Snore: ఈ చిట్కాలు పాటిస్తే గురక పరార్ - రాత్రంతా హాయిగా నిద్రపోవచ్చు!
గురక చాలా చిన్న సమస్య అనుకుంటారు. కానీ దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గురకని తగ్గించే సహజ నివారణలు ఇవి.
గురక పెట్టేవారికి బాగానే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు పెడుతున్నారనే విషయం కూడా కొంతమందికి తెలియదు. కానీ వాళ్ళ పక్కన ఉంది గురక భరించే వాళ్ళ పరిస్థితి చూడాలి. పాపం నిద్ర ఉండదు రాత్రంతా జాగారమే. గురక పెడితే బాగా డీప్ స్లీప్ లో ఉన్నారని అనుకుంటారు. కానీ దాన్ని తగ్గించుకొకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గురకని సహజ సిద్ధంగా నయం చేయడంలో సహాయపడే మార్గాలు కొన్ని ఉన్నాయి. వాటిని ఫాలో అయ్యారంటే గురక తగ్గిపోతుంది రాత్రంతా హాయిగా నిద్రపోతారు.
నూనెలు
గురకని తగ్గించుకోవడానికి నూనెలు చక్కగా ఉపయోగపడతాయి. పిప్పరమెంట్, యూకలిప్టస్, లావెండర్ నూనెల్లో ఓదార్పు లక్షణాలు ఉన్నాయి. వీటని పడగగదిలో ఉంచితే మంచిది. ఈ నూనె వాసన పీల్చడం వల్ల గురకను నియంత్రించవచ్చు. లేదంటే నిద్రపోయే ముందు ఛాతీ లేదా పాదాలను రాసుకోవాలి. సుగంధ ఆవిరి నాసికా భాగాలను క్లియర్ చేసి రద్దీని తగ్గిస్తుంది. విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది. ప్రశాంతమైన నిద్రని కలిగిస్తుంది.
జీవనశైలిలో మార్పులు
జీవనశైలిలో మార్పులు గురకను తగ్గించడంలో మెరుగ్గా పని చేస్తాయి. బరువుని అదుపులో ఉంచుకుంటే గురక అదుపులో ఉంటుంది. ఆల్కాహాల్, మత్తు మందులు నివారించాలి. అవి గొంతు కండరాలని సడలించి గురకని మరింత తీవ్రతరం చేస్తాయి. తల కింద దిండు పెట్టుకుని పడుకుంటే కొంతవరకు గురక తగ్గుతుంది. దీని వల్ల శ్వాస మార్గం తెరుచుకుని గురక నుంచి ఉపశమనం లభిస్తుంది.
హెర్బల్ రెమిడీస్
గురకను ఎదుర్కోవదనికి ప్రకృతి మనకి శక్తివంతమైన మూలికా ఔషధాలని అందిస్తుంది. చమోమిలీ, పిప్పరమెంట్ వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగిన మూలికలు తీసుకోవచ్చు. ఇవి నాసికా రద్దీని తగ్గిస్తాయి. సులభంగా శ్వాస తీసుకునేలా చేస్తాయి. నిద్రవేళకి ముందు ఈ మూలికలతో చేసిన హెర్బల్ టీలు తాగడం వల్ల గురక నుంచి ఉపశమనం పొందవచ్చు. అదనంగా అందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగిన పసుపు జోడించుకోవచ్చు. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గురక తీవ్రత తగ్గించడంలో సహాయపడుతుంది.
నాసల్ స్ట్రిప్స, డైలెటర్స్
నాసికా స్ట్రిప్స్, డైలెటర్ గాలి ప్రవాహాన్ని మెరుగుపరిచి గురకని తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తాయి. అంటుకునే ఈ స్ట్రిప్స్ ముక్కు మీద వేసుకోవాలి. ఇది సులభంగా శ్వాస తీసుకోవడానికి సహాయపడుతుంది. నాసికా డైలెటర్ లు పీల్చడం వల్ల ముక్కు రంధ్రాలు మూసుకుపోకుండా ఉంటాయి. ఈ రెండు ఎంపికలు గురక నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి.
నాలుక, గొంతు వ్యాయామాలు
నాలుక, గొంతులోని కండరాలకు వ్యాయామం చేయడం ద్వారా వాటిని బలోపేతం చేయవచ్చు. ఇది గురక సౌండ్ ని తగ్గిస్తుంది. నాలుకని నోట్లో పైకి కిందకు, ముందుకు వెనుకకు కదిలించడం వంటి సాధారణ వ్యాయామాలు కండరాలని తవం చేస్తాయి. రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే గురక తగ్గిపోతుంది.
గురకని తగ్గించుకునేందుకు ఈ సహజ నివారణలు చక్కగా ఉపయోగపడతాయి. వీటిలో ఏ ఒక్కటి పాటించినా కూడా గురక లేని నిద్ర మీ సొంతం చేసుకోవచ్చు. మీరే కాదు మీ పక్క వాళ్ళు కూడా హాయిగా నిద్రపోతారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: డయాబెటిక్ రెటినోపతితో కంటి చూపు పోతుందా? ఆయుర్వేదంతో కళ్లను కాపాడుకోవచ్చా?