Hepatitis In Children: తల్లిదండ్రులూ జాగ్రత్త, పిల్లల ప్రాణాలు తీస్తున్న వింత వ్యాధి, లక్షణాలు ఇవే

కోవిడ్-19తోపాటు మరో భయానక వైరస్ లక్షణాలు పిల్లల్లో కనబడుతున్నాయి. దీనిపై ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరికలు జారీ చేసింది.

FOLLOW US: 

ప్రపంచాన్ని కరోనా మాత్రమే కాదు. చాపకింద నీరులా మరో వింత వ్యాధి కూడా కలవరపెడుతోంది. అయితే, ఈ వ్యాధి పిల్లలకే ఎక్కువగా సోకుతున్న నేపథ్యంలో సర్వత్రా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యాధితో ఇద్దరు చిన్నారులు మరణించారు. ఈ వింత వ్యాధి సోకిన పిల్లల కాలేయం దెబ్బతింటున్నట్లు వైద్యులు తెలిపారు. 12 దేశాల్లో ఒక నెల నుంచి 16 ఏళ్ల వయస్సు గల టీనేజర్లకు ఈ వ్యాధి సోకుతున్నట్లు సమాచారం. 

ఈ వ్యాధి సోకిన పిల్లలకు కాలేయం వద్ద మంటగా ఉంటున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు దీన్ని ‘అడెనోవైరస్’గా భావిస్తున్నారు. ఫ్లూ, గ్యాస్ట్రో లక్షణాలను కలిగించే సాధారణ వైరస్‌లను ఎదుర్కోవడం సులభమే. కానీ, ఈ వైరస్ మాత్రం కాలేయ వాపు(హెపటైటిస్)కు దారితీస్తుంది. ఈ వ్యాధి సోకుతున్న పిల్లల కళ్లు పింక్ కలర్‌లోకి మారుతున్నాయి. ఇంకా జలుబు, టాన్సిలిటిస్, దగ్గు, గొంతునొప్పి, విరేచనాలు, జ్వరం వంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి.  

ఈ వ్యాధి సోకిన పిల్లలకు కాలేయ మార్పిడి చేయాలని వైద్యులు తెలుపుతున్నారు. అమెరికా, యూకే, స్పెయిన్, ఇజ్రాయెల్, కెనడా, జపాన్‌ తదితర దేశాల్లో ఈ కేసులు పెరిగాయి. దీనికి ‘అడెనోవైరస్’ రకం ‘41F’ కారణం కావచ్చని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ నివేదిక కూడా అనుమానం వ్యక్తం చేసింది. అప్పటివరకు 74 మంది పిల్లల్లో అడెనోవైరస్‌ను గుర్తించినట్లు తెలిపింది. వీరిలో 19 మందికి కోవిడ్, అడెనోవైరస్‌ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నారని పేర్కొంది. 

అనేక అంటువ్యాధులు ఈ బగ్‌ను కలిగి ఉంటాయి. ఇది సాధారణంగా అతిసారం, వాంతులు, కడుపు నొప్పి, జ్వరానికి కారణమవుతాయి. అడెనోవైరస్‌కు చెందిన 41Fను రక్త నమూనాల్లో గుర్తించవచ్చు. కొన్ని అడెనోవైరస్ రకాలు నాన్-బ్లడ్ శాంపిల్స్‌లోనూ బయటపడినట్లు నిపుణులు తెలిపారు. హెపటైటిస్‌కు అడెనోవైరస్ ఇన్‌ఫెక్షన్‌తో సంబంధం ఉన్నట్లు కొన్ని ఆధారాలు లభించాయన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు చేతులను శుభ్రం చేసుకోవడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఈ ప్రధాన హెపటైటిస్ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని తెలుపుతున్నారు.  

Also Read: దంత సమస్యలతో గుండె జబ్బులు, ఈ అలవాట్లు వెంటనే మానుకోండి

☀ ముదురు రంగులో మూత్రం.
☀ లేత, బూడిద రంగులో మలం.
☀ చర్మంపై దురద.
☀ కళ్ళు, చర్మం పసుపు రంగులోకి మారడం (కామెర్లు).
☀ కండరాలు, కీళ్ల నొప్పులు.
☀ శరీరం బాగా వేడెక్కడం.
☀ అలసటగా అనిపించడం.
☀ ఆకలి లేకపోవడం.
☀ కడుపు నొప్పి. 

Also Read: వేసవిలో బెస్ట్ ఫ్రూట్ ఇదే - బొప్పాయిలో ఇన్ని ప్రయోజనాలను మీరు ఊహించి ఉండరు

Published at : 30 Apr 2022 05:23 PM (IST) Tags: Hepatitis In Children Hepatitis Outbreak Hepatitis cases Hepatitis cases rise Mysterious Virus

సంబంధిత కథనాలు

Vitamin D vs Diabetes: ‘విటమిన్-D’ సప్లిమెంట్లు మధుమేహాన్ని అడ్డుకుంటాయా? ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్

Vitamin D vs Diabetes: ‘విటమిన్-D’ సప్లిమెంట్లు మధుమేహాన్ని అడ్డుకుంటాయా? ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్

Irritable Bowel Syndrome: మీకు ఈ అలవాట్లు ఉంటే కడుపు కల్లోలమే, ఇలా చేస్తే సేఫ్!

Irritable Bowel Syndrome: మీకు ఈ అలవాట్లు ఉంటే కడుపు కల్లోలమే, ఇలా చేస్తే సేఫ్!

Memory Loss With Sex: మిట్ట మధ్యాహ్నం సెక్స్, సడన్‌గా గతం మరిచి ‘గజినీ’లా మారిపోయిన భర్త, ఈ సమస్య మీకూ రావచ్చు!

Memory Loss With Sex: మిట్ట మధ్యాహ్నం సెక్స్, సడన్‌గా గతం మరిచి ‘గజినీ’లా మారిపోయిన భర్త, ఈ సమస్య మీకూ రావచ్చు!

Dangerous Medicine: జ్వరం, నొప్పులకు ఈ మాత్ర వాడుతున్నారా? జాగ్రత్త, ప్రాణాలు పోతాయ్!

Dangerous Medicine: జ్వరం, నొప్పులకు ఈ మాత్ర వాడుతున్నారా? జాగ్రత్త, ప్రాణాలు పోతాయ్!

Sunscreen Benefits: సన్ స్క్రీన్‌తో చర్మం నల్లగా మారిపోతుందా? ఈ 8 అపోహలను అస్సలు నమ్మొద్దు!

Sunscreen Benefits: సన్ స్క్రీన్‌తో చర్మం నల్లగా మారిపోతుందా? ఈ 8 అపోహలను అస్సలు నమ్మొద్దు!

టాప్ స్టోరీస్

Regional Parties Income : అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు విరాళాల వెల్లువ - డీఎంకే, వైఎస్ఆర్‌సీపీకే సగం !

Regional Parties  Income  :  అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు విరాళాల వెల్లువ - డీఎంకే, వైఎస్ఆర్‌సీపీకే సగం !

NTR Jayanti: 40 ఏళ్లకే ఎన్టీఆర్ అద్భుతాలు చేశారు- ఆయనలా ఇంకొకరు లేరు, రారు: చంద్రబాబు

NTR Jayanti: 40 ఏళ్లకే ఎన్టీఆర్ అద్భుతాలు చేశారు- ఆయనలా ఇంకొకరు లేరు, రారు: చంద్రబాబు

IPL 2022: ఐపీఎల్ అయిపోయింది, ఇక ఝార్ఖండ్ ఎలక్షన్ డ్యూటీలో ధోనీ బిజీబిజీ - అసలేం జరిగిందంటే !

IPL 2022: ఐపీఎల్ అయిపోయింది, ఇక ఝార్ఖండ్ ఎలక్షన్ డ్యూటీలో ధోనీ బిజీబిజీ - అసలేం జరిగిందంటే !

Breaking News Live Updates: నట్టి క్రాంతి, నట్టి కరుణపై పంజాగుట్ట పీఎస్‌లో RGV ఫిర్యాదు

Breaking News Live Updates: నట్టి క్రాంతి, నట్టి కరుణపై పంజాగుట్ట పీఎస్‌లో RGV ఫిర్యాదు