పిల్లలకు పౌడర్ అప్లై చేస్తున్నారా? అయితే జాగ్రత్త
చిన్నపిల్లలకు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటివాటిలో పౌడర్ అప్లై చేయడం కూడా ఒకటి. లేదంటే వారికి కొన్ని ఇబ్బందులు వస్తాయట.
చిన్నపిల్లలకు స్నానం చేయించిన వెంటనే ఎక్కువ మొత్తంలో పౌడర్ అప్లై చేస్తూ ఉంటారు. అయితే ఇలా అప్లై చేయడం కరెక్ట్ కాదు అంటున్నారు.
పిల్లలకు పౌడర్ రాస్తే అందంగా కనిపిస్తారని, మంచి స్మెల్ వస్తుందని ఎక్కువ పౌడర్ని రాసేస్తూ ఉంటారు. ఇలా చేయడం అస్సలు మంచిది కాదట.
టాల్కమ్ పౌడర్ లంగ్స్లోపలికి వెళ్లి పిల్లలకు బ్రీతింగ్‌లో ఇబ్బందిని కలిగిస్తుంది. ఇవి లంగ్స్ ఆరోగ్యాన్ని ఇబ్బంది కలిగిస్తాయి.
బేబి స్కిన్ సెన్సిటివ్‌గా ఉంటుంది. టాల్కమ్ పౌడర్ని ఎక్కువగా అప్లై చేస్తే పిల్లలకు ర్యాష్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
తడి శరీరంపై రాస్తే బేబి స్కిన్ డై అయిపోయి.. అలెర్జీలు వచ్చే అవకాశముంటుంది. లేదంటే రియాక్షన్స్ వచ్చేస్తాయి.
ప్రైవేట్ పార్ట్స్ దగ్గర కూడా టాల్కమ్ పౌడర్ అప్లై చేయకపోవడమే మంచిది. ఇలా చేస్తే ఫ్యూచర్లో ఇబ్బందులు వస్తాయట.
పిల్లలకు వినియోగించే పౌడర్ నాణ్యతతో కూడినదై ఉండాలి. కుదిరితే వైద్యుల సలహాలు తీసుకుని ఉపయోగిస్తే మంచిది.
పౌడర్‌ను గుప్పేసినట్లు కాకుండా.. కొంచెం తీసుకుని స్కిన్‌కి సుకుమారంగా అప్లై చేయాలి. పౌడర్ డబ్బాలను పిల్లలకు దూరంగా ఉంచాలి.
ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది. (Images Source : Envato)