Body Language: ఎదుట మనిషి మైండ్‌లో ఏముందో ఈ చిన్న ట్రిక్ ద్వారా పసిగట్టేయొచ్చు!
బాడీ లాంగ్వేజ్ ట్రిక్స్ తెలుసుకుంటే, అవతల మనిషి ఏం మాట్లాడకపోయినా, వాళ్లు మనసులో ఏం అనుకుంటున్నారో చెప్పొచ్చు. వాళ్లు ఫ్యూచర్లో చేసే పనులను ముందే పసిగట్టవచ్చు. అప్పుడు మీరొక మెజీషియన్ అయిపోతారు.
Body Language In Communication: బాడీ లాంగ్వేజ్ అనగానే బాడీ కదలికలను, జెస్చర్స్ ని బట్టి అవతల మనిషి ఏ స్థితిలో ఉన్నాడు..ఏం ఆలోచిస్తున్నాడు వంటి విషయాలు చెప్తుంటారు చాలామంది. కానీ కొన్ని సాధారణమైన విషయాలను మైండ్ లో ఉంచుకుంటే, బాడీ లాంగ్వేజ్ ను సింపుల్ గా డీ-కోడ్ చేయొచ్చు.
బాడీ లాంగ్వేజ్ ట్రిక్స్ తెలుసుకుంటే, అవతల మనిషి ఏం మాట్లాడకపోయినా, వాళ్లు మనసులో ఏం అనుకుంటున్నారో చెప్పొచ్చు. వాళ్లు ఫ్యూచర్లో చేసే పనులను ముందే పసిగట్టవచ్చు. ఒక గ్రూప్ మొత్తం ఏం మాట్లాడుకుంటుందో దూరంగా ఉండే తెలుసుకోవచ్చు. అప్పుడు మీరొక మెజీషియన్ అయిపోతారు. అయితే ఇది మ్యాజిక్ స్టిక్ పట్టుకున్నంత సింపుల్ గా కాదు. చాలా విషయాలు గమనించాల్సి ఉంటుంది.
బాడీ లాంగ్వేజ్ రీడ్ చేయగలగాలంటే ఏం చేయాలి?
కళ్లతో ప్రతీ విషయం గమనిస్తుండాలి
మాట్లాడుతున్నపుడు కచ్చితంగా అవతలి వ్యక్తిని చూస్తూనే మాట్లాడుతాం కానీ, మనకు అవసరమైన విషయాలను మాత్రమే మైండ్ రిజిస్టర్ చేస్తుంది. సీరియస్ గా ఒక సంభాషణ జరుగుతున్నపుడు అవతల వ్యక్తి ఏ రంగు దుస్తులు వేసుకున్నాడో అడిగితే టక్కున చెప్పలేం. అలాగే మనం కళ్లతో అన్నీ చూస్తున్నప్పటికీ అన్ని జెస్చర్స్ ని గమనించము. కానీ బాడీ లాంగ్వేజ్ చదవటం నేర్చుకుంటే ఇది వరకు ఎన్నెన్ని సూచనలు మిస్ అయ్యామో అనిపిస్తుంది. ఒక కొత్త దృష్టికోణం కనపడుతుంది.
ముందు మిమ్మల్ని మీరు గమనించండి
బాడీ లాంగ్వేజ్ ని చదవటం అంటే రకరకాల పరిస్థితుల్లో మనిషి మానసిక స్థితిని, బాడీ మూమెంట్స్ ద్వారా, జెస్చర్స్ ద్వారా అర్థం చేసుకోవటం. బాడీ లాంగ్వేజ్ ఎంత ఎక్కువగా గమనిస్తే అన్ని ఎక్కువ విషయాలు ఒక మనిషి గురించి తెలుస్తూ ఉంటాయి. అలా అవతలి వ్యక్తిని గమనించాలంటే ఎలాంటి ఎమోషనల్ స్థితిలో మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది.. మూమెంట్స్ ఎలా ఉన్నాయి అనేది గమనించుకోవటం వల్ల వేరే వారిని గమనించటం సింపుల్ అవుతుంది. మీ మానసికస్థితిని మీరు ఎంత బాగా అర్థం చేసుకున్నారు అనేదాని మీద మీ బాడీ లాంగ్వేజ్ స్కిల్స్ ఆధారపడి ఉంటాయి.
మీ కళ్లు మిమ్మల్ని మోసం చేయొచ్చు
అవతలి వ్యక్తి మానసిక స్థితిని వాళ్లు మాటల్లో చెప్పకముందే అర్థం చేసుకోవటం బాడీ లాంగ్వేజ్ ఉద్దేశ్యం. అయితే వారి జెస్చర్స్ ని బట్టి వెంటనే ఒక నిర్ణయానికి రాకుండా, దీని కంటే ముందూ, ఆ తర్వాత వారి జెస్చర్స్ కూడా ఆ సంభాషణలో గమనించటం చాలా అవసరం. అన్నింటిని గమనించాకే ఒక అంచనాకు రావాలి తప్ప ఒక్క సూచన చూసి జడ్జ్ చేయకూడదు. అది ఏ సందర్భం అనేది కూడా దృష్టిలో ఉంచుకోవాలి.
బాడీ లాంగ్వేజ్ చదివేటపుడు మొదట్లో చాలా తప్పుడు కంక్లూజన్స్ కి రావటం సహజమే. చాలాసార్లు జెస్చర్స్ అర్థం కావు. కాని ఎప్పటికప్పుడూ స్కిల్ కి పదును పెడుతూ, మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటూ ఉండటం వల్ల ఎంతో నేర్పు సంపాదించవచ్చు. దీనివల్ల ఫోకస్ పెరుగుతుంది. అయితే ఇంకో విషయం.. అదే పనిగా అవతలి వ్యక్తిని కళ్ళతో తినేసేలాగా చూడటం మ్యానర్స్ కాదు. మనం ఇక్కడ మనిషిని కాకుండా విషయాన్ని మాత్రమే గమనించాలి. అది కూడా అవతలి వ్యక్తి మిమ్మల్ని రీడ్ చేసేంత సింపుల్ గా దొరికిపోయేలా చూసేయకూడదు మరి!