సింపుల్ టిప్స్

గోళ్లు విరిగిపోతున్నాయా? హెల్తీగా, స్ట్రాంగ్​గా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Published by: Geddam Vijaya Madhuri

మాయిశ్చరైజర్..

గోళ్లు డ్రైగా ఉంటే విరిగిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గోళ్లను హైడ్రేటెడ్​గా ఉంచాలి. క్యూటికల్ ఆయిల్, నెయిల్ క్రీమ్​ని రెగ్యూలర్​గా అప్లై చేస్తే మాయిశ్చరైజర్ అందుతుంది.

డైట్

మీరు తీసుకునే ఫుడ్ కూడా గోళ్లను స్ట్రాంగ్​గా, హెల్తీగా చేస్తుంది. బయోటిన్ రిచ్ ఫుడ్స్ కూడా గోళ్లకు మంచివి. గుడ్లు, నట్స్, ఆకుకూరలు గోళ్ల హెల్త్​కి మంచివి.

ఎక్కువ కడగకండి

కొందరికి చేతులను ఎక్కువగా కడిగే అలవాటు ఉంటుంది. దీనివల్ల చేతులు, గోళ్లు పొడిబారతాయి. ఇవి గోళ్లు విరిగిపోయేలా చేస్తాయి. కాబట్టి ఎక్కువగా కాకుండా అవసరమైనప్పుడు చేతులు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది.

గ్లౌవ్స్

కెమికల్స్ లేదా డిటార్జెంట్ వాడాల్సిన అవసరం వచ్చినప్పుడు చేతులకు గ్లౌవ్స్ వేసుకుంటే చాలా మంచిది. లేదంటే నెయిల్స్ తర్వగా పాడైపోతాయి.

ట్రిమ్ చేయడంలో

గోళ్లను ట్రిమ్ చేసుకునే విధానం బట్టి కూడా గోళ్ల పెరుగుదల, హెల్త్ ఆధారపడి ఉంటుంది. గోళ్ల కార్నర్స్ కట్ చేయడం అంత మంచిది కాదు.

కోట్స్

గోళ్లు పలుచగా ఉంటే స్ట్రెంత్ బేస్ కోట్స్ వేయాలి. నెయిల్స్​కి బలాన్ని అందించే కోట్స్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి.

ఆ పని వద్దు

కొందరికి గోళ్లను కొరికే అలవాటు ఉంటుంది. మీకు కూడా అలాంటి అలవాటు ఉంటే దానిని మానుకుంటే గోళ్లు అందంగా ఉంటాయి.

బ్రష్

నెయిల్ బ్రష్ రెగ్యూలర్​గా చేస్తే గోళ్లు స్ట్రాంగ్​గా, హెల్తీగా ఉంటాయి. గోళ్లలో రక్త ప్రసరణను పెంచి.. వాటి పెరుగుదలను ప్రోత్సాహిస్తాయి.

అవి వాడకండి

నెయిల్ రిమూవర్స్​ కొన్ని గోళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి హార్ష్​గా ఉండేవాటిని ఎంచుకోకుండా మంచిది.