కిడ్నీ ఫంక్షన్ వంటి రొటీన్ బ్లడ్ టెస్టులు చేయించుకుంటారు. అయితే కొన్ని వ్యాధులు ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు కనిపించకుండా నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంటాయి. అలాంటి పరిస్థితులను ముందుగానే గుర్తించేందుకు కొన్ని ప్రత్యేక రక్త పరీక్షలు ఉపయోగపడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

వైజాగ్​లోని అన్ష్ హాస్పిటల్​లో సర్జికల్ ఆంకాలజిస్ట్​గా చేస్తోన్న డాక్టర్ రఘువంశీ రొటీన్​కు భిన్నంగా 5 బ్లడ్​ టెస్ట్​ల చేయించుకోవాలని సూచిస్తున్నారు. మరి ఆ టెస్ట్​లు ఏంటి.. వాటివల్ల ఏయే వ్యాధులను ముందుగా గుర్తించవచ్చో.. ఎవరు కచ్చితంగా ఈ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలో చూసేద్దాం. 

Apolipoprotein B (ApoB) Test

''చాలామంది గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి లిపిడ్ ప్రొఫైల్, మొత్తం కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ వంటి పరీక్షలు చేయించుకుంటారు. అయితే Apolipoprotein B (ApoB) పరీక్ష రక్తంలో ధమనుల్లో పేరుకుపోయే హానికరమైన కొలెస్ట్రాల్ కణాల సంఖ్యను మరింత ఖచ్చితంగా అంచనా వేయగలదు'' అని డాక్టర్ రఘువంశీ తెలిపారు. 

Also Read : బీపీ ఎక్కువ, తక్కువ ఉన్నా, గుండె సమస్యలు ఉన్నా.. లైంగిక కోరికను పెంచే ట్యాబ్లెట్స్ వాడకూడదా?

ఈ టెస్ట్ ద్వారా గుండెపోటు లేదా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం ఉందా అనే విషయాన్ని ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డయాబెటిస్, ఊబకాయం లేదా కుటుంబంలో గుండెజబ్బుల చరిత్ర ఉన్నవారికి ఈ పరీక్ష ఉపయోగకరంగా ఉండొచ్చు.

High-Sensitivity C-Reactive Protein (hs-CRP)


Blood Tests : రొటీన్​కు భిన్నంగా వైద్యులు సూచిస్తోన్న 5 రక్త పరీక్షలు.. వీటితో వ్యాధులు ముందుగానే గుర్తించవచ్చా?

శరీరంలో దాగి ఉన్న దీర్ఘకాలిక ఇన్‌ఫ్లమేషన్‌ను గుర్తించడంలో High-Sensitivity C-Reactive Protein (hs-CRP) పరీక్ష సహాయపడుతుంది. శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటే గుండె జబ్బులు, టైప్-2 డయాబెటిస్ వంటి సమస్యల ప్రమాదం పెరగవచ్చని రఘువంశీ తెలిపారు. కొన్ని సందర్భాల్లో ఇతర ఆరోగ్య సమస్యలతో కూడా దీనికి సంబంధం ఉండొచ్చు. కాబట్టి ఈ ఫలితాలను ఇతర పరీక్షలు, లక్షణాలతో కలిపి సమస్యను వైద్యులు చెప్తారు. 

Omega-3 Index Test

డాక్టర్ రఘువంశీ ప్రకారం.. శరీరంలో ఒమేగా-3 స్థాయి తక్కువగా ఉంటే గుండె ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో పాటు మెదడు పనితీరు, ఇన్‌ఫ్లమేషన్‌పై కూడా ప్రభావం చూపవచ్చు. ఈ స్థాయిలు తక్కువగా ఉంటే వైద్యుల సూచన మేరకు చేపలు, ఫ్లాక్స్ సీడ్స్, వాల్‌నట్స్ వంటి ఒమేగా-3 అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం లేదా అవసరమైతే సప్లిమెంట్లు ఉపయోగించవచ్చు.

Also Read : తేనెలో వెల్లుల్లి ముంచి ఉదయాన్నే తింటే కలిగే లాభాలివే.. బరువు తగ్గడం నుంచి గుండె ఆరోగ్యం వరకు

Fasting Insulin Test


Blood Tests : రొటీన్​కు భిన్నంగా వైద్యులు సూచిస్తోన్న 5 రక్త పరీక్షలు.. వీటితో వ్యాధులు ముందుగానే గుర్తించవచ్చా?

రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణంగా ఉన్నా, శరీరంలో ఇన్సులిన్ నిరోధకత ప్రారంభమై ఉండొచ్చు. ఈ పరిస్థితిని ముందుగానే గుర్తించడంలో Fasting Insulin Test ఉపయోగపడుతుంది. ఇన్సులిన్ నిరోధకతను ప్రారంభ దశలో గుర్తిస్తే జీవనశైలిలో మార్పులు, వ్యాయామం, సరైన ఆహారంతో భవిష్యత్తులో మధుమేహం వచ్చే ప్రమాదాన్ని కొంతవరకు తగ్గించే అవకాశం ఉంటుంది.

Homocysteine Test

రక్తంలో హోమోసిస్టీన్ అనే పదార్థం స్థాయిలు ఎక్కువగా ఉంటే రక్తనాళాల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది. కొన్ని పరిశోధనల్లో ఇది గుండెజబ్బులు, మెదడు స్ట్రోక్ వంటి సమస్యల ప్రమాదంతో సంబంధం కలిగి ఉండవచ్చని గుర్తించారు. అలాగే విటమిన్ B6, B12, ఫోలేట్ లోపాల వల్ల కూడా హోమోసిస్టీన్ స్థాయిలు పెరగవచ్చు. 

Also Read : మూత్రంలో రక్తం కనిపిస్తుందా? కిడ్నీ క్యాన్సర్‌(Kidney Cancer)కు సంకేతం కావచ్చు.. నిర్లక్ష్యం చేయొద్దంటోన్న నిపుణులు

కాబట్టి ఈ 5 పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ రఘువంశీ సూచించారు. వీటి ద్వారా కొన్ని ప్రమాదకరమైన వ్యాధులు ముందుగానే గుర్తించి దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చని తెలిపారు. 

ఎవరు చేయించుకుంటే మంచిది?


Blood Tests : రొటీన్​కు భిన్నంగా వైద్యులు సూచిస్తోన్న 5 రక్త పరీక్షలు.. వీటితో వ్యాధులు ముందుగానే గుర్తించవచ్చా?

ఈ టెస్ట్​లు వైద్యులు సూచించినా.. లేదా కుటుంబంలో గుండెజబ్బులు లేదా డయాబెటిస్ ఎవరికైనా ఉన్నా చేయించుకుంటే మంచిది. అలాగే అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారు, హై బీపీ, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు, స్మోకింగ్ చేసే వారు, 40 ఏళ్లు దాటిన తర్వాత రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించుకునే వారు వీటిని కూడా చేయించుకుంటే బెటర్. ఎందుకంటే ఈ పరీక్షలు ఆరోగ్య ప్రమాదాలను ముందుగానే అంచనా వేయడంలో సహాయపడతాయి.

ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని ఆర్టికల్స్ కోసం దీనిని క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Flu Vaccine : ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
Embed widget