అన్వేషించండి

Maha Shivaratri 2024 : శివరాత్రి వేళ శివయ్యకు ఈ నైవేద్యాలు పెట్టేయండి.. శివునికి ప్రీతికరమైనది ఇదే

Shivaratri Special Recipes : మహాశివరాత్రి దాదాపు వచ్చేసింది. అయితే పండుగరోజు శివయ్యకు కొన్ని ఆహారాలను నైవేద్యంగా పెట్టవచ్చు. వాటిని ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

Maha Shivaratri 2024 : మహాశివరాత్రి 2024 సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైమ్ వచ్చేసింది. ప్రతి సంవత్సరం హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం ఫాల్గుణమాసం క్షీణిస్తున్న సమయంలో పద్నాలుగో రోజున మహాశివరాత్రిని జరుపుకుంటారు. ఈ పవిత్రమైన పండుగ ఈ సంవత్సరం మార్చి 8వ తేదీన వస్తుంది. శివరాత్రి సమయంలో శివుడు, పార్వతి కలిసి వారి దైవిక యాత్రను ప్రారంభిస్తారని భక్తులు నమ్ముతారు. ఈ రోజునే శివపార్వతులు వివాహం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే శివుడు, పార్వతి దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రజలు శివరాత్రి రోజున ఉపవాసాలు చేస్తారు. 

ఆదిదంపతుల కలయికకు గుర్తుగా.. వారి ఆశీర్వాదాలను పొందేందుకు ప్రపంచ నలుమూలల నుంచి శివభక్తులు ఈ పండుగను ఆనందంగా జరుపుకుంటారు. రాత్రులు జాగారం చేస్తారు. పండుగ రోజు శివునికి ఇష్టమైన వంటకాలు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇవి శివయ్యను సంతోషపెట్టడంలో మీకు సహాయం చేస్తాయి. నైవేద్యం, ప్రసాదంగా చేసే ఏ వంటకాల్లోనూ ఉల్లిపాయలు, వెల్లుల్లి లేకుండా చూసుకోండి. భగవంతుని ప్రసన్నం పొందేందుకు ఏమి నైవేద్యాలు చేయవచ్చు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

పంచామృతం

పంచ అంటే ఐదు. అమృతం అంటే అమృతం. మహాశివరాత్రి రోజు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి దీనిని కచ్చితంగా తయారు చేస్తారు. దీనిని స్టౌవ్ మీద వండాల్సిన అవసరం లేదు. పెరుగు, పాలు, నీరు, నెయ్యి, తేనెను ఉపయోగించి దీనిని తయారు చేస్తారు. ఈ పదార్థాలన్నింటి ఓ గిన్నెలో వేసి బాగా మిక్స్ చేసి.. స్వామికి సమర్పించాలి. 

ఖీర్

దాదాపు ఏ పండుగ వచ్చినా.. నైవేద్యంగా ఖీర్​ను పెడతారు. శివరాత్రి రోజున కూడా మీరు దీనిని తయారు చేసి శివయ్యకు నైవేద్యంగా పెట్టవచ్చు. అంజీర్ వంటి డ్రై ఫ్రూట్స్, బాదం, పిస్తా వంటి నట్స్​ను సన్నగా తరిగి.. నెయ్యిలో వేయించాలి. అనంతరం వాటిని పాలల్లో వేసి ఉడికించి.. డ్రై ఫ్రూట్ర్స్ ఖీర్​గా చేయవచ్చు. వీటిలో చక్కెర వేయాల్సిన అవసరం కూడా ఉండదు. దీనిని స్వామికి వారికి భక్తి శ్రద్ధలతో సమర్పించాలి. 

కిచిడీ..

శివరాత్రి రోజు చాలామంది ఉపవాసం ఉంటారు. అలాంటి వారు ఉపవాసం విరమించిన తర్వాత తినడానికి ఈ వంటకాన్ని చేస్తారు. అయితే దీనిని స్వామి వారికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు. అయితే ఈ రెసిపీని సగ్గుబియ్యంతో చేస్తారు. సగ్గుబియ్యం నానిన తర్వాత.. ఉడికించిన బంగాళదుంపలు, కరివేపాకు, పల్లీలు ఉపయోగించి ఈ కిచిడీని తయారు చేస్తారు. ఇది పోషకాలతో నిండిన రుచికరమైన ఫుడ్​గా చెప్తారు. 

శివుడికి ప్రీతికరమైన శ్రీఖండ్..

ఇది మహాశివునికి ఇష్టమైన ప్రసాదంగా చెప్తారు. దీనిని తయారు చేయడానికి ముందుగా ఓ కాటన్ క్లాత్​లో రెండు కప్పుల పెరుగు వేసి.. దానిని గట్టిగా ముడి వేయాలి. దానిలో నీరు పోయేలా వేలాడదీయాలి. పెరుగు పూర్తిగా డ్రై అయ్యిందని నిర్ధారించుకున్నాక.. దానిలో కుంకుమ పువ్వు, పాలు కలిపిన మిశ్రమాన్ని వేయాలి. దానిలో పంచదార, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. క్రీమ్​గా వచ్చేవరకు కలిపితే చాలా బాగుంటుంది. దీనిని సర్వింగ్ బౌల్​లోకి తీసుకుని డ్రై ఫ్రూట్స్​తో గార్నిష్ చేసి నైవేద్యంగా పెట్టేయాలి. ఇది మహాశివుడిని ప్రసన్నం చేసుకోవడానికి మంచి మార్గంగా చెప్తారు.  

Also Read : ఆర్గానిక్ కలర్స్​ను ఇలా ఎంచుకోండి.. హెల్తీ హోలీని చేసుకోండి

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!

వీడియోలు

Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Embed widget