News
News
X

Pakoda Curry: ఉల్లిపాయ పకోడి కర్రీ రెసిపీ - కొత్తగా ఇలా ట్రై చేయండి

ఎప్పుడూ ఒకేలాంటి కర్రీలు తిని బోరు కొట్టిందా అయితే ఒకసారి ఇలా పకోడి కర్రీ ప్రయత్నించండి.

FOLLOW US: 
Share:

చలికాలంలో సాయంత్రం అయితే పంటి కిందకి పకోడీ పడాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల్లో ఎంతో మందికి పకోడీ చాలా ఇష్టం. పకోడీ ఎంత రుచిగా ఉంటుందో, దాంతో వండే కర్రీ కూడా అంతే రుచిగా ఉంటుంది. పకోడీ మిగిలిపోతే ఇలా కర్రీ చేసుకుని తినండి. లేదా రోజూ ఒకేలాంటి కూరలు బోరు కొడితే పకోడీతో టేస్టగా కర్రీ చేసుకోవచ్చు. దీన్ని వేడి  వేడి అన్నంలో కలుపుకుని తింటే ఆ రుచే వారు. కోఫ్తా కర్రీని గుర్తుకు తెచ్చేలా ఉంటుంది ఈ పకోడి కర్రీ. దీని కోసం ముందుగా ఉల్లిపాయ పకోడిని తయారు చేసుకుని పెట్టుకోవాలి. పకోడిలో ఉల్లిపాయలు తగ్గినా సమస్యేమీ లేదు. కర్రీ రుచికి ఢోకా లేదు. 

కావాల్సిన పదార్థాలు
పకోడి - పావు కిలో
ఉల్లిపాయ - పెద్దది ఒకటి
పచ్చిమిర్చి - రెండు
ఆవాలు - అరస్పూను
జీలకర్ర - అరస్పూను
పసుపు - అరస్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
కరివేపాకులు - గుప్పెడు
టమోటాలు - రెండు
ఉప్పు - రుచికి సరిపడా
కారం - ఒక స్పూను
గరం మసాలా - అర స్పూను
ధనియాల పొడి - అర స్పూను
జీలకర్ర పొడి - అర స్పూను
నూనె  - సరిపడినంత
కొత్తిమీర తరుగు - మూడు స్పూనులు

తయారీ ఇలా
1.  ముందుగా పకోడీ వేసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువగా వేసి చేస్తే ఉల్లిపాయ పకోడి అవుతుంది. మీకు నచ్చిన విధంగా చేసుకోండి. 
2. స్టవ్ మీద కళాయి పెట్టి అందులో నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. 
3. ఉల్లిపాయని సన్నగా చిన్న ముక్కలుగా తరిగి నూనెలో వేయాలి. అలాగే పచ్చిమిర్చిని నిలువుగా కోసి వేయాలి. 
4. ఉల్లిపాయలు బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్టుని వేయాలి. ఉల్లిపాయలు పూర్తిగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి. 
5. అందులోనే పసుపు, కారం వేసి వేయించాలి. 
6. టమోటా ప్యూరీ, ఉప్పు వేసి బాగా ఉడికించాలి. 
7. మూత పెడితే మిశ్రమం బాగా ఉడుకుతుంది. 
8. నూనె తేలే వరకు ఉడికించి అందులో గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి,కరివేపాకులు వేసి ఉడికించాలి. 
9. గ్లాసు నీళ్లు పోసి అయిదు  నిమిషాల పాటూ ఉడికించాలి. 
10. తరువాత ముందుగా చేసి పెట్టుకున్న పకోడి వేసి కలపాలి. 
11. పదినిమిషాలు మూత పెట్టి ఉడికిస్తే పకోడీ కర్రీ రెడి. పైన కొత్తిమీర తరుగు చల్లుకుంటే సరిపోతుంది. 

పకోడిలలో చాల రకాలు ఉన్నాయి. మెత్తని పకోడితో కర్రీ వండాలనుకుంటే పకోడీ వేసిన అయిదు నిమిషాలకే స్టవ్ కట్టేయాలి. లేకుంటే పకోడీ చిన్న చిన్న ముక్కలుగా విడిపోతుంది. అదే గట్టిగా చేసుకున్న పకోడీతో వండితే మాత్రం ఇగురులో కాసేపు పకోడీని ఉడకనివ్వచ్చు. ఉల్లిపకోడి, పాలకూర పకోడి, పల్లి పకోడి, చికెన్ పకోడి, సొరకాయ పకోడి... ఇలా ఏ పకోడితో అయినా కర్రీ చేసుకోవచ్చు. చికెన్ పకోడితో చేసిన కూర చపాతీ, రోటీల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. 

Also read: ఆ పానీయాలతో క్యాన్సర్ వచ్చే అవకాశం - ఎందుకొస్తుందో వివరించిన అధ్యయనం

Published at : 04 Dec 2022 11:14 AM (IST) Tags: Telugu Recipes Telugu Vantalu Onion pakoda Curry Pakoda Curry in Recipe Pakoda Curry

సంబంధిత కథనాలు

Cauliflower: క్యాలీఫ్లవర్ ఆకులు పడేస్తున్నారా? దాని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇక మీదట అలా చెయ్యరు

Cauliflower: క్యాలీఫ్లవర్ ఆకులు పడేస్తున్నారా? దాని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇక మీదట అలా చెయ్యరు

Green Peas Recipe: పచ్చిబఠానీ - చీజ్ కట్‌లెట్ రెసిపీ, సాయంత్రానికి టేస్టీ స్నాక్

Green Peas Recipe: పచ్చిబఠానీ - చీజ్ కట్‌లెట్ రెసిపీ, సాయంత్రానికి టేస్టీ స్నాక్

Samantha Diet: ఆటోఇమ్యూన్ డైట్ - సమంత పాటిస్తున్న డైట్ ఇదే, ఇంతకీ ఏంటిది?

Samantha Diet: ఆటోఇమ్యూన్ డైట్ - సమంత పాటిస్తున్న డైట్ ఇదే, ఇంతకీ ఏంటిది?

అది ప్రేమ హార్మోన్ కాదు, ఆ హార్మోన్ లేకున్నా మనం ప్రేమించగలం - కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు

అది ప్రేమ హార్మోన్ కాదు, ఆ హార్మోన్ లేకున్నా మనం ప్రేమించగలం - కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు

గంజి నీళ్ళతో ఎన్ని ఉపయోగాలో తెలిస్తే, మీరు కూడా గంజి వచ్చేలా అన్నం వండుతారు

గంజి నీళ్ళతో ఎన్ని ఉపయోగాలో తెలిస్తే, మీరు కూడా గంజి వచ్చేలా అన్నం వండుతారు

టాప్ స్టోరీస్

Vijayashanthi: దొంగను పట్టించండి - ఈటల రాజేందర్‌కు విజయశాంతి కౌంటర్

Vijayashanthi: దొంగను పట్టించండి - ఈటల రాజేందర్‌కు విజయశాంతి కౌంటర్

కృష్ణా జిల్లా వైఎస్‌ఆర్‌సీపీలో రచ్చరచ్చ- ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు బాహాబాహీ

కృష్ణా  జిల్లా వైఎస్‌ఆర్‌సీపీలో రచ్చరచ్చ-  ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు బాహాబాహీ

Bharat Jodo Yatra: శ్రీనగర్‌లో రాహుల్, ప్రియాంక సందడి - భారీ సభతో జోడో యాత్రకు ముగింపు

Bharat Jodo Yatra: శ్రీనగర్‌లో రాహుల్, ప్రియాంక సందడి - భారీ సభతో జోడో యాత్రకు ముగింపు

Kangana Ranaut:‘ఈ దేశం ఖాన్‌లను, ముస్లీం హీరోయిన్లకు ప్రేమిస్తోంది’ - ‘పఠాన్’ సక్సెస్‌పై కంగనా కామెంట్స్

Kangana Ranaut:‘ఈ దేశం ఖాన్‌లను, ముస్లీం హీరోయిన్లకు ప్రేమిస్తోంది’ - ‘పఠాన్’ సక్సెస్‌పై కంగనా కామెంట్స్