News
News
X

Prostate cancer symptoms: పురుషులూ మేల్కోండి.. మీలో ఈ లక్షణాలు కనిపిస్తే ప్రోస్టేట్ క్యాన్సరే!

పురుషులను భయాందోళనలకు గురిచేస్తున్న మహమ్మారి ప్రోస్టేట్ క్యాన్సర్. దీన్ని ముందుగా గుర్తించాలంటే ఇలా చేయండి.

FOLLOW US: 

పురుషులూ మేల్కోండి.. మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఎందుకంటే.. ప్రపంచంలోని ప్రతి ఎనిమిది మంది పురుషుల్లో ఒకరు ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఇటీవల యూకేలో నిర్వహించిన ఓ స్డడీ ప్రకారం.. ఏటా అక్కడ 52,300 మంది ప్రోస్టేట్ క్యాన్సర్‌కు గురవ్వుతుంటే.. 11,900 మంది మరణిస్తున్నారు. అన్నిరకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న యూకేలోనే అన్ని మరణాలు జరుగుతున్నాయంటే.. ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి పూర్తిగా అవగాహన లేని మన దేశంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే, యూకేలో పురుషులు ఎక్కువగా ఈ క్యాన్సర్‌కు గురికావడానికి.. స్వలింగ సంపర్కం, లింగమార్పిడి కూడా కారణాలనీ పరిశోధకులు తేల్చారు. ఒకప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్ వృద్ధాప్యంలోనే వచ్చేది. 75 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల పురుషుల్లో ఈ వ్యాధి కనిపించేది. ఇప్పుడు యువత కూడా ఈ వ్యాధికి గురికావడం బాధాకరం. 

ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు: 
⦿ రాత్రి సమయంలో తరచుగా మూత్ర విసర్జన. 
⦿ మూత్రం పోసేప్పుడు మంటగా అనిపించడం. 
⦿ మూత్ర విసర్జన చేసేటప్పుడు ఒత్తిడి చేయాల్సి రావడం లేదా ఎక్కువ సమయం తీసుకోవడం.
⦿ మీ మూత్రం పోసినా సరే ఇంకా పూర్తిగా పోయలేదనే భావన కలగడం.
⦿ మూత్రం లేదా వీర్యంలో రక్తం.

ముందుగా ఇది తెలుసుకోండి: పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే.. ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చినట్లు కాదు. ఒక్కోసారి ప్రోస్టేట్ వాపు, వయస్సు పెరిగేకొద్ది ఇలాంటివి కనిపించవచ్చు. ఈ పరిస్థితిని పరిస్థితిని బెనిగ్న్ ప్రోస్టాటిక్ హైపర్‌ప్లాసియా (Benign Prostatic Hyperplasia-BPH) అని పిలుస్తారు. ప్రోస్టేట్ గ్రంధి పెరగడం వల్ల మూత్రనాళంపై ఒత్తిడి ఏర్పడుతుంది. దానివల్ల బీపీహెచ్ ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. దానివల్ల క్యాన్సర్‌ను ముందుగానే పసిగట్టి చికిత్స పొందవచ్చు. మీ కుటుంబంలో ఎవరికైనా ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నా.. మీకు సంక్రమించే అవకాశం ఉంది. 50 ఏళ్లు పైబడిన వయస్సువారు తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. 
 
ఎలా తెలుసుకోవచ్చు?: ప్రోస్టేట్ నిర్దిష్ట యాంటిజెన్ (PSA) పరీక్ష ద్వారా క్యాన్సర్‌ను గుర్తించవచ్చు. ఇది రక్తంలో PSA స్థాయిలను కొలిచే రక్త పరీక్ష. దీనితోపాటు మల పరీక్ష (DRE), ఇన్ఫెక్షన్‌‌ను గుర్తించేందుకు మూత్ర పరీక్షలు నిర్వహిస్తారు. అయితే, డీఆర్‌ఈ పరీక్ష కాస్త ఇబ్బందికరమైనదే. వైద్యులు చేతికి గ్లోవ్స్ వేసుకుని మల ద్వారంలోకి వేలును చొప్పిస్తారు. బాధితుడికి ఇబ్బంది లేకుండా జెల్ రాసుకుంటారు. కాబట్టి.. ఈ పరీక్షలకు భయపడాల్సిన అవసరం లేదని, ఎలాంటి నొప్పి ఉండదని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి.. మీలో పైన పేర్కొన్న ఏ లక్షణం కనిపించినా ముందు జాగ్రత్తగా పరీక్షలు చేయించుకుని ధైర్యంగా ఉండండి.  

Also read:  మైగ్రేన్‌తో బాధపడే వారు... వీటికి దూరంగా ఉండండి

Also read: పిల్లలకు రోజుకో ఉడికించిన గుడ్డు తినిపించండి... ఆరోగ్యానికి ఢోకా ఉండదు

Also read: మీ గురక వల్ల ఇంట్లో వాళ్లు ఇబ్బంది పడుతున్నారా... ఇలా చేసి చూడండి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 08 Nov 2021 01:35 PM (IST) Tags: Prostate cancer Prostate cancer symptoms Prostate cancer treatment Prostate cancer in men Prostate cancer signs ప్రొస్టేట్ క్యాన్సర్

సంబంధిత కథనాలు

Beetroot: బీట్‌రూట్ జ్యూస్ తాగడం మంచిదే, కానీ ఎక్కువ తాగితే ఈ సైడ్ ఎఫెక్టులు తప్పవు

Beetroot: బీట్‌రూట్ జ్యూస్ తాగడం మంచిదే, కానీ ఎక్కువ తాగితే ఈ సైడ్ ఎఫెక్టులు తప్పవు

Weight Loss: ఉదయం పూట ఈ పానీయాలు తాగితే కొవ్వు కరగడం ఖాయం

Weight Loss: ఉదయం పూట ఈ పానీయాలు తాగితే కొవ్వు కరగడం ఖాయం

Telugu Recipe: క్యాబేజీ వడలు, సాయంత్రానికి సింపుల్ స్నాక్ రెసిపీ

Telugu Recipe: క్యాబేజీ వడలు, సాయంత్రానికి సింపుల్ స్నాక్ రెసిపీ

Cashew: రోజుకు ఎన్ని జీడిపప్పులు తింటే ఆరోగ్యంగా ఉంటారో తెలుసా?

Cashew: రోజుకు ఎన్ని జీడిపప్పులు తింటే ఆరోగ్యంగా ఉంటారో తెలుసా?

Honey Pack: మొటిమలు, బ్లాక్‌హెడ్స్ వేదిస్తున్నాయా? తేనెతో ఇలా చేయండి

Honey Pack: మొటిమలు, బ్లాక్‌హెడ్స్ వేదిస్తున్నాయా? తేనెతో ఇలా చేయండి

టాప్ స్టోరీస్

Minister RK Roja : టీడీపీ జంబలకడిపంబ పార్టీ, ఆడవాళ్లు తొడలు కొడతారు మగవాళ్లు ఏడుస్తారు- మంత్రి రోజా

Minister RK Roja : టీడీపీ జంబలకడిపంబ పార్టీ, ఆడవాళ్లు తొడలు కొడతారు మగవాళ్లు ఏడుస్తారు- మంత్రి రోజా

Viveka Murder Case: వివేకా హత్య కేసులో ‘కింగ్ పిన్’ ఇతనే, బెయిల్ కుదరదు - తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

Viveka Murder Case: వివేకా హత్య కేసులో ‘కింగ్ పిన్’ ఇతనే, బెయిల్ కుదరదు - తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

Shocking News: 58 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం, జాయిన్ అవ్వకముందే బీటెక్ గ్రాడ్యుయేట్ ఆకస్మిక మృతి

Shocking News: 58 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం, జాయిన్ అవ్వకముందే బీటెక్ గ్రాడ్యుయేట్ ఆకస్మిక మృతి

Chiranjeevi - Godfather Climax Fight : 'గాడ్ ఫాదర్' క్లైమాక్స్ - చిరు, సల్మాన్ ఫ్యాన్స్‌కు ట్రీట్ - ఎక్స్‌క్లూజివ్ న్యూస్ ఏంటంటే?

Chiranjeevi - Godfather Climax Fight : 'గాడ్ ఫాదర్' క్లైమాక్స్ - చిరు, సల్మాన్ ఫ్యాన్స్‌కు ట్రీట్ - ఎక్స్‌క్లూజివ్ న్యూస్ ఏంటంటే?