అన్వేషించండి

Divorce: ప్రపంచంలో అతి తక్కువగా విడాకులు తీసుకుంటున్నది మన దేశంలోనే, ఇక అత్యధికంగా విడాకులు తీసుకుంటున్న దేశం అది

వివాహాలు రద్దు చేసుకునే వ్యవస్థ అతి తక్కువగా ఉన్నది మన దేశంలోనే.

Divorce: వివాహం జీవితంలో ఎంతో ముఖ్యమైన దశ. మరణించేవరకు ఉండే తోడును ఎంచుకోవడమే వివాహం. తోడునీడగా బతుకుతూ, కష్టసుఖాలను, కన్నీళ్లను సంతోషాలను పంచుకోవడమే వివాహ వ్యవస్థలోని ముఖ్య ఉద్దేశం. అయితే ప్రపంచవ్యాప్తంగా విడాకుల రేటు పెరిగిపోతుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు విడాకుల రేటు అధికంగా ఉన్నట్టు సర్వేలు చెబుతున్నాయి. వివాహం అనేది ఒక మతం, కుటుంబం, సంస్కృతి, వ్యక్తిగత ప్రవర్తన వంటి వాటిపై ఆధారపడి ఉన్నప్పటికీ చిన్న చిన్న కారణాలకే విడిపోతున్న వారి సంఖ్య అధికంగా ఉంది. విడాకులు అనేది ఇప్పుడు ప్రపంచంలో సామాజిక వ్యవస్థలో ఉన్న ప్రధాన సమస్య. అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే అభివృద్ధి చెందిన దేశాలలోనే విడాకులు రేటు అధికంగా ఉంది. భాగస్వామిపై నమ్మకం లేకపోవడం, డ్రగ్స్, ఆల్కహాల్ వంటి వ్యసనాలు, శారీరకంగా వేధించడం, ఇద్దరికీ పడకపోవడం, అభిప్రాయాలు కలవకపోవడం వంటి కారణాలు విడాకుల రేటును పెంచుతున్నాయి. అయితే ప్రపంచంలో అన్నింటికన్నా తక్కువ విడాకులు రేటు కలిగి ఉన్న దేశం మన దేశమే.

భారత్
మన దేశంలో విడాకుల రేటు ఒక శాతం కంటే తక్కువగా ఉంది. 1000 వివాహాలలో 13 మంది మాత్రమే విడాకులు తీసుకుంటున్నారు. మన సమాజంలో వివాహానికి ఉన్న విలువ... జంటలు విడిపోకుండా కాపాడుతుంది. మన దేశంలో వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య కాకుండా రెండు కుటుంబాల మధ్య బంధంగా మారుతుంది. అందుకే విడాకులు తీసుకోవడం మన దేశంలో అంత సులువు కాదు. తల్లిదండ్రులు, కుటుంబం, సమాజం... ఇలా ఎన్నో విషయాలను పట్టించుకోవలసి వస్తుంది. అందుకే మన దేశంలో విడాకుల రేటు చాలా తక్కువ.

చిలీ
ఇక తక్కువ విడాకుల రేటు కలిగి ఉన్న రెండో దేశం చిలీ. చిలియన్లకు కూడా విడాకులు అంటే ఇష్టం ఉండదు. ఈ దేశంలో మూడు శాతం మంది మాత్రమే విడాకులు తీసుకుంటున్నారు.

కొలంబియా
అతి చిన్న దేశమైన కొలంబియాలో 9% జంటలు విడాకులు తీసుకుంటున్నారు. అక్కడ విడాకులపై ఉన్న జనాదరణ చాలా తక్కువ. కుటుంబ జీవితాన్ని కొలంబియాన్లు ఇష్టపడతారు. పెళ్లి ప్రమాణాలను గౌరవిస్తారు. అందుకే ఇక్కడ కూడా విడిపోతున్న జంటల సంఖ్య తక్కువగానే ఉంది.

మెక్సికో
అమెరికా పక్కనే ఉన్న మెక్సికోలో అమెరికన్ల వివాహ వ్యవస్థ మాత్రం లేదు. అమెరికాలో ఇట్టే విడాకులు తీసుకుంటారు. కానీ మెక్సికోలో మాత్రం క్యాథలిక్ చర్చి పట్ల విపరీతమైన గౌరవం ఉంటుంది. దీనివల్ల దంపతులు సాధారణంగా విడాకుల కోసం వెళ్లారు. మెక్సికోలో 15% విడాకుల రేటు ఉంది. 

టర్కీ
తక్కువగా విడాకులు తీసుకుంటున్న దేశాల్లో టర్కీ 5వ స్థానంలో ఉంది. ఇక్కడ వివాహేత జంటలు 22% మంది మాత్రమే విడాకులు తీసుకుంటున్నారు.

అత్యధిక విడాకులు రేటు ఉన్న దేశాల గురించి తెలుసుకుందాం

లగ్జంబర్గ్
ఇది అతి చిన్న దేశం. ఐదు లక్షల జనాభా మాత్రమే ఉంటారు. ఐరోపాలో ఉన్న అతి చిన్న దేశాల్లో ఇది ఒకటి. దీనిలో అధునాతన ఆర్థిక వ్యవస్థ ఉంది. అధిక కొనుగోలు శక్తి కూడా ఉంది. అయితే ప్రపంచంలోనే అత్యధిక విడాకులు రేటు ఉన్న దేశం ఇదే. దాదాపు 87% మంది వివాహిత జంటలు విడాకులు తీసుకుంటున్నారు.

స్పెయిన్
ఈ దేశంలో కేథలిక్కులు అధికం అయినా కూడా అనేక రకాల కారణాలవల్ల 65% మంది భార్యాభర్తలు విడాకులు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అందుకే ఇది రెండో స్థానంలో నిలిచింది.

ఫ్రాన్స్
ఫ్రాన్స్ అంటే అందరికీ గుర్తొచ్చేది ప్యారిస్. ఇక్కడ కూడా విడాకుల రేటు అధికంగానే ఉంది. ఫ్రాన్స్ లో పెళ్లయిన జంటల్లో 55% మంది విడిపోవడానికి ఇష్టపడుతున్నారు.

రష్యా
ఉక్రెయిన్‌తో యుద్ధంతో చాలా బిజీగా ఉన్న రష్యాలో ప్రతి సెకనుకు ఒక వివాహం విఫలమవుతుందట. మొదటి ఐదేళ్లలోనే మూడోవంతు వివాహాలు విఫలమవుతాయని అక్కడ పరిశోధనలు చెబుతున్నాయి. దాదాపు 51 శాతం మంది జంటలు విడిపోయేందుకే ఇష్టపడుతున్నారు.

అమెరికా
ప్రపంచంలో అధునాతన దేశం అమెరికా. అభివృద్ధి చెందిన దేశం ఇది. ఇక్కడ జంటలకు చిన్నచిన్న విభేదాలు వచ్చినా చాలు విడిపోతారు. ఇట్టే విడిపోయి మరుక్షణంలో చట్టబద్ధంగా మరొక వ్యక్తిని వివాహం చేసుకుంటారు. ఇక్కడ పెళ్ళికి ఏమాత్రం విలువ ఉన్నట్టు కనిపించదు. అమెరికాలో 46% జంటలు పెళ్లయ్యాక విడిపోతున్నాయి. 

Also read: పిల్లలకు నచ్చేలా కూరగాయలతో ఇలా పాన్ కేక్ చేసి పెట్టండి

Also read: మెరుస్తున్న పుట్టగొడుగులను చూడాలంటే అక్కడికి వెళ్లాల్సిందే, మన దేశంలోనే ఉంది ఈ ప్రదేశం

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Kawasaki Ninja ZX 4RR: మార్కెట్లోకి కొత్త నింజా బైక్ - రేటు చూస్తే మాత్రం షాకే!
మార్కెట్లోకి కొత్త నింజా బైక్ - రేటు చూస్తే మాత్రం షాకే!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
Mulugu News: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Embed widget