బ్యూటీకి నిమ్మరసం

ముఖానికి నిమ్మరసాన్ని అప్లై చేస్తున్నారా? అయితే జాగ్రత్త

Published by: Geddam Vijaya Madhuri

అందానికి కూడా

నిమ్మకాయతో ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే దీనిలో విటిమిన్ సి, సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇవి మంచి ఫలితాలిస్తాయి.

క్లెన్సర్​గా

ఇది చర్మంపై ఉన్న మృతకణాలను తొలగిస్తుంది. క్లెన్సర్​గా పనిచేస్తుంది. అయితే దీనిని నేరుగా ముఖానికి అప్లై చేస్తే కొన్ని స్కిన్ సమస్యలు వస్తాయి.

సెన్సిటివిటీ

నిమ్మరసం అప్లై చేసి.. వెంటనే మీరు ఎండలోకి వెళ్తే స్కిన్ బాగా సెన్సిటివ్ అయిపోతుంది. ఇది ముఖంపై రెడ్​నెస్​ని క్రియేట్ చేస్తుంది.

నేరుగా అప్లై చేయొద్దు

చర్మపై ఇతర సమస్యలు ఏమైనా ఉంటే నిమ్మరసాన్ని నేరుగా అప్లై చేయకూడదు. ఇది పరిస్థితిని ఇంకా వరస్ట్ చేస్తుంది.

పింపుల్స్ యాక్టివ్​గా ఉంటే

ముఖ్యంగా పింపుల్స్ ఉన్నప్పుడు దీనిని అప్లై చేయకపోవడమే మంచిది. లేదంటే మంట పెరిగి.. పింపుల్స్ కూడా ఎక్కువ అవుతాయి.

సీరమ్ కూడా వద్దు

ఇదే కాదు.. విటమిన్ సి సీరమ్​ని కూడా పింపుల్స్ యాక్టివ్​గా ఉన్నప్పుడు అప్లై చేయకూడదు.

డైల్యూట్ చేయాలి

అందుకే దీనిని నేరుగా ముఖానికి ఉపయోగించవద్దంటున్నారు నిపుణులు. దీనిని డైల్యూట్ చేసి లేదా ఇతర పదార్థాలతో కలిపి మాత్రమే అప్లై చేయాలి.

ముల్తానీ మట్టి

ముల్తానీ మట్టి లేదా తేనెతో కలిపి దీనిని అప్లై చేయొచ్చు. ఇలా చేస్తే నష్టాలు కాదు.. స్కిన్​కి లాభాలు వస్తాయి.

శనగపిండి మాస్క్

శనగపిండిలో కలిపి ముఖానికి ప్యాక్​గా వేసుకుంటే ముఖానికి మంచి గ్లో వస్తుంది. మృతకణాలు కూడా తగ్గుతాయి.

బియ్యం పిండి మాస్క్

బియ్యంపిండితో కలిపి మాస్క్ వేసుకుంటే.. మీ స్కిన్​ మృదువుగా మారుతుంది. స్కిన్​కి ఎలాంటి ఇబ్బంది ఉండొద్దు. పైగా గ్లోయింగ్​గా ఉంటుంది.