National Vanilla Ice Cream Day: వామ్మో.. వెనిల్లా ఐస్ క్రీమ్‌కు ఇంత చరిత్ర ఉందా? దాన్ని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు, ఇదిగో ఇలా!
National Vanilla Ice Cream Day: జులై 23వ తేదీన జాతీయ వనిల్లా ఐస్ క్రీమ్ డేను జరుపుకుంటారు. ఈ రోజు ప్రత్యేకమైన ఆచారాలకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం
National Vanilla Ice Cream Day: పిల్లలైనా, పెద్దలైనా అందరికీ ఐస్‌క్రీం అంటే పిచ్చి. అయితే ప్రపంచంలోని ఇతర దేశాల కంటే అమెరికన్లు ఎక్కువ ఐస్ క్రీమ్‌లు తింటారని మీకు తెలుసా? అమెరికాలో జూలై నెలను 'నేషనల్ ఐస్ క్రీమ్ మంత్'గా జరుపుకుంటారు. జూలై మూడో ఆదివారాన్ని 'నేషనల్ ఐస్ క్రీమ్ డే'గా జరుపుకుంటారు. ఈసారి జులై 17న 'నేషనల్ ఐస్‌క్రీమ్ డే'ని జరుపుకున్నారు. ఇక ఐస్ క్రీములలో వెనిల్లా ఫ్లేవర్ అయితే చాలా మంది ఇష్టంగా తింటుంటారు. వెనిల్లా ఐస్ క్రీమును చాక్లెట్ కేక్, యాపిల్ క్రంబుల్, స్ప్రింక్స్ల్, స్ట్రాబెర్రీ సాస్ తో ఎంచక్కా తినవచ్చు. అందుకే దానికి కూడా ప్రత్యేమైన తేదీని కేటాయించారు. ఏటా జులై 23న నేషనల్ వనిల్లా ఐస్ క్రీమ్ డేను నిర్వహిస్తున్నారు. అయితే, ఈ రోజుకు చాలా ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. అవేంటో చూసేయండి.
వెనిలా ఐస్ క్రీమ్ చరిత్ర:
ఈ వెనిల్లా ఐస్ క్రీమ్ 14వ శతాబ్దానికి చెందినది. మొగల్ కోర్టులో యువాన్ కాలంలో దీన్ని మొదటిసారి తయారు చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. అయితే చల్లగా ఉంచేందుకు ఉప్పు, ఐస్ ఉపయోగించాలన్న ఆలోచన ఆసియాలోనే ప్రారంభమైంది. 711 - 1492 మధ్యకాలంలో మూర్స్, అరబ్బులు స్పెయిన్ దేశానికి వెళ్లినప్పుడు ఈ పద్దతి అక్కడికి వ్యాపించింది. ఈ పద్ధతి ఐరోపాకు వ్యాపించిన తర్వాత ఇటాలియన్లు ఐస్ క్రీమ్ తయారీలో నిమగ్నమయ్యారు. ఫ్రెంచ్ దేశస్థులు ఐస్ క్రీమ్ మరింత రుచి, స్మూత్ గా ఉండేందుకు ఈ రెసిపీలో గుడ్డును జోడించడం మొదలుపెట్టారు.
అయితే వెనిల్లాను మొదటిగా మెక్సికో దేశస్థులు ఎక్కువగా తిన్నారు. 1500ల నాటికి ప్రస్తుతం మెక్సీకోను పాలిస్తున్న స్పానిష్ ఆక్రమణదారులు తమ డైట్లో వెనిల్లాను చేర్చుకోవడం మెసో-అమెరికన్స్ చూశారు. ఇది గమనించిన స్పెయిన్ దేశస్థులు కూడా దాన్ని డైట్లో చేర్చారు. స్పెయిన్ లో తేనె, నీరు, మొక్కజొన్న, వనిల్లా, కాకో గింజలతో చాక్లెట్‌ను తయారు చేశారు. ఇది 1600వ సంవత్సరం ప్రారంభంలో ఇంగ్లండ్ , ఫ్రాన్స్, మిగతా యూరప్ దేశాలకు వ్యాపించింది. 1602లో క్వీన్ ఎలిజబెత్ 1 అపోథేకరీ, హ్యుమోర్గాన్, వనిల్లాను కోకోలో చేర్చరాదని సూచించారు. దీంతో ఫ్రెంచ్ దేశస్థులు కోకో లేని వనిల్లాను ఆహారంలో చేర్చుకున్నారు. దీంతో అసలు ఐస్ క్రీమ్ రుచిని ఆస్వాదించారు. అయితే థామస్ జెఫెర్సన్ ఫ్రాన్స్ లో సహజ రంగులో ఉన్న వెనిల్లా ఐస్ క్రీమ్‌ను బ్రౌన్ కలర్ లోకి మార్చి అమెరికాకు తీసుకువచ్చారు.
ఐస్ క్రీమ్ డే ఎలా జరుపుకోవాలి?
వెనిల్లా ఐస్ క్రీమ్ డే జరుపుకునేందుకు మీరు స్వంతగా ఐస్ క్రీమ్ తయారు చేయాలి. నేటికాలంలో ఐస్ క్రీమ్ తయారీ మెషీన్లు అందుబాటులో ఉన్నాయి. అయినా కూడా మీరు ఎలాంటి మెషీన్ సహాయం లేకుండానే ఐస్ క్రీమ్ తయారు చేయవచ్చు. ఎలాగో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
⦿ వెనిల్లా ఎసెన్స్ 2 టీస్పూన్స్
⦿ 1 కప్పు పంచదార
⦿ 2 కప్పుల క్రీమ్
⦿ 2 కప్పుల హెవీ విప్పింగ్ క్రీమ్
తయారీ విధానం:
ఒక పాన్ తీసుకుని దాన్ని ఫ్రీజర్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో పెద్ద పాన్ తీసుకుని అందులో నీళ్లు పోసి చక్కెర వేయాలి. చక్కెర కరిగిపోయిన తర్వాత మిగిలిన అన్ని పదార్థాలు వేసి దగ్గరకు వచ్చేవరకు కలపండి. ముందుగా ఫ్రీజర్‌లో పెట్టుకున్న పాన్ తీసుకుని అందులోకి ఈ మిశ్రమాన్ని మార్చండి. ఇప్పుడు అరగంటపాటు ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్ లో పెట్టండి. అరగంట తర్వాత ఫ్రిజ్ లో నుంచి తీసి టేస్ట్ చేయవచ్చు.
Also Read : గులాబ్ జామూన్ పొడితో ఇలా కేక్ చేసేయండి.. సండే స్పెషల్ సింపుల్ స్వీట్ రెసిపీ