Hollywood Puri : సినిమా ఇండస్ట్రీలు "వుడ్"లు ఎలా అయ్యాయి? పూరీ చెప్పిన ఈ స్టోరీ ..కథ కాదు నిజం !
హాలీవుడ్ ఇంటే ఇంగ్లిష్ చిత్ర పరిశ్రమ అనుకుంటాం. ఇంగ్లిష్ సినిమాలన్నీ హాలీవుడ్ అనుకుంటాం. కానీ హాలీవుడ్ అనేది ఓ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్. దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈ చరిత్రను తన మ్యూజింగ్స్‌లో చెప్పారు.
తెలుగు సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ కరోనా కారణంగా తీరిక దొరికినప్పుడల్లా పూరి మ్యూజింగ్స్ పేరుతో ఎవరికీ తెలియని విషయాలను పంచుకుంటూ ఉంటారు. ఈ సారి ఆయన సినీ పరిశ్రమలకు "వుడ్" అనే పేర్లు ఎలా వచ్చాయో ఆసక్తికరంగా వివరించారు. ఇప్పటి వరకూ ఎవరికీ తెలియని విషయాలు ఆయన తాజా మ్యూజింగ్స్ చెప్పారు. లాస్ ఏంజిల్స్‌లో ఎడారిలా ఉండే కొంత ప్రాంతాన్ని 1887లో హార్వే హెండర్సన్ విల్కాక్స్ అనే వ్యాపారి ప్లాట్లు చేసి అమ్మాలని డిసైడయ్యారు. ఎడారి ప్రాంతం కదా ఎలా కొంటారు.. అందుకే కొత్త ప్లాన్ వేశాడు. దానికో పేరు పెట్టి పెద్ద బోర్డు పెట్టాలని డిసైడయ్యాడు. ఏం పేరు పెట్టాలా అని ఆలోచించి.. చివరికి తన భార్య సూచించిన హాలీవుడ్ అనే పేరు ఖరారు చేశాడు. అదే పేరుతో పెద్ద బోర్డు కొండపై ఏర్పాటు చేశాడు.
https://www.youtube.com/watch?v=p-T4j9oym0g&t=143s
Also Read: కాపురాల్లోకి తొంగి చూడొద్దు... విడాకులకు, డబ్బుకు సంబంధమా? - చిన్మయి ఫైర్
తన మార్కెటింగ్ టెక్నిక్‌తో సినిమా వాళ్లకూ స్థలాలు అమ్మాడు. అప్పట్లో థామస్ అల్వా ఎడిసన్ కు మోషన్ పిక్చర్ తీయడానికి అవసరమైన పెటెంట్స్ ఉండేవి. ఆయన దగ్గర అనుమతి తీసుకోవడానికి ఆయన దగ్గరకు వచ్చేవారు. అయితే హాలీవుడ్ ఏరియాలో సినిమాలు తీసే వారికి పెటెంట్ అక్కర్లేదు. దీంతో చాలా మంది అక్కడే సినిమాలు తీయడం ప్రారంభించారు. రాను రాను అది హాలీవుడ్ సినిమాల కేంద్రంగా మారింది.అంతే కానీ సినీ పరిశ్రమకు హాలీవుడ్ అనే పేరు లేదు.
Also Read: రౌడీ హీరోకి షాకింగ్ రెమ్యునరేషన్.. లాభాల్లో వాటా కూడా..
అయితే హాలీవుడ్‌ను స్ఫూర్తిగా తీసుకుని అక్కడిలా ఇండియాలో ప్రత్యేకమైన ప్రదేశం లేనప్పటికీ.. ఇండస్ట్రీ మొత్తానికి ఖన్నా అనే వ్యక్తి బాలీవుడ్ అనే పేరు పెట్టారట. ఆ తర్వాత అన్నీ పరిశ్రమలు.. తమ భాషతో దగ్గరగా ఉన్న పదం చూసుకుని టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అని పెట్టుకున్నారు. ఇతర దేశాల వాళ్లూ కూడా అంతే. కొరియన్ వాళ్లు హోయూవుడ్, పాకిస్థాన్ వాళ్లు లాలీవుడ్ అని పెట్టుకున్నారు. ఇంతా చేసి తేలిందేమింటే.. హాలీవుడ్ అనేది ఓ రియల్ ఎస్టేట్ వెంచర్. పెద్ద బోర్డు.
Also Read: జాన్వి కపూర్ వేసుకున్న ఈ స్విమ్ సూట్ ధరెంతో తెలుసా? షాకవ్వడం ఖాయం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి