News
News
X

Biryani: నటుడు అజిత్ ఫేవరెట్ తాలా బిర్యానీ - సింపుల్ గా ఇలా ఇంట్లోనే చేసేయొచ్చు

బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మరి మీ ఫేవరెట్ హీరో ఇష్టంగా తినే బిర్యానీ తినాలని ఉందా? అయితే ఇలా చేసుకోండి.

FOLLOW US: 
Share:

టుడు అజిత్ తమిళ ప్రేక్షకులకి మాత్రమే కాదు తెలుగు వారికీ అభిమాన హీరోనే. ఐదు పదుల వయస్సులో కూడా సిక్స్ ప్యాక్ మెయింటైన్ చేస్తూ కుర్ర హీరోలకి ధీటుగా ఉంటున్నాడు. ఆయనకి ఎంతో ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా? తాలా బిర్యానీ. పలు ఇంటర్వ్యూస్ లో కూడా అజిత్ ఈ విషయాన్ని చెప్పారు. మరి మీ అభిమాన హీరోకి ఎంతో ఇష్టమైన తాలా బిర్యానీ ఎలా చేయాలో చూద్దామా!

కావాల్సిన పదార్థాలు

చికెన్- 750 గ్రాములు  

బియ్యం- 2 కప్పులు  

యాలకులు-2

లవంగాలు-2

దాల్చిన చెక్క- 2 ముక్కలు

అల్లం వెల్లుల్లి పేస్ట్- 2 టేబుల్ స్పూన్లు

నేయు- 2 టేబుల్ స్పూన్లు

నూనె- 2 టేబుల్ స్పూన్లు

ఉల్లిపాయలు- 2

కొత్తిమీర

టొమాటోలు-2

పచ్చి మిర్చి- 4

కారం- 1 టేబుల్ స్పూన్

పెరుగు-అరకప్పు

నీళ్ళు- ఆరు కప్పులు

నిమ్మరసం- 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం

ఒక గిన్నెలో నీళ్ళు, నిమ్మరసం కలిపి అందులో బియ్యం కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకోవాలి. అన్నం 60 శాతం మాత్రమే ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద మరొక మందపాటి పాత్ర పెట్టుకుని నెయ్యి, నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. అందులో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిర్చి వేసి 4-7 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో పసుపు, కారం, ఉప్పు వేసి మరికాసేపు ఉడికించుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ పెరుగు మిశ్రమం అందులో వేసుకుని మీడియం మంట మైయిదా 35 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి.

చికెన్ బాగా ఉడికి నూనె పైకి తేలిన తర్వాత కొన్ని చికెన్ ముక్కలు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పాత్రలో సగం ఉడికిన అన్నం పొరలు పొరలుగా వేసుకోవాలి. చివరిగా పక్కకి తీసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి దాని మీద మరొక లేయర్ అన్నం వేసుకోవాలి. దాని మీద కొన్ని కొత్తిమీర ఆకులు, నిమ్మరసం చల్లుకోవాలి. పాత్రలోని ఆవిరి బయటకి పోకుండా గోధుమ పిండితో పాత్ర మూత అతికించి పెట్టాలి. తర్వాత స్టవ్ మీద మరొక వెడల్పాటి తవా పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత ఈ చికెన్ మిశ్రమం ఉన్న పాత్ర పెట్టుకోవాలి. 15-20 నిమిషాల పాటు దమ్ మీద ఉడికించుకోవాలి. ఆవిరి బయటకి పోకుండా గిన్నె మీద బరువైన వస్తువు ఏదైనా పెట్టుకోవచ్చు. అంతే ఎంతో రుచికరమైన తాలా బిర్యానీ రెడీ అయిపోయింది. రైతాతో కలిపి తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం మీకు ఎంతో ఇష్టమైన హీరో అజిత్ ఫేవరెట్ బిర్యానీ మీరు చేసుకుని లాగించేయండి.

Also Read: 23 రోజుల్లో 18 కిలోలు తగ్గిన కన్నడ స్టార్ - ఈ టిప్స్ పాటిస్తే మీరు కూడా బరువు తగ్గొచ్చు

Published at : 13 Jan 2023 03:55 PM (IST) Tags: Biryani Tamil Actor Ajith Favorite Food Tala Biryani Tala Biryani Cooking Process

సంబంధిత కథనాలు

Kitchen Tips: పిండి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా నిల్వ చేయండి

Kitchen Tips: పిండి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా నిల్వ చేయండి

Air Fryer: ఎయిర్ ఫ్రైయర్‌లో అల్యూమినియం ఫాయిల్ ఉపయోగించొచ్చా? అలా చేస్తే ఇబ్బందులు వస్తాయా?

Air Fryer: ఎయిర్ ఫ్రైయర్‌లో అల్యూమినియం ఫాయిల్ ఉపయోగించొచ్చా? అలా చేస్తే ఇబ్బందులు వస్తాయా?

Paneer: పాలతోనే కాదు పప్పుతో కూడా పనీర్ తయారు చేసుకోవచ్చు, ఎలాగంటే

Paneer: పాలతోనే కాదు పప్పుతో కూడా పనీర్ తయారు చేసుకోవచ్చు, ఎలాగంటే

Rotis Cooking: రోటీలు చేసేటప్పుడు ఈ చిట్కాలు పాటించి చూడండి, మెత్తగా నోట్లో వేసుకుంటేనే కరిగిపోతాయ్!

Rotis Cooking: రోటీలు చేసేటప్పుడు ఈ చిట్కాలు పాటించి చూడండి, మెత్తగా నోట్లో వేసుకుంటేనే కరిగిపోతాయ్!

Green Peas Recipe: పచ్చిబఠానీ - చీజ్ కట్‌లెట్ రెసిపీ, సాయంత్రానికి టేస్టీ స్నాక్

Green Peas Recipe: పచ్చిబఠానీ - చీజ్ కట్‌లెట్ రెసిపీ, సాయంత్రానికి టేస్టీ స్నాక్

టాప్ స్టోరీస్

Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్‌ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా

Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్‌ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా

Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన

Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన

Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!

Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!

AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో  'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!