Nail Extension: నెయిల్ ఎక్స్ టెన్షన్ గోళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందా?
అందాన్ని ఇచ్చే నెయిల్ ఎక్స్ టెన్షన్ అనారోగ్యాన్ని కూడా కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలా కాకుండా ఉండాలంటే ఇలా చేయండి.
అమ్మాయిలు గోర్లు అందంగా కనిపించేలా ఉంచుకునేందుకు చాలా కష్టపడతారు. షేప్స్ చేసుకుంటూ నెయిల్ పాలిష్ వేసుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటారు. మానిక్యూర్ అంటూ పార్లర్ వెంట పడుతూ ఉంటారు. కానీ కొంతమందికి గోర్లు సరిగా పెరగవు. పైగా విటమిన్లు లోపం కారణంగా గోర్లు ఎగుడు దిగుడుగా పెరిగిపోతాయి. వాటిని కనిపించకుండా చేసుకునేందుకు ఇప్పుడు పెట్టుడు గోర్లు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఇదే ట్రెండ్. ఈ పెట్టుడు గోర్లు పెట్టుకున్న తర్వాత వాటిని సరైన రూపంలోకి కట్ చేసుకుని నెయిల్ పాలిష్ వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తాయి. పార్లర్ కి వెళ్ళే అవసరం లేకుండా కొంతమంది ఇంట్లోనే నెయిల్ ఎక్స్ టెన్షన్ చేసుకుంటూ ఉంటారు. ఇవి వాళ్ళ అందాన్ని మరింత రెట్టింపు చేస్తాయి.
ఇక గోర్లు పెంచుకోవాలని బాధ లేకుండా మనకి నచ్చినప్పుడు నచ్చిన విధమైన గోర్లు పెట్టుకునే వీలు కల్పించాయి. కానీ ఇవి పెట్టుకోవడం వల్ల అసలు గోర్లుకి ఇబ్బంది కలుగుతుందా? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. గోరు పొడిగింపు సరిగా లేకపోతే అది గోరు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి.
గోర్లు దెబ్బతింటాయి: పెట్టుడు గోర్లు సరిగా పెట్టకపోయినా అవి సెట్ కాకపోయినా సహజమైన గోళ్ళని దెబ్బతీస్తాయి. గోర్లు అంటించే పదార్థాలు సరికానివి ఉపయోగించడం వల్ల సహజమైన గోర్లు బలహీనపడి విరిగిపోతాయి.
ఇన్ఫెక్షన్: గోరు పొడిగించడం వల్ల అక్కడ ప్రదేశం కూడా ఎక్స్ టెన్షన్ అవుతుంది. తేమ లాక్ అవుతుంది. బ్యాక్టీరియా, శిలీంధ్రాలు చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సరైన పరిశుభ్రత పద్ధతులు పాటించకపోతే అది గోళ్ళకి ఇన్ఫెక్షన్ కి దారి తీస్తుంది.
అలర్జీ: గోర్లు అతికించుకునేందుకు ఉపయోగించే పదార్థాలు లేదా యాక్రిలిక్ లేదా జెల్ ఉత్పత్తులు అలర్జీ అభివృద్ధి చేసే అవకాశం ఉంది. ఇది చర్మం చికాకు, ఎరపు, వాపు లేదా చర్మాన్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంది.
సహజమైన గోర్లు సన్నబడతాయి: నెయిల్ ఎక్స్ టెన్షన్ లకు రెగ్యులర్ మెయింటెనెన్స్ అవసరం. ఇడి తరచుగా గోళ్లను వాటి రూపాన్ని కాపాడుకోవడానికి బఫ్ చేయడం వంటివి చేయాలి. కాలక్రమేణా ఇది సహజమైన గోర్లు సన్నబడేలా చేస్తుంది. దీని వల్ల అవి త్వరగా విరిగిపోతాయి.
తేమ కోల్పోవడం: గోరు పొడిగింపు వల్ల గోళ్ళ సహజమైన తేమ సమతుల్యతకి ఆటంకం కలిగిస్తుంది. పెట్టుడు గోర్లు అటాచ్ చేయడానికి ఉపయోగించే గోర్లు తేమని నిలుపుకోలేవు. ఫలితంగా అవి పొడిబారిపోయి పెళుసుగా మారిపోతాయి.
ఈ ప్రమాదాలు తగ్గించుకోవడానికి సరైన గోరు సంరక్షణ పద్ధతులు అనుసరించడం చాలా ముఖ్యం. నెయిల్ ఎక్స్ టెన్షన్ ఖచ్చితంగా నైపుణ్యం కలిగిన వారితో మాత్రమే చేయించుకోవాలి. సరైన పరిశుభ్రత పాటించాలి. డ్యామేజ్ అయిన గోర్లు సరికావడానికి మధ్య మధ్యలో విరామం ఇవ్వాలి. గోర్లు, చుట్టు పక్కన చర్మాన్ని తేమగా ఉంచుకునేందుకు ట్రై చేయాలి. లేదంటే ఇన్ఫెక్షన్స్ సోకుతాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
ALso Read: ప్రతిరోజూ ఓట్స్ తినడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?