Mysterious illness: ఆ ఊరిలో మిస్టరీ వ్యాధి - కాళ్లు వాచిపోయి, ఒళ్లంతా నొప్పులు, అసలు ఏం జరుగుతోంది?
ఆ ఊరికి అకస్మా్త్తుగా ఏమైందో ఏమో అందరి కాళ్లు తీవ్రంగా వాచిపోతున్నాయి. ఒళ్లంతా నొప్పులతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఇంతకీ ఆ ఊరికి ఏమైంది? అక్కడి ప్రజలకు ఏమవుతోంది?
కర్ణాటకలోని చిక్కమగళూరు గురించి మీకు తెలిసే ఉంటుంది. ప్రకృతి అందాలతో ఎంతోమంది పర్యాటకుల మనసు దోచేస్తున్న ఈ పట్టణాన్ని అంతుచిక్కని వ్యాధి ఒకటి భయపెడుతోంది. అక్కడి ప్రజలు కాళ్లు వాచి, ఒళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. వైద్య పరీక్షలకు కూడా ఆ వ్యాధి ఏమిటనేది అంతు చిక్కడం లేదు. దీంతో అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొనే ప్రయత్నంలో వైద్యాధికారులు నిమగ్నమయ్యారు.
చిక్కమగళూరు జిల్లాలోని దేవగొండనహళ్లి గ్రామంలో గత నెలన్నర రోజులు నుంచి ప్రజలు ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీరిలో చాలామంది జ్వరం, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. మరోవైపు ఆ గ్రామంలో డెంగ్యూ, చికున్ గున్యా సమస్యలు కూడా భయపెడుతున్నాయి. అయితే, ఈ మిస్టరీ వ్యాధి సోకినవారి ఎవరిలో డెంగ్యూ, చికున్ గున్యా లక్షణాలేవీ కనిపించడం లేదు. దీంతో ఆ వ్యాధి ఏమిటో తెలియక జుట్టు పీక్కుంటున్నారు.
ఇప్పటికే అక్కడి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ సమస్యతో బాధపడుతోన్న రోగుల సంఖ్య క్రమేనా పెరుగుతోంది. కొందరైతే నడవలేక కదల్లేని పరిస్థితుల్లో ఉన్నారు. వీరిలో కొందరికి రక్త పరీక్షలు నిర్వహించగా వైరల్ ఫీవర్ అని తేలింది. ఇది ఒకరి నుంచి కుటుంబంలో ఉన్న అందరికీ సోకుతోందని, వైద్యం అందుకున్నా సరే నయం కావడం లేదని బాధితులు చెబుతున్నారు. ఈ గ్రామంలో 400 కుటుంబాలు ఉండగా.. ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు ఈ అనారోగ్యానికి గురవ్వుతున్నారు. చేతి వేళ్లు కూడా తీవ్రంగా నొప్పి పుడుతున్నాయని, దానివల్ల భోజనం చెయ్యడం కూడా కష్టంగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు.
Also Read: స్పెర్మ్ కౌంట్ పెరగాలంటే ఏం చెయ్యాలి? వేడి నీళ్ల స్నానం ప్రమాదకరమా? ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!