Zazen: మానసిక ఆరోగ్యాన్ని కాపాడే జపాన్ టెక్నిక్ 'జాజెన్'
శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది.
శరీరాన్ని, మనసుని ఏకం చేసేది ధ్యానం. కుల, మతాలకి అతీతంగా అన్నీ సాంప్రదాయాల వాళ్ళు పాటిస్తారు. సత్ప్రవర్తన పొందటం కోసం మెడిటేషన్ చాలా చక్కగా ఉపయోగపడుంది. బౌద్ధ మతం పాటించే వాళ్ళు దీనికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. 2500 సంవత్సరాల క్రితం బుద్ధుడు ప్రారంభించిన ధ్యానం, అతని బోధనల్ నుంచి ఇది ఉద్భవించించి. జపాన్, చైనీయులు, బౌద్ధులు ఎక్కువగా ధాన్యం చేసి తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. జపాన్ వాసులు ఎక్కువగా అభ్యసించే విధానం జాజెన్. ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని జాజెన్ ధ్యానం చేస్తారు. జపనీయులకు అనేక తత్వాలు ఉన్నాయి. వాళ్ళు వాటి ప్రకారం తమ జీవితాలని గడుపుతారు. జపాన్ వాసులు అవలభించే వాటిలో జాజెన్ ఒకటి. ఇది శరీరం, మనసుని ఒకే దృష్టికి తీసుకొస్తుంది. ఈ భంగిమలో కదలకూడదు.
జాజెన్ మెడిటేషన్ వల్ల ప్రయోజనాలు
- ఒత్తిడిని తగ్గిస్తుంది
- బుద్ధి శక్తి పెంచుతుంది
- భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయి
- ఆందోళన, నిరాశని తగ్గిస్తుంది
- గుండె వేగాన్ని తగ్గిస్తుంది. రక్తపోటుని అదుపులో ఉంచుతుంది
- రక్తప్రసరణ సజావుగా సాగేలా చేస్తుంది
- రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది
- అభిజ్ఞా సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది
- నొప్పులను తగ్గిస్తుంది
జాజెన్ ఎలా చేయాలి?
నిశ్సబ్దమైన, సౌకర్యవంతమైన స్థలాన్ని ఎంచుకోవాలి. రిలాక్స్ గా కూర్చుని పద్మాసనం వేసినట్టుగా కూర్చోవాలి. శ్వాస మీద దృష్టి పెట్టాలి. మనసులోకి ఎటువంటి ఆలోచనలు రాకుండా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ఇది చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. వృత్తిపరమైన ఒత్తిడిని అదుపులో ఉంచుకునేందుకు జాజెన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు దోహదపడుతుంది.
మానసిక ఆరోగ్యాన్ని నాశనం చేసే ఆహారాలు
మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. మనసు బాగుంటేనే పొట్ట బాగుంటుంది. అందుకే మానసిక ఆరోగ్యాన్ని చెడగొట్టే ఆహారాన్ని దూరంగా పెట్టాలి. సమతుల్య ఆహారం తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారాల్లో ఉప్పు, చక్కెర, అనారోగ్య కొవ్వులు అధికంగా ఉంటాయి. వీటి వల్ల రక్తంలో చక్కెర పెరిగిపోతుంది. మానసిక కల్లోలానికి దారితీస్తుంది. యాంగ్జయిటీ పెరిగిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఫాస్ట్ ఫుడ్ ని దూరంగా పెట్టాలి.
కెఫీన్ కూడా మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. నిద్ర పట్టదు. డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంది. కెఫీన్ మానసిక స్థితిని నియంత్రించే కీలకమైన విటమిన్లను శోషించుకునే శక్తిని తగ్గిస్తుంది. కూల్ డ్రింక్, ఎనర్జీ డ్రింక్ లో కెఫీన్ అధికంగా ఉంటుంది. వాటిని తాగడం మంచిది కాదు.
ఇది మాత్రమే కాదు అన్నింటి కంటే ఆల్కహాల్ మరింత ప్రమాదకరమైనది. ఆల్కహాల్ అధికంగా తాగే వారిలో డిప్రెషన్ వంటివి వస్తాయి. వీరికి నిద్ర సరిగా పట్టదు. దీనివల్ల రక్తంలో చక్కెర పెరిగిపోతుంది. అందుకే మానసిక ఆరోగ్యాన్ని కాపాడటం కోసం పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి సమతుల్య ఆహారం తీసుకోవాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
ALso Read: ఎమోషనల్ స్ట్రెస్ వల్ల గుండె ప్రమాదంలో పడుతుంది జాగ్రత్త!