Type 2 Diabetes: రోజూ రెడ్ మీట్ తింటున్నారా? డయాబెటిస్ ముప్పు తప్పదంటున్న పరిశోధకులు
ప్రతి రోజూ రెడ్ మీట్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. రెగ్యులర్ గా మాంసం తీసుకునే వారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు.
Does Red Meat Cause Diabetes: మన ఆహారపు అలవాట్లే, మన ఆరోగ్యాన్ని కాపాడుతాయంటున్నారు నిపుణులు. రోజూ మాంసం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు. ముఖ్యంగా రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసం వీలైనంత వరకు తగ్గించాలంటున్నారు. రెడ్ మీట్ అధికంగా తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ముప్పు పెరుగుతుందంటున్నారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంలోఈ విషయం వెల్లడైంది. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో దాదాపు 2 మిలియన్ల మందిపై జరిపిన పరిశోధనలో ఈ విషయం తేలింది.
మాంసంతో మధుమేహం ముప్పుపై అధ్యయనం
ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రినాలజీ జర్నల్ తాజాగా ప్రచురించిన ఓ కథనం.. రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసం రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల టైప్ 2 మధుమేహం ముప్పు పెరుగుతున్నట్లు వెల్లడించింది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఆసియా, ఐరోపా, అమెరికా సహా పలు ప్రాంతాల్లో సుమారు 1.97 మిలియన్ల మంది అధ్యయనం నిర్వహించారు. మాంసం వినియోగం, టైప్ 2 మధుమేహం మధ్య సంబంధాన్ని కనుగొనే ప్రయత్నం చేశారు. ఈ పరిశోధన ప్రకారం ప్రతిరోజూ 50 గ్రాముల ప్రాసెస్ చేసిన మాంసాన్ని తీసుకోవడం వల్ల వచ్చే 10 సంవత్సరాలలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 15 శాతం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. రోజుకు 100 గ్రాముల ప్రాసెస్ చేయని రెడ్ మీట్ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 10 శాతం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ప్రతి వారం రెండు సార్లు రెడ్ మీట్ తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు కనుగొన్నారు.
మాంసంతో టైప్ 2 డయాబెటస్ ఎందుకు వస్తుందంటే?
టైప్ 2 డయాబెటిస్ అనేది ఇన్సులిన్ నిరోధకత, రక్తంలో అధిక చక్కెర స్థాయిలలను కలిగి ఉంటుంది. ప్రాసెస్ చేసిన మాంసం, ప్రాసెస్ చేయని రెడ్ మీట్ రెండూ టైప్ 2 డయాబెటిస్ రిస్క్‌ను పెంచుతున్నట్లు పరిశోధన వెల్లడించింది. ప్రాసెస్ చేసిన మాంసంలోని హై ప్రిజర్వేటివ్‌లు, సోడియం ఇన్సులిన్ సెన్సిటివిటీని దెబ్బతీస్తాయి పరిశోధకులు వెల్లడించారు. రెడ్ మీట్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్, ఊబకాయం లాంటి వ్యాధులకు కారణం అవుతుందన్నారు.
రెడ్ మీట్‌కు బదులుగా ఏ ఫుడ్స్ తీసుకోవాలంటే?
రెడ్ మీట్‌తో పాటు ప్రాసెస్ చేసిన మాంసంతో రకరకాల వ్యాధుల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఫుడ్ తీసుకోవాలంటున్నారు నిపుణులు. చికెన్, ఫిష్ మాసంలో రెడ్ మీట్‌తో పోల్చితే తక్కువ సంతృప్త కొవ్వులు ఉంటాయంటున్నారు. అటు చిక్కుళ్లు, టోఫు లాంటి మొక్కల ఆధారిత ప్రొటీన్ తీసుకోవడం మంచిదంటున్నారు. క్వినోవా, బార్లీ, ఇతర తృణధాన్యాలు, గింజలు, విత్తనాలతో పాటు, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు అవసరమైన పోషకాలను శరీరానికి అందిస్తాయంటున్నారు.
రెడ్ మీట్ ను ఎంత తీసుకుంటే మంచిది?
రెడ్ మీట్‌లో జింక్, ఐరన్, విటమిన్ Bను ఉంటుంది. అందుకే పూర్తిగా మానేయడం మంచిది కాదు. రోజుకు 70 వరకు తీసుకోవడం మంచిదని UKలోని నేషనల్ హెల్త్ సర్వీస్ సిఫార్సు చేస్తోంది.
Read Also: ఇదో కొత్తరకం డయాబెటిస్- టైప్ 1.5 లక్షణాలు ఏంటో తెలుసా?