Mutton Donne Biriyani : టేస్టీ మటన్ దొన్నె బిర్యానీ రెసిపీ.. మిలాద్ ఉన్ నబీ స్పెషల్‌గా దీనిని చేసుకుని లాగించేయండి
Milad un Nabi Special Recipe : మటన్‌ని చాలామంది ఇష్టంగా తింటారు. మీరు కూడా తినాలనుకున్నప్పుడు చిట్టిముత్యాల రైస్‌తో చేసే దొన్నె మటన్ బిర్యానీని ఇంట్లోనే చేసుకుని తినొచ్చు. రెసిపీ ఇదే..
Mutton Donne Biryani Recipe : మిలాద్ ఉన్ నబీ (Milad un Nabi 2024) సమయంలో నాన్‌వెజ్‌లో రకరకాల వంటలు తింటారు. నాన్‌వెజ్ రెసిపీలు మంచి అరోమాతో నోరూరించేస్తాయి. ముస్లింలు చేసుకునే వంటలకు ఏ మాత్రం తీసివేయాలేని.. టేస్టీగా ఇంట్లోనే చేసుకోగలిగే మటన్ దొన్నె బిర్యానీ గురించి తెలుసా? పైగా ఈ రెసిపీని బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలరు. ఇంతకీ ఈ టేస్టీ మటన్ దొన్నె బిర్యానీని ఎలా చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు
మటన్ - 500 గ్రాములు
బియ్యం - 3 కప్పులు (చిట్టి ముత్యాలు)
ఉల్లిపాయ - 1 పెద్దది
అల్లం - 1 అంగుళం
వెల్లుల్లి - 5 రెబ్బలు
పచ్చిమిర్చి - 10
కొత్తిమీర - చిన్న కట్ట
పుదీనా - గుప్పెడు
ధనియాలు - 1 టేబుల్ స్పూన్
యాలకులు - 4
లవంగాలు - 4
దాల్చిన చెక్క - 1 అంగుళం
అనాస పువ్వు - 1
మిరియాలు - 8
బిర్యానీ ఆకు - 1
పసుపు - 1 టీస్పూన్
కారం - 3 టీస్పూన్లు
నెయ్యి - 2 టేబుల్ స్పూన్స్
నూనె - 2 టేబుల్ స్పూన్స్
ఉప్పు - రుచికి తగినంత
నీళ్లు - వండేందుకు సరిపడా
తయారీ విధానం
ముందుగా మటన్‌ని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనాను కట్ చేసుకోవాలి. మిగిలిన పదార్థాలను కూడా రెడీ చేసుకోవాలి. స్టౌవ్ వెలిగించి దానిపై పాన్ ఉంచాలి. దానిలో నూనె వేసి.. ధనియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాసపువ్వు, మిరియాలు, బిర్యానీ ఆకు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. వాటి నుంచి మంచి అరోమా వచ్చే వరకు వేయించి.. దానిలో సన్నగా కోసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఆకులు వేసి వేయించుకోవాలి.
ఉల్లిపాయలు సాఫ్ట్‌గా మారేవరకు వేయించుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ ఆపేసి వాటిని కాసేపు చల్లారనివ్వాలి. అనంతరం వాటిని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌గా చేసుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి ప్రెజర్ కుక్కర్ పెట్టండి. దానిలో మటన్, ఉప్పు, పసుపు, కారం, ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ వేసి కలపాలి. దానిలో మటన్‌ని ఉడికించేందుకు సరిపడేంత నీటిని వేసుకోవాలి. మటన్‌ని 8 నుంచి 10 నిమిషాలు ప్రెజర్‌పై ఉడికించాలి. మటన్ 80 శాతం ఉడికిన తర్వాత.. మటన్‌ని పక్కన్ పెట్టుకోవాలి. మటన్ బ్రాత్ని కూడా పక్కనే ఉంచుకోవాలి.
Also Read : రంజాన్ స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ.. టేస్టీగా అరోమాతో రావాలంటే ఈ రెసిపీ ఫాలో అవ్వండి
ఇప్పుడు స్టౌవ్ వెలిగించి అదే కుక్కర్ పెట్టాలి. దానిలోలో నెయ్యి, కొంచెం ఆయిల్ వేసి మిగిలిన మసాలా పేస్ట్ వేసుకుని దానిలో వేయాలి. ముందుగా నానబెట్టుకున్న చిట్టిముత్యాల రైస్‌ని మరోసారి కడిగి దానిలో వేసి కలపాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలు దీనిలో వేయాలి. కలిపి.. దాని తర్వాత మటన్ బ్రాత్ని కూడా వేసి.. బియ్యం ఉడికేందుకు సరిపడా నీటిని వేయాలి. దానిలో ఉప్పుకూడా వేసి చివరిగా మరోసారి కలపాలి.
కుక్కర్ మూత పెట్టి ప్రెజర్‌పై మరో 8 నిమిషాలు ఉడికించాలి. అంతే టేస్టీ టేస్టీ మటన్ దొన్నె బిర్యానీ రెడీ. వేడిగా తింటే రుచి మరింత టేస్ట్‌గా ఉంటుంది. రైతాతో, ఉల్లిపాయలు, నిమ్మకాయలతో సర్వ్ చేసుకుని తింటే రుచిని అస్సలు మరచిపోలేరు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఈ టేస్టీ మటన్ రెసిపీని తయారు చేసుకుని హాయిగా లాగించేయవచ్చు. నార్మల్‌గా కూడా మటన్ తినాలనుకున్నప్పుడు దీనిని సింపుల్‌గా తయారు చేసుకుని తినేయవచ్చు. బ్యాచిలర్స్ కూడా ఈ రెసిపీని ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మటన్ బిర్యానీని తయారు చేసుకుని.. హాయిగా లాగించేయండి.
Also Read : బోనాల స్పెషల్ మటన్ పులావ్.. టేస్టీగా, ఈజీగా చేసుకునేందుకు ఈ రెసిపీ ఫాలో అయిపోండి