Crunchy Punugulu Recipe : ఇడ్లీ పిండితో టేస్టీ పునుగులు.. ఇలా చేస్తే కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయి
Punugulu Recipe : ఒక్కోసారి ఇడ్లీ తినాలనిపించదు. ఆ సమయంలో ఇంట్లో ఇడ్లీ పిండి ఉంటే.. వేడి వేడిగా కరకరలాడే పునులుగులు వేసుకోవచ్చు. వాటి రెసిపీ ఇదే
Tasty Breakfast Recipe : చలికాలంలో కాస్త టేస్టీ ఫుడ్ తినాలనిపిస్తుంది. కరకరలాడే ఫుడ్స్ అయితే అందరూ మరింత ఇంట్రెస్ట్గా తింటారు. అలాంటి వాటిలో పునుగులు ఒకటి. అయితే మీ ఇంట్లో ఇడ్లీ పిండి ఉంటే దీనికోసం తెగ కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఇంట్లేనే మీరు సింపుల్గా మరిన్నీ పదార్థాలు వేసి.. వీటిని తయారు చేసుకోవచ్చు. మరి వీటిని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏంటి? రెసిపీ ప్రాసెస్ ఇప్పుడు చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు
ఇడ్లీ పిండి - రెండు కప్పులు
పిండి లేకుంటే..
మినపప్పు - పావు కప్పు
బియ్యం - ముప్పావు కప్పు
అటుకులు - 2 టేబుల్ స్పూన్స్
ఉప్పు - రుచికి తగినంత
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
పచ్చిమిర్చి - 2
ఉల్లిపాయలు - పావు కప్పు
జీలకర్ర - అర టీస్పూన్
అల్లం - అంగుళం (తురుముకోవాలి)
తయారీ విధానం
మీ దగ్గర ఇడ్లీకోసం చేసిన పిండి ఉంటే దానిని ఉపయోగించవచ్చు. లేదంటే.. పునుగుల కోసం పిండిని చేసుకోవాలనుకుంటే.. మినపప్పును కడిగి నానబెట్టుకోవాలి. బియ్యాన్ని కూడా విడిగా నానబెట్టుకోవాలి. రాత్రి నానబెట్టుకుని ఉదయం కూడా చేసుకోవచ్చు. పిండి పులవాల్సిన అవసరం లేదు. మినపప్పు నానిన తర్వాత వాటిని మరోసారి కడిగి.. నీళ్లు వంపేయాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని.. దానిలో కొద్దిగా నీళ్లు పచ్చిమిర్చి, జీలకర్ర వేసి పిండిని గ్రైండ్ చేసుకోవాలి. దానిలోనే అల్లం తురుము కూడా వేసుకోవచ్చు. లేదంటే డీప్ ఫ్రైకి ముందు కూడా అల్లం తురుమును నేరుగా వేసుకోవచ్చు. పిల్లలు తినరు అనుకుంటే ఇలా పిండితోనే మిక్సీ చేసుకోవచ్చు.
మెత్తగా చేసుకున్న పిండిని ఓ మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు బియ్యాన్ని కూడా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా.. కాస్త గరుకుగా ఉండేలాగా ఈ మిక్స్ ఉండాలి. దీనిని మినపపిండిలో వేసి బాగా కలుపుకోవాలి. పునుగులు వేసే విధంగా పిండి రావాలి. అయితే దీనిని 4 గంటలు పులియబెట్టి వాడుకోవచ్చు. లేదంటే నేరుగా అప్పటికప్పుడే కూడా పనుగులు వేసుకోవడానికి వాడుకోవచ్చు.
ఇలా సిద్ధం చేసుకున్న పిండిలో అటుకుల పౌడర్ వేసి కలుపుకోవాలి. కాస్త ఇడ్లీ రవ్వ కూడా వేసి పిండిని బాగా కలుపుకోవాలి. ఓ పదినిమిషాలు పక్కన ఉంచి.. స్టౌవ్ వెలిగించాలి. దానిపై కడాయి ఉంచి.. డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకుని.. కాగనివ్వాలి. ఈలోపు పిండిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, నచ్చితే కరివేపాకు తురుము, రుచికి తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. జీలకర్ర కూడా వేసుకోవచ్చు.
ఇడ్లీ పిండితో వేసుకోవాలనుకున్నప్పుడు దానిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం తురుము నేరుగా వేసుకుని కలుపుకోవచ్చు. నూనె బాగా కాగిన తర్వాత.. దానిలో పిండిని పనుగులుగా వేయాలి. ఇలా వేసుకున్న వెంటనే మంటను మీడియంలోకి తగ్గించేయాలి. అని వైపులా గోల్డెన్ రంగు వచ్చేలా పనుగులను వేపుకుంటే సరి. అంతే వేడి వేడి టేస్టీ పునుగులు రెడీ. వీటిని పల్లీ చట్నీ లేదా.. కొత్తిమీర చట్నీతో కలిపి తినవచ్చు.
Also Read : నోరూరించే ఉసిరి పచ్చడి రెసిపీ.. వేడి వేడి అన్నంలో వేసుకుని నెయ్యితో తింటే ఉంటాది..