అన్వేషించండి

Lakshadweep: వామ్మో.. లక్షద్వీప్‌లో అన్ని అద్భుతాలా, ప్రతి దీవి ప్రత్యేకమే!

Lakshadweep: మనదేశంలో చూడదగిన ప్రదేశాలు కోకొల్లలు. బీచ్ లను ఇష్టపడే వారు తప్పక వెళ్లాల్సిన చోటు లక్షాద్వీప్. ఇది కొన్ని ద్వీపాల సమూహం. అందమైన ఈ ప్రాంతంలోని కొన్ని చూడదగిన ప్రదేశాల వివరాలు.

లక్ష్యాద్వీప్.. ఇదో అందాల ప్రపంచం. ఇండియాలోనే ఉన్న అతి చిన్న కేంద్ర పాలిత ప్రాంతం. ఇది మాల్దీవులకు ఏ మాత్రం తీసిపోదు. సముద్రతీరాలను ఇష్టపడే వారికి ఇది స్వర్గం వంటిది. ఇందులో మొత్తం 36 ద్వీపాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ద్వీపాల్లోని బీచ్‌లు సందర్శకులను కట్టిపడేస్తాయి. ఒక వైపు నీలి సముద్రం.. మరోవైపు అందమైన రిసార్టులు, పచ్చని పరిసరాలతో ప్రశాంతంగా ఉండే ప్రదేశాలు ఇంకా ఎన్నో విశేషాలను ఇక్కడ చూడవచ్చు. ఇక్కడి సముద్రం వాటర్ స్పోర్ట్స్, డైవింగ్ తదితర యాక్టివిటిస్ కి అనువుగా ఉంటుంది. లక్షద్వీప్‌లో ముఖ్యంగా చూడదగిన ప్రాంతాలివే

లక్షాద్వీప్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే అక్కడి అద్భుతాలు అసలు మిస్ కాకుండా ప్లాన్ చేసుకోవడం అవసరం. కొన్ని ముఖ్యమైన ప్రదేశాల వివరాలు ఇక్కడ చూద్దాం.

  1. మినీకాయ్ ద్వీపం- బోట్ రైడ్స్
  2. కద్మత్ ద్వీపం - లోకల్ ఫుడ్
  3. కవరత్తి ద్వీపం- సంధ్యా సమయం
  4. మెరైన్ మ్యూజియం – అండర్వాటర్ వరల్డ్
  5. పిట్టి పక్షుల అభయారణ్యం – ప్రకృతి ప్రేమికులకు
  6. తిన్నకర ద్వీపం- అందమైన కొలనులకు ప్రసిద్ది
  7. కల్పేని ద్వీపం – రిలక్సింగ్ రోమింగ్
  8. బంగారం అటోల్- భూతల స్వర్గం
  9. అగట్టి ద్వీపం – స్మోక్డ్ ట్యూనా ఫిష్
  10. కిల్తాన్ ద్వీపం – కలోనియల్ స్పాట్
  11. అమినీబీచ్ - స్కూబా డైవింగ్
  12. ఆండ్రోట్ ద్వీపం – చరిత్ర శోధనకు

మినియాయ్ ద్వీపం

మిలికు అని ముద్దుగా పిలుచుకునే ఈ ద్వీపం లక్షాద్వీప్ దీవులలో ముఖ్యమైనది. ఈ ద్వీపంలో లైట్ హౌజ్ ప్రత్యేక ఆకర్శణ. తెల్లనిఇసుక బీచ్ లతో అందమైన ద్వీపం ఇది. ఇక్కడ రెండు రోజులు ఉండవచ్చు. ప్రవేశానికి ఎలాంటి ప్రత్యేక చెల్లింపులు అవసరం లేదు. ఇక్కడ బోట్ రైడింగ్, హైకింగ్ చెయ్యవచ్చు. ఇక్కడి భోజనం ప్రత్యేక ఆకర్షణ.

కద్మత్ ద్వీపం

ఈ ద్వీపం పగడపు ద్వీపంగా ప్రసిద్ధి. చాలా శక్తివంతమైన సముద్ర జీవులకు ఆవాసం ఇక్కడి సముద్రం. తక్కువ జనాభా కలిగి ఉంటుంది. చేపలు పట్టడమే ఇక్కడి వారి ప్రధాన వృత్తి. స్థానిక భోజనం ఇక్కడ ప్రత్యేకం. ఈ ద్వీపం స్నార్కెలింగ్, డీప్ సీ డైవింగ్ కు ప్రసిద్ధి. సాహసికులకు మంచి ఆటవిడుపు.

కవరత్తి ద్వీపం

కవరత్తి ప్రకృతి ప్రేమికులకు అనువైన ప్రదేశం. ఇక్కడి సూర్యాస్తమయం ఈ ద్వీపాన్ని అతిసుందరం చేస్తుంది. లక్షాద్వీప్ లో చాలా మంది విదేశీయులను ఆకర్శించే ద్వీపం ఇదే. ఇక్కడి బీచ్ లలో రిలాక్స్ కావచ్చు కూడా. సోలో ట్రావేలర్స్ కు అనుకూలం.

మెరైన్ మ్యూజియం

కవరత్తి ద్వీపంలోని మెరైన్ మ్యూజియంలో జలచరాలకు సంబంధించిన చాలా సమాచారాన్ని పొందవచ్చు. మ్యూజియంలోని షార్క్ అస్థిపంజరం ప్రత్యేక ఆకర్శణగా చెప్పుకోవచ్చు.

పిట్టి పక్షుల అభయారణ్యం

కల్పేనీ ద్వీపంలో దిగిన తర్వాత పిట్టి దీవికి వెళ్లేందుకు చిన్న పడవలు అందుబాటులో ఉంటాయి. ఇది సముద్రం మధ్యలో ఉన్న చిన్న ప్రదేశం. ఇదొక డెడ్ కోరల్ ఐలాండ్. స్నార్కెలింగ్ కు అనువైన ప్రదేశం. అయితే ఇక్కడికి వెళ్లడానికి ముందే.. బస చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి.

Also read : Indonesia Mosquitoes : దోమలను పెంచేందుకు ఇండోనేషియా ప్రభుత్వం నిర్ణయం - ప్రజా వ్యతిరేకతతో ఆగిన ప్లాన్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget