అన్వేషించండి

Skin Cancer: పుట్టుమచ్చలే కాదు ఈ లక్షణాలు కూడా చర్మ క్యాన్సర్ సంకేతాలే

శరీరంపై అసాధారణంగా పుట్టుమచ్చలు ఉంటే కాస్త ఆందోళన చెందుతారు. అవి క్యాన్సర్ మచ్చలని భయపడిపోతారు. అవే కాదు నయం కానీ గాయాలు కూడా చర్మ క్యాన్సర్ కిందకే వస్తాయి.

పుట్టుమచ్చలు అందరికీ ఉంటాయి. కానీ కొందరికి ఉండే పుట్టుమచ్చలు క్యాన్సర్ మచ్చలని గుర్తించడం చాలా కష్టం. ప్రపంచవ్యాప్తంగా చర్మ క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. చర్మ క్యాన్సర్ ని కనిపెట్టడం సులభం అనుకుంటారు కానీ దాని ప్రారంభ సంకేతాలు గుర్తు పట్టడం చాలా కష్టం. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ అసోసియేషన్ ప్రకారం ఇంట్లోనే చర్మ మీద మచ్చలు గురించి తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యమని అంటున్నారు.

చర్మ క్యాన్సర్ సంకేతాలు

చర్మ క్యాన్సర్ సంకేతాలలో అసాధరణంగా కనిపించేది పుట్టుమచ్చలే. చర్మంలో మార్పులు, కొత్తగా గడ్డలు లేదంటే నయం కానీ పుండ్లు కనిపిస్తాయి. ఇవి మెరుస్తూ మైనం ముద్దగా ఉంటాయి. కొన్ని సార్లు వీటి నుంచి రక్తస్రావం అవుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది ప్రారంభ దశ బేసల్ లేదా స్క్వామన సెల్ స్కిన్ క్యాన్సర్ కావచ్చు. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ అసోసియేషన్ ప్రకారం కనురెప్ప మీద గట్టి బంప్ లాంటి తైల గ్రంథులలో మొదలయ్యే సెబాషియస్ గ్లాండ్ కార్సినవమా అని పిలిచే అరుదైన చర్మ క్యాన్సర్ ని సూచిస్తుంది.

పొడి పాచ్

చాలా మంది వ్యక్తులు తమ చర్మంపై పొడిగా, పొలుసుగా ఉండే పాచెస్ కనిపిస్తాయి. వీటిని యాక్టినిక్ కెరాటోసెస్ అని కూడా పిలుస్తారు. ఇది సూర్యరశ్మికి గురికావడం వల్ల సంభవిస్తుంది. కెరాటోసెస్ అనేది చర్మ పెరుగుదల అని వైద్యులు చెబుతున్నారు. ఇది సాధారణ చర్మ క్యాన్సర్ పొలుసుల కణ క్యాన్సర్ గా మారుతుంది. డ్రై ప్యాచ్ మాయిశ్చరైజ్ చచేసినప్పుడు తగ్గిపోతే అది క్యాన్సర్ సంకేతం కాకపోవచ్చు.

నయం కానీ గాయాలు

చర్మ క్యాన్సర్ వస్తే చర్మం మీద దద్దుర్లు, లేదా పాచ్ లు కనిపిస్తాయి. ఇవి నెమ్మదిగా క్రస్ట్ ను ఏర్పరుస్తాయి. వాటి నుంచి చీము, రక్తం కారడం జరుగుతుంది. క్యాన్సర్ పెరుగుతున్న కొద్దీ గాయం పరిమాణం, ఆకారం కూడా పెరుగుతుంది. బేసల్ సెల్ కార్సినవమా ఏర్పడుతుంది. ఈ గాయాలు నయం కావు, దీర్ఘకాలం పాటు రక్తస్రావం జరుగుతుంది.

ఎరుపు లేదా పింక్ రంగు గాయాలు

పింక్, ఎరుపు, ఊదా రంగు గాయాలు ప్రమాదకరం. నొప్పిలేకుండా కనిపిస్తాయి. ఇవి కూడా త్వరగా నయం కావు. చర్మం సూర్యరశ్మికి ఎక్కువగా బహిర్గతం అయితే అవి త్వరగా పెరుగుతాయి. అమెరికా క్యాన్సర్ చికిత్స కేంద్రం చెప్పిన దాని ప్రకారం ఇవి ఇటువంటి గాయాలు కపోసి సార్కోమా అని అంటారు. తరచుగా తల లేదా మెడపై అభివృద్ధి చెందుతాయి. మొదట రక్తనాళాలో ప్రారంభవమై తర్వాత విస్తరిస్తాయి.

కేవలం పుట్టుమచ్చలు మాత్రమే చర్మ క్యాన్సర్ సంకేతాలు అనుకుంటారు. కానీ ఇవి కూడా ప్రమాదకరమైన చర్మ క్యాన్సర్ లక్షణాలే. ఇవి కనిపించినా కూడా వెంటనే వైద్యులను సంప్రదించి రోగనిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also Read: ఈ చిట్కాలు పాటిస్తే గురక పరార్ - రాత్రంతా హాయిగా నిద్రపోవచ్చు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Aadhaar Card Updating: ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Embed widget