Weight Loss: 23 రోజుల్లో 18 కిలోలు తగ్గిన కన్నడ స్టార్ - ఈ టిప్స్ పాటిస్తే మీరు కూడా బరువు తగ్గొచ్చు
బరువు తగ్గడం కోసం ఇష్టమైన ఆహారం వదులుకోవాల్సిన అవసరం లేదు. ఈ నియమాలు సక్రమంగా పాటించారంటే ఆరోగ్యంగా బరువు తగ్గుతారు.
యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు, కన్నడ నటుడు ధ్రువ సజ్జా ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అందుకు కారణం ఆయన సన్నగా కనిపించడం. నెల రోజుల క్రితం లావుగా కనిపించిన ధ్రువ సజ్జా ఇప్పుడు సన్నగా మారిపోయారు. కేవలం 23 రోజుల్లో 18 కేజీల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచారు. అతను హీరోగా నటిస్తున్న ‘కేడీ - ది డెవిల్’ సినిమా కోసం ఆయన భారీగా బరువు తగ్గారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ గా మారాయి. నటుడు తన డైటీషియన్ సూచనల ప్రకారం కఠినమైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామాలు చేయడం వల్ల సన్నగా అయిపోయారు.
సాధారణంగా బరువు తగ్గాలని అనుకున్నపుడు అందరూ డైట్ ఫాలో అవడం, నచ్చిన ఆహారాలు తినకుండా పక్కన పెట్టేయడం చేస్తారు. కానీ అలా చేయడం వల్ల ఎక్కువగా తినాలని అనిపిస్తుందే తప్ప బరువు తగ్గాలనే లక్ష్యం సరైన దిశలో వెళ్లదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యంగా బరువు తగ్గడానికి కొన్ని చిట్కాలు పాటించాలి. వాటి ప్రకారం చేశారంటే మీరు కూడా కొన్ని రోజుల్లోనే పెట్టుకున్న లక్ష్యం ప్రకారం బరువు తగ్గి నాజూకుగా కనిపిస్తారు.
బ్రేక్ ఫాస్ట్ అసలు స్కిప్ చేయొద్దు
చాలా మంది ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ తినకుండా కేవలం ఒక అరటిపండు తినేసి కడుపు నింపేసుకుంటారు. కానీ అలా చేయకూడదని నిపుణులు అంటున్నారు. రోజంతా ఉల్లాసంగా ఉండటానికి ఎప్పుడు అల్పాహారం తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. ఇది మిమ్మల్ని అనవసరమైన చిరుతిళ్ల నుంచి దూరంగా ఉంచడమే కాదు.. శక్తిని, శరీరానికి అవసరమైన పోషణ అందిస్తుంది.
క్రమం తప్పకుండా తినాలి
క్రాష్ డైట్ ని ఫాలో అవడం, క్రమం తప్పకుండా తినకపోవడం వల్ల బరువు తగ్గడం ఎప్పటికీ సాధ్యపడదు. అవసరమైన పోషకాలు లేకపోవడం వల్ల ఎక్కువ కిలోలు పెరిగిపోతారు. అంతే కాదు అనవసరమైన ఆహారాలు ఎక్కువగా తినేలా చేస్తాయి.
పండ్లు, కూరగాయలు తినాలి
సీజనల్ పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్లు శరీరానికి అందుతాయి. ఇవి ఆరోగ్యకరమైన, దీర్ఘకాలిక బరువు తగ్గడానికి సహాయపడతాయి. బ్రేక్ ఫాస్ట్ లో తప్పనిసరిగా ఒక పండు ఉండేలా చూసుకోవడం మంచిది.
చురుకుగా ఉండాలి
యాక్టివ్ గా ఉండాలి. చిన్న చిన్న పనులు చురుకుగా చేసుకుంటూ ఉండాలి. ఒకే స్థలంలో కదలకుండా కూర్చుని ఉండటం ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. ఎంత తక్కువ కదులుతారో అంత ఎక్కువగా బరువు పెరుగుతారు. ఫలితంగా ఊబకాయం బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే చురుకుగా ఉండాలి, మెట్లు ఎక్కడం, బరువులు ఎత్తడం వంటివి ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకోవాలి.
నీరు తాగాలి
దాహంగా అనిపించినా కూడా అది ఆకలిగానే అనిపిస్తుంది. అటువంటి కేలరీలు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల బరువు పెరిగిపోతారు. కాబట్టి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలి. అతిగా తినడం మానుకోవాలి అంటే మంచిగా నీరు తాగాలి.
అన్ని పదార్థాలు తినాలి
బరువు తగ్గాలని కొన్ని తినకుండా వదిలిపెట్టేస్తారు. కానీ అది ఇతర ఆహారాలని అతిగా తినడానికి దోహదపడేలా చేస్తుంది. అలా కాకుండా ఇష్టమైన ఆహారం మితంగా తీసుకోవాలి. అవసరమైన పోషణ అందించే ఆహారం తీసుకోవడం వల్ల బరువు తగ్గేందుకు అవసరమైన కేలరీలని బర్న్ చేయడానికి సహాయపడుతుంది.
ఆల్కహాల్ అసలే వద్దు
మద్యం సేవించడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. అంతే కాదు బరువుని పెంచే అదనపు ఖాళీ కేలరీలని కూడా జోడిస్తుంది.
సరైన టైమ్ కి తినాలి
అల్పాహారం, భోజనం, రాత్రి వేళ డిన్నర్, సాయంత్రం స్నాక్స్ అన్ని సరైన టైమ్ కి ప్లాన్ చేసుకోవాలి. వాటి ప్రకారం మాత్రమే తీసుకుంటూ ఉండాలి. జంక్, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: పెరుగు రోజూ తింటున్నారా? జాగ్రత్త, ఈ సమస్యలు బాధిస్తాయ్!