News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Pumpkin Seeds: బరువు తగ్గాలన్నా, పెంచాలన్నా అది గుమ్మడి విత్తనాలకే సాధ్యం

క్రంచీగా ఉండే గుమ్మడి గింజలు తినడానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే వీటిని సరైన మార్గంలో తీసుకుంటే మాత్రమే ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.

FOLLOW US: 
Share:

కరోనా వచ్చిన తర్వాత అందరికీ ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువగానే ఉంటుంది. హెల్తీ ఫుడ్ తినేందుకు మొగ్గు చూపిస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజుల్లో విత్తనాలు, నట్స్ కి బాగా డిమాండ్ ఏర్పడుతోంది. చియా విత్తనాల నుంచి అవిసె గింజల వరకు అనేక రకాల విత్తనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవే కాదు చాలా మంది గుమ్మడి విత్తనాలు కూడా తింటున్నారు. ఇవి సూపర్ ఫుడ్స్ గా పరిగణిస్తున్నారు. అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందించడం వల్ల విత్తనాలని డైట్లో భాగంగా తీసుకుంటున్నారు.

రక్తంలో చక్కెర స్థాయిలని తగ్గించడం దగ్గర నుంచి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే వరకు గుమ్మడి విత్తనాలు అనేక ప్రయోజనాలని అందిస్తున్నాయి. ఇవే కాదు అందరికీ ఎంతగానో ఉపయోగపడే విధంగా బరువు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. శరీరంలోని కొవ్వుని కరిగించేందుకు ఇవి సహాయపడుతున్నాయి. అందుకే మీరు కూడా ఆహారంలో గుమ్మడి గింజలు చేర్చుకోవడం వల్ల నాజూకైనా శరీర ఆకృతిని పొందవచ్చు.

గుమ్మడి గింజల ప్రయోజనాలు

⦿గుమ్మడికాయ గింజల్లో విటమిన్ బి, మెగ్నీషియం, ఐరన్, ప్రోటీన్ వంటి అనేక ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి. మితమైన మొత్తంలో వీటిని తీసుకున్నప్పుడు బరువు తగ్గడాన్ని సులభతరం చేస్తుంది.

⦿వీటిలో ఫైబర్ కూడా ఉంటుంది. ఇది ఎక్కువ సేపు పొట్ట నిండుగా ఉంచడంలో సహాయపడుతుంది. దాని వల్ల అతిగా తినడాన్ని తగ్గిస్తారు. ఫలితంగా బరువు తగ్గుతారు.

⦿ఇందులోని అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మలబద్ధకం సమస్య నుంచి నివారిస్తుంది.

⦿గుమ్మడి గింజల్లో ప్రోటీన్లు ఉన్నాయి. ఇవి బరువు తగ్గడానికి ఆకలిని మెరుగుపరిచేందుకు దోహదపడతాయి. పొట్ట నిండిన అనుభూతిని అందిస్తాయి.

⦿డిప్రెషన్, ఆర్థరైటిస్ వంటి సమస్యల నుంచి బయట పడేసేందుకు సహాయపడుతుంది.

ఎలా ఉపయోగించాలి?

⦿మీకు నచ్చిన విధంగా వివిధ ఆహరాలకి గుమ్మడి గింజలు జోడించుకోవచ్చు. అయితే బరువు తగ్గేందుకు వీటిని తీసుకోవాలని అనుకుంటే మాత్రం ఈ మార్గాలు అనుసరించడం మంచిది.

⦿సలాడ్, సూప్, తృణధాన్యాలతో కలిపి తీసుకోవచ్చు.

⦿మఫిన్లు, రొట్టెలు వంటి కాల్చిన వాటి మీద టాపింగ్ గా వేసుకోవచ్చు.

⦿పచ్చిగా లేదా ఇంట్లో తయారు చేసిన్ ట్రయల్ మిక్స్ లో తీసుకోవచ్చు.

⦿కూరల్లో చాలా మంది గుమ్మడి గింజల పేస్ట్ వేసుకుంటారు. ఇది వంటకి అదనపు రుచి ఇవ్వడమే కాదు చిక్కదనాన్ని అందిస్తుంది.

⦿గుమ్మడి గింజలు పొడి చేసుకుని పెట్టుకుని వివిధ ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవచ్చు.

⦿అవకాడో టోస్ట్ మీద వేసుకుని తినొచ్చు.

⦿నూడుల్స్ లేదా స్టైర్ ఫ్రైస్ తో గుమ్మడికాయ గింజలు కలిపి తినొచ్చు.

⦿వీటిని స్మూతీస్ లో కలుపుకుని తాగొచ్చు.

⦿పర్మేసన్ చీజ్ చేయడానికి బ్రెడ్ ముక్కలు, మసాలాతో కలిపి తీసుకోవచ్చు.

⦿పెరుగు, ఓట్ మీల్ తో జోడించుకుని తింటే టేస్టీ గా ఉంటుంది.

ఆరోగ్యాన్ని ఇస్తాయి కదా అని అతిగా గుమ్మడి గింజలు తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలు కలిగిస్తాయి. వీటిని పరిమితికి మించి తీసుకోవడం వల్ల అలర్జీ, కడుపు నొప్పి, గొంతు సమస్యలు వస్తాయి. ఇవే కాదు అధికంగా బరువు పెరిగిపోతారు. కేవలం రెండు స్పూన్లకి మించి గుమ్మడి గింజలు తినకపోవడమే మంచిది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: పాత పరుపులను ఇంకా వాడుతున్నారా? వాటిపై ఏమేమి ఉంటాయో తెలిస్తే, వణికిపోతారు!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 08 Jul 2023 11:21 AM (IST) Tags: Weight Loss Tips Pumpkin Seeds Weight Gain Food Weight Loss Benefits Of Pumpkin Seeds

ఇవి కూడా చూడండి

Hyperacidity: హైపర్ అసిడిటీని తగ్గించే ఆయుర్వేద ఆహార పదార్థాలు ఇవే

Hyperacidity: హైపర్ అసిడిటీని తగ్గించే ఆయుర్వేద ఆహార పదార్థాలు ఇవే

Weight Loss: జిమ్‌కు వెళ్ళకుండా బరువులు ఎత్తకుండానే మీ బరువు ఇలా తగ్గించేసుకోండి

Weight Loss: జిమ్‌కు వెళ్ళకుండా బరువులు ఎత్తకుండానే మీ బరువు ఇలా తగ్గించేసుకోండి

Pea Protein Powder: బఠానీలతో చేసిన ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే అన్నీ లాభాలున్నాయా?

Pea Protein Powder: బఠానీలతో చేసిన ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే అన్నీ లాభాలున్నాయా?

Relatioships: నా భర్త ఆమెతో మళ్లీ మాట్లాడుతున్నాడు, నాకు నచ్చడం లేదు - ఏం చేయమంటారు?

Relatioships: నా భర్త ఆమెతో మళ్లీ మాట్లాడుతున్నాడు, నాకు నచ్చడం లేదు - ఏం చేయమంటారు?

Teenagers: తల్లిదండ్రులూ జాగ్రత్త, టీనేజర్లలో పెరిగిపోతున్న డిప్రెషన్ లక్షణాలు

Teenagers: తల్లిదండ్రులూ జాగ్రత్త, టీనేజర్లలో పెరిగిపోతున్న డిప్రెషన్ లక్షణాలు

టాప్ స్టోరీస్

బెంగళూరులో 44 విమానాలు రద్దు, కర్ణాటక బంద్ ఎఫెక్ట్ - ప్రయాణికుల ఇబ్బందులు

బెంగళూరులో 44 విమానాలు రద్దు, కర్ణాటక బంద్ ఎఫెక్ట్ - ప్రయాణికుల ఇబ్బందులు

World Cup 2023: హైదరాబాద్‌లో పాక్‌xకివీస్‌ వార్మప్‌ మ్యాచ్‌! వర్షం కురిసే ఛాన్స్‌!

World Cup 2023: హైదరాబాద్‌లో పాక్‌xకివీస్‌ వార్మప్‌ మ్యాచ్‌! వర్షం కురిసే ఛాన్స్‌!

Skanda Day 1 Collection: బాక్సాఫీస్ దగ్గర ‘స్కంద‘ ధూంధాం, రామ్ పోతినేని కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్!

Skanda Day 1 Collection: బాక్సాఫీస్ దగ్గర ‘స్కంద‘ ధూంధాం, రామ్ పోతినేని కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్!

ముదురుతున్న కావేరి జల వివాదం, కర్ణాటక బంద్‌ - సరిహద్దుల్లో భారీ భద్రత

ముదురుతున్న కావేరి జల వివాదం, కర్ణాటక బంద్‌ - సరిహద్దుల్లో భారీ భద్రత