ఈ రోజుల్లో చాలా మంది మహిళలు స్మోక్ చేస్తున్నారు.
స్మోకింగ్ పురుషులతో పాటు స్త్రీలకూ చెడే చేస్తుంది.
గర్భిణీలు స్మోక్ చేస్తే చాలా ఇబ్బందులు తలెత్తుతాయంటున్నారు నిపుణులు.
సిగరెట్ పొగలోని హానికర రసాయనాలు గర్భిణీల రక్తంలో కలుస్తాయి.
సిగరెట్ పొగలోని రసాయనాలు కడుపులోని పిండానికి చేరుతాయి.
శిశువు ఎదుగుదల, మానసిక అభివృద్ధికీ తీవ్ర ఆటంకం కలిగిస్తాయి.
హానికరకారకాలు తల్లి హృదయ స్పందనల రేటును ప్రభావితం చేస్తాయి.
డెలివరీ సమయంలో తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది.
నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com