సాయంత్రం అయితే టేస్టీగా తినాలనిపిస్తుందా? అయితే ఎగ్​ బజ్జీ చేసేయండి.

వర్షం వస్తున్నప్పుడు ఈ ఎగ్​ బజ్జీలో ఉల్లిపాయలు, నిమ్మరసం కలిపి తింటే ఉంటాది.

టేస్ట్ బాగుంటాది కానీ చేయడమేలా అనుకుంటున్నారా? రెసిపీ చాలా సింపుల్ అండి.

తినే క్వాంటిటీని బట్టి గుడ్లు ఉడికించి పెట్టుకోవాలి. పైన తొక్క తీసేయాలి.

ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో శెనగపిండి, చిటికెడు పసుపు, రుచికితగినంత సాల్ట్ వేసుకోవాలి.

వంట సోడా, జీలకర్ర, ధనియాల పొడి వేసి కలిపి.. నీళ్లు వేసి ఉండలు లేకుండా కలపాలి.

ఇప్పుడు స్టౌవ్ వెలిగించి.. దానిపై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడ నూనె వేసుకోవాలి.

నూనె వేడి అయ్యాక.. ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమంలో ఎగ్స్ వేయాలి.

గుడ్డుకు శనగపిండి మిశ్రమం బాగా అంటుకునేలా డిప్ చేసి నూనెలో వేయించి దించుకోవాలి.

ఈ ఎగ్​ బజ్జీలను కట్ చేసి.. దానిపై ఉప్పు, కారం, చాట్ మసాలా, ధనియాల పొడి చల్లుకోవాలి.

ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర తురుము చల్లుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ ఎగ్ బజ్జీ రెడీ. (Images Source : Envato)