(Source: ECI/ABP News/ABP Majha)
Nail Changes and Health : గోళ్లల్లో ఆ మార్పులు ఆరోగ్య సమస్యలకు సంకేతాలట.. ఆ మార్పు మధుమేహనిదేనట
Nail Health Indicators : గోళ్లల్లో జరిగే కొన్ని మార్పులు ఆరోగ్య సమస్యలకు సంకేతాలు అంటున్నారు నిపుణులు. మీ గోరుల్లో ఆ మార్పులు చూస్తే వెంటనే అలెర్ట్ అవ్వాలంటున్నారు. ఇంతకీ అవేంటంటే..
Nail Changes and Diabetes Symptoms : కొందరికి గోళ్లు పెంచుకోవడం ఇష్టం. మరికొందరు గోళ్లు అస్సలు పెంచుకోరు. మరికొందరు కనీసం వాటిని శుభ్రం కూడా చేసుకోరు. ఇవన్నీ పక్కనపెడితే.. గోళ్లతో మీ ఆరోగ్యాన్ని లెక్కేయొచ్చని తెలుసా? గోళ్లతో ఏమి తెలుస్తాది అనుకోకండి.. మీ గోర్లు మీ ఆరోగ్యం గురించి చెప్తాయని అంటున్నారు పోషకాహార నిపుణులు. గోరుల్లో జరిగే మార్పులు ఆరోగ్య సమస్యలకు చిహ్నాలని.. వాటిని గుర్తిస్తే వెంటనే అలెర్ట్ అవ్వాలని చెప్తున్నారు. ఇంతకీ ఆ మార్పులు ఏంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం.
తెల్లని మచ్చలు..
చాలామంది గోళ్లల్లో తెల్లని మచ్చలు కనిపిస్తాయి. వీటిని ల్యుకోనిచియా అని కూడా అంటారు. ఎక్కువమందిలో ఇవి కనిపిస్తాయి కాబట్టి.. వాటిని చాలా క్యాజువల్గా తీసుకుంటారు. అయితే అవి కూడా కొన్ని ఆరోగ్య సమస్యలకు సంకేతాలేనట. శరీరంలో జింక్ లోపం, ఫంగల్ ఇన్ఫెక్షన్కి వీటిని సంకేతాలుగా చెప్తున్నారు పోషకాహార నిపుణులు. కొన్ని రకాల అలెర్జీలు వచ్చినప్పుడు కూడా ఈ తెల్లమచ్చలు కనిపిస్తాయట.
తరచూ విరిగిపోతుంటే..
కొందరికి గోళ్లు చాలా సులభంగా విరిగిపోతూ ఉంటాయి. లేదంటే ఈజీగా కట్స్ అవుతూ ఉంటాయి. దాని అర్థమేమిటంటే.. బలహీనత. గోర్లు సన్నగా, సున్నితంగా ఉండి.. త్వరగా విరిగిపోతూ, దెబ్బతింటూ ఉంటాయి. శరీరంలో విటమిన్ బి లోపముంటే ఇలా జరుగుతుందట. అంతే కాకుండా మీరు తీసుకునే ఆహారంలో కాల్షియం, ఐరన్, హెల్తీ ఫ్యాట్స్ ఉండట్లేదని అర్థమని చెప్తున్నారు.
ఎల్లో నెయిల్స్
కొందరిలో గోళ్లు పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి. అయితే పసుపునకు సంబంధించిన ఫుడ్స్ వల్ల కూడా రంగుమారుతుంది. అలా కాకుండా నార్మల్గా కొందరిలో గోళ్లు పసుపు రంగులోకి మారిపోతాయి. గోళ్లు పసుపు రంగులోకి మారడానికి స్మోకింగ్ ప్రధానకారణమట. అలాగే ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్, శ్వాసకోశ వ్యాధులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, థైరాయిడ్ వ్యాధులకు సంకేతాలని చెప్తున్నారు పోషకాహార నిపుణులు. అయితే ఇది మధుమేహానికి కూడా సంకేతమని చెప్తున్నారు. మీ గోళ్లు పసుపు రంగులోకి మారుతుంటే కచ్చితంగా షుగర్, థైరాయిడ్ టెస్ట్లు చేయించుకోవాలంటున్నారు నిపుణులు.
టెర్రీస్ నెయిల్స్..
కొందరికి గోళ్లు కింద భాగంలో తెల్లగా ఉంటాయి. హాఫ్ మూన్ టైప్లో ఉంటాయి. వీటినే టెర్రీస్ నెయిల్స్ అంటారు. అది కాలేయం, మూత్రపిండాల సమస్యలకు సంకేతం కావొచ్చని అంటున్నారు నిపుణులు. గుండె సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువేనట. కాబట్టి ఈ లక్షణాలు గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
స్పూన్ నెయిల్స్
కొందరి గోళ్లు నార్మల్గా కాకుండా స్పూన్ రూపంలో నెయిల్స్ పెరుగుతాయి. నేరుగా కాకుండా పుటాకారంగా పెరుగుతాయి. ఇది శరీరంలోని రక్తహీనతను, హైపో థైరాయిడిజం, కాలేయ సమస్యలను సూచిస్తుందట. ఈ తరహా సమస్యను గుర్తిస్తే.. ఐరన్ పుష్కలంగా ఉండే ఆహారాలను డైట్లో చేర్చుకోవాలట. మీ డైట్లో అవసరమైన అన్ని పోషకాలను చేర్చుకోవాలంటున్నారు.
మన ఆరోగ్యం గోళ్లను ఏ విధంగా ప్రభావితం చేస్తాయో తెలిసింది కదా. ఈ తరహా మార్పులు మీరు ముందుగానే గోళ్లల్లో గుర్తిస్తే వెంటనే వైద్యులు, నిపుణుల సలహాలు తీసుకోవాలి. దీనివల్ల సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స ప్రారంభిస్తే మంచి ఫలితాలుంటాయి.
Also Read : మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి జిమ్ కూడా ఓ కారణమేనా? అధ్యయనంలోని షాకింగ్ విషయాలు ఇవే