రెస్టారెంట్ స్టైల్‌లో టేస్టీ టేస్టీ క్రిస్పీ కార్న్ - ఇదిగో ఇలా తయారు చెయ్యండి

రెస్టారెంట్‌లో తయారు చేసే క్రిస్పీ కార్న్‌ను మీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు.

ఇందుకు మీకు కావల్సినవి.. ఒక కప్పు స్వీట్ కార్న్ (తీపి మొక్కజొన్నలు) గింజలు

చిటికెడు పసుపు, 2 టీస్పూన్ల కార్న్ ఫ్లోర్, మైదా, ఆయిల్, పచ్చిమిర్చి.

ఇప్పుడు మీరు నీళ్లలో పసుపు, ఉప్పు, స్వీట్ కార్న్ వేసి ఉడికించండి. తర్వాత పక్కకు తీసి చల్లార్చండి.

ఆ తర్వాత నీళ్లు వేయకుండా ఉప్పు మిర్యాలపొడి, కార్న్ ఫ్లోర్, మైదా వేసి కలపండి.

అవి కలిసిన తర్వాత కొద్దిగా నీటి చుక్కలేసి కలపండి. అప్పుడు అవన్నీ గింజలకు అంటుకుంటాయి.

ఇప్పుడు ఆ గింజలను మరిగే నూనెలో వేసి.. క్రిస్పీగా వేయించండి.

తర్వాత దాన్ని జల్లెడలోకి తీసుకుని నూనె మొత్తం ఇంకేలా చెయ్యండి.

చివరిగా పాన్‌లో నూనె వేసి వెల్లులి, మిర్చి, ఉల్లి తరుగు, మసాలాలు వేసి వేయించండి.

Image Source: maayeka.com

2 నిమిషాల తర్వాత.. వేయించిన గింజలను వేసి కలపండి. అంతే.. టేస్టీ టేస్టీ క్రిస్పీ కార్న్ రెడీ.

Images credit: Pexels