Onion Peels Benefits : ఉల్లి తొక్కలు పడేస్తున్నారా? ఈ బెనిఫిట్స్ తెలిస్తే అస్సలు పడేయరట
Onion Peel Benefits : ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లిమాత్రమే కాదండోయ్ దాని తొక్కలు కూడా అద్భుతాలు చేస్తాయట.. అవేంటంటే..
Ways to Reuse Onion Peels : కూరల్లో, సలాడ్స్‌లో ఉల్లిపాయలను నచ్చిన షేప్‌లలో కోసుకుని పైన తొక్కలు పడేస్తూ ఉంటాము. అయితే ఉల్లిపాయ తొక్కల వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు పడేయరు తెలుసా? ఆరోగ్యానికి, అందానికి, మరెన్నో బెనిఫిట్స్ ఉల్లిపాయ తొక్కల వల్ల ఉన్నాయట. అయితే ఉల్లి తొక్కల వల్ల కలిగే లాభాలు ఏమిటి? వాటిని ఎలా ఉపయోగిస్తే మంచి ప్రయోజనాలు పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
సరిగ్గా ఉపయోగించాలే కానీ.. దేనితో అయినా అద్భుతాలు చేయవచ్చు అనేదానికి ఉల్లిపాయ తొక్కలే బెస్ట్ ఎగ్జాంపుల్. వాడుకోవడం తెలియాలేగానీ.. ఉల్లితొక్కలను అన్నిరకాలుగా పలు ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవచ్చు. ఆరోగ్యానికి, అందానికి ఏ విధంగా ఉల్లిపాయ తొక్కలను ఉపయోగించవచ్చో.. వాటి వల్లి కలిగే బెనిపిట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
హెల్త్ బెనిఫిట్స్ ఇవే..
ఉల్లిపాయ ఆకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. అందుకే వీటితో టీ పెట్టుకుని తాగొచ్చు. ఉల్లిపాయ తొక్కలను నీటిలో ఉడకబెట్టి తాగితే.. జలుబు, శరీరంలోని మంట తగ్గుతోందట. అలాగే దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీని లక్షణాలు కావాలనుకుంటే ఈ తొక్కలను సూప్‌లలో వేసుకుని తాగవచ్చు. పైగా ఇవి గట్ హెల్త్‌కి ఎంతో మంచిది. వీటిలోని ప్రోబయోటిక్, ఫైబర్ లక్షణాలు మెరుగైన జీర్ణక్రియను అందిస్తాయి.
Also Read : కొవ్వును కరిగించే హెల్తీ డ్రింక్స్.. బరువును తగ్గించి ఆరోగ్యంగా ఉండేందుకు రెగ్యూలర్‌గా తాగొచ్చు
అందానికి..
ఉల్లి తొక్కలతో స్కిన్‌కి, జుట్టుకి కూడా ఎన్నో లాభాలుంటాయి. దీనితో యాంటీ ఏజింగ్ ఫేస్ మాస్క్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ తొక్కలను ఉడకబెట్టి.. చల్లారనివ్వాలి. దానిని ముడతలపై మాస్క్‌గా వేసుకోవాలి. దీనిని రెగ్యూలర్‌గా ఫాలో అయితే ముడతలు తగ్గుతాయి. జుట్టు పెరుగుదలలో ఉల్లిపాయ ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. జుట్టు పెరుగదలకోసం ఉల్లిపాయ తొక్కలను నూనెలో వేసి మరగించాలి. దీనితో తలకు రెగ్యూలర్‌గా మసాజ్ చేసుకుంటే జుట్టు హెల్తీగా ఉంటుంది. అంతేకాకుండా తెల్ల జుట్టు రావడం కూడా తగ్గుతుంది. అయితే ఉల్లిపాయలను జుట్టుకోసం వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. నూనెలో కలిపి, రసం తీసుకుని.. పేస్ట్ చేసుకుని.. జుట్టుకి అప్లై చేస్తారు.
మొక్కలకు..
ఉల్లిపాయ తొక్కలను మొక్కల పెరుగుదలకు ఎన్నో ఏళ్లుగా ఉపయోగిస్తున్నారు. ఉల్లిపాయ తొక్కలను ఉడకబెట్టి.. మొక్కలకు సహజ తెగులు నివారిణిగా ఉపయోగించవచ్చు. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని కంపోస్ట్‌లో జత చేసి వాడుకోవచ్చు. ఇవి మొక్కల పెరుగుదలకు చాలా మంచివి. ఉల్లిపాయ తొక్కలను బయోడిగ్రేడబుల్ సీడ్ స్టార్టర్లుగా కూడా ఉపయోగించవచ్చు. అంతేకాకుండా వీటిని నేరుగా మొక్క మొదటి భాగంలో వేసినా కూడా మంచిదే.
మరిన్ని ప్రయోజనాలు..
ఉల్లిపాయ తొక్కలను రంగులు వేసేందుకు ఉపయోగించుకోవచ్చు. ఉల్లిపాయ తొక్కలను ఉడికించి.. సహజ క్రిమి వికర్షకంగా మొక్కలపై గోడలపై స్ప్రే చేయవచ్చు. ఉల్లిపాయ తొక్కలను కోళ్లు, కుందేళ్లకు పోషకమైన ఆహారంగా ఉపయోగించవచ్చు. పోషకాలు అధికంగా ఉండే కంపోస్ట్ టీ కోసం.. ఉల్లిపాయ తొక్కలను ఉపయోగిస్తారు. ఇండో మొక్కలకు సహజమైన ఎరువులుగా ఉల్లిపాయ తొక్కలుగా వేస్తారు.
Also Read : మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల పెరుగుతోన్న మరణాలు.. లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలివే