Oats Health Benefits: ప్రతిరోజూ ఓట్స్ తినడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
ఓట్స్ ఎంత ఆరోగ్యమనే విషయం అందరూ ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. కాస్త చప్పగా ఉన్నప్పటికీ వీటిని తినేందుకు మొగ్గు చూపుతున్నారు.
ఇటీవలి కాలంలో ఓట్స్ వినియోగం ఎక్కువగానే కనిపిస్తుంది. ముఖ్యంగా మధుమేహ బాధితులు వీటితో చేసిన పదార్థాలు తినేందుకు మొగ్గు చూపుతున్నారు. అవసరమైన పోషకాలతో నిండిన ఓట్స్ క్రమం తప్పకుండా తినడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతున్నారు. ఇడి మొత్తం ఆరోగ్యం, శ్రేయస్సు మీద ప్రభావం చూపుతుంది. శక్తి స్థాయిలను పెంచి బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. ప్రతిరోజూ ఓట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి పోషకాహార నిపుణులు ఇలా చెప్పుకొచ్చారు..
ఓట్స్ ఉత్తమమైన అల్పాహార ఎంపికలో ఒకటి. ఇవి సంతృప్తిని కలిగిస్తాయి. రోజంతా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి. బీటా గ్లూకాన్ కలిగి ఉంటాయి. డయాబెటిక్, కొలెస్ట్రాల్ తగ్గించే ప్రభావాలు చూపించే అత్యంత క్రియాశీల సమ్మేళనం ఇది. ఓట్స్ తినడం వల్ల పొట్ట నిండుగా ఉంచుతుంది.
శక్తి స్థాయిలు పెరుగుతాయి
ఒక గిన్నె ఓట్స్ తో రోజును ప్రారంభించడం వల్ల శక్తిని పొందుతారు. ఇందులో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి. నిరంతర శక్తిని విడుదల చేయడం వల్ల రోజంతా యాక్టివ్ గా ఉంటాయి. ఏకాగ్రతని పెంచుతుంది. మధ్యాహ్నం ఆకలిని తగ్గిస్తుంది.
బరువు అదుపులో
ఆరోగ్యకరమైన బరువు కావాలని అనుకుంటే మార్నింగ్ డైట్ చార్ట్ లో ఓట్స్ ఉండేలా చూసుకోండి. ఇవి తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ని కలిగి ఉంటాయి. బ్రేక్ ఫాస్ట్, లంచ్ మధ్య ఎటువంటి చిరుతిండి తినాలనే కోరికను లేకుండా చేస్తాయి. ఓట్స్ లో కరిగే ఫైబర్ ఉంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గిస్తుంది.
జీర్ణ ఆరోగ్యం మెరుగు
ఓట్స్ డైటరీ ఫైబర్ మూలం. ఇందులోని బీటా గ్లూకాన్ జీర్ణక్రియ ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మలబద్ధకాన్ని నివారించవచ్చు. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ ప్రోత్సహిస్తుంది. ఇందులోని ఫైబర్ ప్రీబయోటిక్ గా పని చేస్తుంది. గట్ బ్యాక్టీరియాయని కాపాడుతుంది.
గుండెకి మేలు
ప్రతిరోజూ ఓట్స్ తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులోని కరిగే ఫైబర్ జీర్ణవ్యవస్థలోని కొలెస్ట్రాల్ ని గ్రహించి దాన్ని బయటకి పంపడంలో సహాయపడుతుంది. గుండె పోటు, హార్ట్ స్ట్రోక్ వంటి హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణ
మధుమేహం ఉన్నవారికి ఇది బెస్ట్ బ్రేక్ ఫాస్ట్. ఓట్స్ లోని అధిక ఫైబర్ కార్బోహైడ్రేట్ల శోషణ ని నెమ్మదిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చేస్తుంది. రోజంతా స్థిరమైన శక్తిని అందిస్తుంది.
అవసరమైన పోషకాలు అందుతాయి
ఇందులో ఫైబర్ మాత్రమే కాదు శరీరానికి అవసరమైన పోషకాలు ఉన్నాయి. మాంగనీస్, ఫాస్పరస్, మెగ్నీషియం, విటమిన్ బి1 తో సహ ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. శక్తి ఉత్పత్తి, ఎముకల ఆరోగ్యం, మెదడు పనీతిరు వంటి శారీరక విధులకు మద్దతు ఇవ్వడంలో ఈ పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: ఈ పండు విత్తనాలతో చేసిన పొడి తీసుకుంటే బోలెడు ప్రయోజనాలు