అన్వేషించండి

Cancer Risk by Blood Group : కడుపు క్యాన్సర్ ముప్పును పెంచే బ్లడ్ గ్రూప్ ఇదే.. మీది కూడా అదేనా?

Blood Group Cancer Connection : మీకు తెలుసా? మీ బ్లడ్ గ్రూప్​ని బట్టి మీకు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముందట. ఓ తరహా బ్లడ్ గ్రూప్ వారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట.

Stomach Cancer Causes : ఆధునిక జీవనశైలిలో క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలామంది ఆరోగ్యంపై చాలా కేర్ తీసుకుంటున్నారు. కొందరు ఏమైనా లక్షణాలు కనిపించినా.. అలాగే రెగ్యులర్​గా కూడా వైద్య పరీక్షలు చేయించుకుంటారు. ఇలా చేయడం వల్ల తీవ్రమైన వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. అయితే జీవనశైలి, ఫుడ్స్, ఇతర అంశాలే కాదు.. మీ బ్లడ్ రకం కూడా.. మీకు క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని పెంచుతుందట. ముఖ్యంగా ఓ బ్లడ్ గ్రూప్​ వారికి కడుపులో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని చెప్తున్నారు. ఇది నిజమో కాదు.. దాని వెనుక రీజన్ ఏంటో చూసేద్దాం. 

బ్లడ్ గ్రూప్ ఎలా డిసైడ్ చేస్తారు

ప్రజలు రక్తం దానం చేసే వరకు లేదా శస్త్రచికిత్స చేయించుకునే వరకు.. వారి బ్లడ్ గ్రూప్ గురించి తెలియదు. నిజానికి ప్రతి ఒక్కరికి వారి తల్లిదండ్రుల నుంచి రక్త సమూహాన్ని వారసత్వంగా వస్తుంది. ప్రపంచంలోని చాలా మంది ప్రజలు A, B, AB లేదా O అనే నాలుగు బ్లడ్ గ్రూప్ పరిధిలోకి వస్తాయి. ఈ అక్షరాలు మీ ఎర్ర రక్త కణాల ఉపరితలంపై చక్కెర, ప్రోటీన్ల (యాంటిజెన్) కలయికను సూచిస్తాయి. ఇవి రక్తంలోని ప్లాస్మాలో ఉండే యాంటీబాడీస్‌తో కూడా సంబంధం కలిగి ఉంటాయి. దీనితో పాటు పాజిటివ్, నెగిటివ్ బ్లడ్ గ్రూప్ Rh ఫ్యాక్టర్ యాంటిజెన్ అని సూచిస్తాయి. 

బ్లడ్ గ్రూప్​తో వ్యాధులు వస్తాయా?

వినడానికి కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు. కానీ మీ రక్త సమూహం ద్వారా ఏ వ్యాధులు మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయో.. ఏవి ప్రభావితం చేయవో తెలుసుకోవచ్చు. యాంటిజెన్‌లు, యాంటీబాడీలు మీ రోగనిరోధక వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. 2019లో BMC క్యాన్సర్ నివేదిక ప్రకారం.. A లేదా AB రక్త సమూహం ఉన్నవారికి కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ ఉందని నివేదించింది. 

దీనిలో నిజమెంతా?

O రక్త సమూహం ఉన్న వారితో పోలిస్తే.. A బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం 13 శాతం ఎక్కువని అధ్యయనంలో తేలింది. అదే సమయంలో AB రక్త సమూహం ఉన్నవారిలో ఈ ప్రమాదం 18 శాతం ఎక్కువ. పరిశోధకులు 40 ఇతర అధ్యయనాల ఫలితాలను కూడా పరిశీలించారు. ఇందులో ఒకే విధమైన నమూనా కనుగొన్నారు. టైప్ A ఉన్నవారిలో క్యాన్సర్ ప్రమాదం 19 శాతం ఎక్కువని అయితే టైప్ AB ఉన్నవారిలో కడుపు క్యాన్సర్ ప్రమాదం 9 శాతం ఎక్కువని గుర్తించారు.

కడుపు క్యాన్సర్​తో లింక్ ఏంటి?

అయితే A లేదా AB రక్త సమూహం ఉండటం వల్ల నేరుగా క్యాన్సర్ వస్తుందని అధ్యయనంలో చెప్పలేదు. ఇతర రక్త సమూహాల ప్రజలకు కూడా కడుపు క్యాన్సర్ వస్తుందనే విషయాన్ని గమనించాలి. అయితే రక్త సమూహాల మధ్య కొన్ని జీవసంబంధమైన వ్యత్యాసాలు ఉన్నాయి. దీని కారణంగా కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఈ వ్యత్యాసాలలో వాపు, కణాల కమ్యూనికేషన్, రోగనిరోధక వ్యవస్థ క్యాన్సర్ కణాలను గుర్తించడం వంటివి ఉంటాయి. ఉదాహరణకు A రక్త సమూహం ఉన్నవారు O రక్త సమూహం ఉన్న వారితో పోలిస్తే కడుపులో తక్కువ యాసిడ్ ఉత్పత్తి చేయవచ్చు.

A రక్త సమూహం ఉన్నవారికి హెలికోబాక్టర్ పైలోరీ సోకే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొంటూ.. పరిశోధనలో పాత నివేదికలను కూడా ప్రస్తావించారు. హెలికోబాక్టర్ పైలోరీ అనేది ఒక రకమైన బ్యాక్టీరియా.. కడుపు క్యాన్సర్‌తో సంబంధం కలిగి ఉంటుంది. ఈ బ్యాక్టీరియా చాలా ప్రమాదకరమైనది. హెలికోబాక్టర్ పైలోరీ సోకినా లేకపోయినా.. A రక్త సమూహం ఉన్నవారిలో కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది. అదే సమయంలో, హెలికోబాక్టర్ పైలోరీ సోకినప్పుడు AB రక్త సమూహం ఉన్నవారిలో కడుపు క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మగవారిలో కూడా

నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రకారం.. అమెరికాలో కడుపు క్యాన్సర్ సాధారణం కాదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఇది ఐదవ సాధారణ క్యాన్సర్. ఆసియా, తూర్పు, యూరప్, దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో ఈ క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉంటాయి. అదే సమయంలో పురుషులలో కూడా ఈ ప్రమాదకరమైన వ్యాధి వచ్చే అవకాశం రెట్టింపు ఉంటుంది. వయస్సు పెరిగే కొద్దీ కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మహిళల్లో కూడా కేసులు వేగంగా పెరుగుతున్నాయనే విషయాన్ని గమనించాలి. ఆహారం, కుటుంబ చరిత్ర, ఊబకాయం వంటి ఆరోగ్య పరిస్థితుల కారణంగా కూడా క్యాన్సర్​కు కారణమవుతాయి. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్

వీడియోలు

Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam
WPL 2026 Mumbai Indians | ముంబై ఇండియన్స్ లో కీలక మార్పులు | ABP Desam
India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... ఫిమేల్ డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్!
Cheekatilo OTT Release Date: ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget