అన్వేషించండి

National Immunization Day : నేషనల్ వ్యాక్సినేషన్ డే 2024 థీమ్ ఇదే.. కానీ ఇదే రోజు ఎందుకు జరుపుతున్నారంటే..

National Vaccination Day : వ్యాక్సిన్​ వేయించుకోకపోతే కలిగే నష్టాలేంటో చెప్తూ.. వ్యాక్సిన్ ప్రాముఖ్యతను తెలియజేసేందుకు జాతీయ ఇమ్యునైజేషన్ డేను జరుపుతున్నారు. మరి ఈ సంవత్సరం ఏ థీమ్​తో వస్తున్నారంటే..

Vaccination Day 2024 Theme : దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్​ ప్రామఖ్యతను గురించి తెలియజేస్తూ.. ప్రతి సంవత్సరం మార్చి 16వ తేదీన నేషనల్ ఇమ్యునైజేషన్ డే నిర్వహిస్తున్నారు. దీనినే జాతీయ టీకా దినోత్సవం అని కూడా పిలుస్తారు. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా టీకా డ్రైవ్​లను నిర్వహిస్తారు. అంతేకాకుండా టీకాలు తీసుకోవడం వల్ల కలిగే ప్రభావాలు, తీసుకోకపోతే జరిగే నష్టాలు గురించి అవగాహన కల్పిస్తారు. ఏయే వ్యాక్సిన్స్ తీసుకోవాలి? ఏ వయసులో వ్యాక్సిన్ తీసుకోవాలి వంటి వాటిపై కూడా నిపుణులు సలహా ఇస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రతి సంవత్సరం సరికొత్త థీమ్​తో వస్తారు. మరి ఈ సంవత్సరం ఎలాంటి థీమ్​తో వస్తున్నారు? వ్యాక్సిన్ల ప్రాముఖ్యతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

తల్లిపాలు ద్వారా పిల్లలకు కావాల్సినంత రోగనిరోధక శక్తి సరైన స్థాయిలో అందదు. ఆ సమయంలో పిల్లలు ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది. వివిధ ఆరోగ్య సమస్యలు వారిని ఇబ్బంది పెడతాయి. కొన్నిసార్లు వైకల్యం కూడా వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సమస్యలను నిరోధించి.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. యాంటిజెన్​లను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్​లు చాలా హెల్ప్ చేసి.. పిల్లలను రక్షిస్తాయి. ఇవి వారి ఎదుగుదలకు హెల్ప్ చేసి మొత్తం జీవితకాలంలో రక్షణ కల్పిస్తాయి. 

వ్యాక్సిన్​లు ఎందుకు అవసరమంటే..

అంటు వ్యాధుల వ్యాప్తిని నివారించడానికి టీకాలు చాలా అవసరం. పలు వైరస్​లు, బ్యాక్టీరియా దరి చేరకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో వ్యాక్సిన్స్ హెల్ప్ చేస్తాయి. తద్వార అంటు వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. శిశువులు, వృద్ధుల్లో, రోగనిరోధక శక్తి లేని వారిని వివిధ వ్యాధులను నుంచి రక్షించడంలో వ్యాక్సిన్స్ హెల్ప్ చేస్తాయి. పైగా వ్యాక్సినేషన్ అనేది చవకైన ప్రజారోగ్య చర్య. ఇది ప్రాణాలను కాపాడుతుంది. అంటువ్యాధుల వల్ల కలిగే దీర్ఘకాలిక ఆరోగ్య పరిణామాలను నివారిస్తుంది. 

అప్పటినుంచే ఈ డేను నిర్వహిస్తున్నారు..

1995లో మార్చి 16వ తేదీన ఇండియాలో మొదటిసారి నోటి ద్వారా తీసుకునే పోలియో వ్యాక్సినేషన్ మొదటి డోస్ ఇచ్చారు. అప్పటినుంచి ప్రతి ఏటా ఇదే రోజు జాతీయ ఇమ్యునైజేషన్ డే నిర్వహిస్తున్నారు. ఈ మహత్తర కార్యక్రమంతో దేశం నుంచి పోలియోను నిర్మూలించగలిగాము. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్చి 27, 2014న పోలియో రహితం దేశంగా భారతదేశాన్ని ప్రకటించింది. 

మసూచి మొదలుకొని.. 

ఎందరో ప్రాణాలు తీసిన మసూచిని అరికట్టడం మొదల్కోని.. రీసెంట్​గా అందరినీ ఇంట్లో కూర్చోబెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకునేలా చేసిన కరోనాను కంట్రోల్​ చేయగలిగేలా చేసింది వ్యాక్సిన్ మాత్రమే. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ప్రాణాంతక వ్యాధులనుంచి ప్రజలను రక్షిస్తాయి. కేవలం పిల్లలకే కాకుండా పెద్దలు కూడా కొన్ని వ్యాక్సిన్స్ వేయించుకోవాల్సి ఉంటుంది. కొన్ని ప్రాణాంతక వ్యాధులు రాకుండా.. వచ్చినా వాటి ప్రభావం ఎక్కువగా లేకుండా చేయడంలో వ్యాక్సిన్స్ కీలకపాత్ర పోషిస్తాయి. 

భారతదేశంపై వ్యాక్సిన్ ప్రభావం..

ప్రస్తుతం ఇండియా ప్రపంచంలోనే అత్యంతం విస్తృతమైన రోగనిరోధకత కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. వైద్య సదుపాయాలు సరిగ్గా లేని ప్రాంతాలకు కూడా వ్యాక్సిన్స్​లను చేర్చుతుంది. వ్యాక్సిన్ ప్రాముఖ్యతలపై విస్తృత ప్రచారాన్ని చేస్తుంది. అంతేకాకుండా స్వదేశీ వ్యాక్సిన్లను తయారు చేస్తూ ఎందరికో ప్రాణదాత అవుతుంది. 

ఈ ఏడాది థీమ్ ఏంటంటే..

జాతీయ టీకా దినోత్సవం 2024 థీమ్​ ఏంటంటే.. స్త్రీ, పురుష లింగ బేధం లేకుండా.. సామాజిక ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా.. వ్యాక్సిన్లు అందరికీ పని చేస్తాయనే థీమ్​తో వస్తున్నారు. సురక్షితమైన, ప్రభావవంతమై టీకాలు మన పౌరులకు అవసరమనే అంశాన్ని ఈ థీమ్ వివరిస్తోంది. 

Also Read : రక్తమార్పిడితో ప్రాణాంతక అలెర్జీలు వచ్చే ప్రమాదం.. షాకింగ్ విషయాలు వెల్లడించిన తాజా అధ్యయనం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Attacks Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Nagababu: నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mohan babu Audio on Manchu Manoj | నా గుండెల మీద తన్నావ్ రా మనోజ్ | ABP DesamMohan babu Attack Media | మీడియా ప్రతినిధిని దారుణంగా కొట్టిన మోహన్ బాబు | ABP DesamManchu Mohan babu Attack | కొడుకును, మీడియాను తరిమి కొట్టిన మోహన్ బాబు | ABP Desamముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Attacks Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Nagababu: నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
Sana Sathish: చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
RCB News: డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
Gautham Krishna - Bigg Boss Telugu: సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
Embed widget