Dental care: దంత సమస్యలతో గుండె జబ్బులు, ఈ అలవాట్లు వెంటనే మానుకోండి

దంతాలను శుభ్రంగా ఉంచుకోకపోతే గుండె సమస్యలు తప్పవు. కాబట్టి.. ఈ రోజు నుంచే ఈ అలవాట్లకు బై బై చెప్పండి.

FOLLOW US: 

దంతాలు ఆరోగ్యంగా ఉంటేనే మీరు కూడా ఆరోగ్యంగా ఉండగలరు. లేకపోతే గుండె జబ్బులు వేదించే ప్రమాదం ఉంది. అదేంటీ? దంతాలకు గుండెకు సమస్య ఏమిటనేగా మీ సందేహం. అయితే, మీరు ఈ విషయం తెలుసుకోవల్సిందే. దంతాలు, చిగుళ్లలో ఏర్పడే పుండ్లలో బ్యాక్టీరియా ఉంటుంది. మీ దంతాల నుంచి నేరుగా గుండెకు రక్త నాళాలు ఉంటాయి. ఫలితంగా నోట్లో ఏర్పడిన బ్యాక్టీరియా పుండ్లలోని రక్తంలో కలిసి గుండెకు చేరుకుంటాయి. అవి గుండె కవాటాలపై దుష్ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా కృత్రిమ గుండె కవాటాలు కలిగిన హృద్రోగులు తప్పకుండా తమ నోరు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి.

మానవ శరీరంలో అత్యంత నిర్లక్ష్యం చేసే శరీర భాగాల్లో ఒకటి నోరు. చాలామంది నోటి శుభ్రతను తీవ్రంగా పరిగణించరు. దంతాలు తీవ్రంగా పాడయ్యేవరకు దంత వైద్యులను సంప్రదించరు. కానీ, మీరెప్పుడు ఆ పొరపాటు చేయకండి. వీలైనంత వరకు దంతాలకు ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తపడండి. పంటి నొప్పి నుంచి చిగుళ్ల సమస్య ప్రతి ఒక్కటీ ప్రమాదకరమే. నొప్పికి భయపడి డెంటిస్టును కలవడం మానేస్తే.. అది పెద్ద సమస్య తెచ్చిపెడుతుంది. మీ దంతాలు ఆరోగ్యం ఉండాలంటే.. ముందుగా ఈ కింది అలవాట్ల నుంచి దూరంగా ఉండండి. 

అప్పుడప్పుడు బ్రష్ చేయడం: అతిగా బ్రష్ చేయడం లేదా అప్పుడప్పుడు బ్రష్ చేయడం కూడా ప్రమాదకరమే. కొందరు బ్రష్‌తో బలంగా దంతాలపై ఒత్తిడి తెస్తారు. అది కూడా అంత మంచిది కాదు. రోజూ కనీసం 2 నిమిషాలు బ్రష్ చేయాలి. అంతకంటే ఎక్కువ బ్రష్ చేస్తే ఎనామెల్ దెబ్బ తింటుంది. 

ఫ్లోసింగ్ చేయండి: చాలామంది రోజూ బ్రష్ చేస్తే సరిపోతుంది కదా అని అనుకుంటారు. కానీ, ఫ్లోసింగ్ కూడా తప్పనిసరి. సన్ని దారంతో దంతాలు మధ్య ఉండే ఖాళీలను శుభ్రం చేసుకొనే విధానమే ఫ్లోసింగ్. కాబట్టి, అదెలా చేస్తారో తెలుసుకుని ఇకపై ఆ పని మీద ఉండండి. 

మంచి ఆహారాన్ని తీసుకోండి: జంక్ ఫుడ్, కొవ్వు పదార్థాలను అతిగా తీసుకోవద్దు. అవి దంతాలను పాడు చేస్తాయి. అలాగే, అత్యంత వేడిగా లేదా చల్లగా ఉండే పదార్థాలను అస్సలు తీసుకోవద్దు. ఐస్‌ను నోటిలో పెట్టుకున్నా దంతాలు విరిగి.. ఆ ప్రాంతంలో ఆహార పదార్థాలు చేరి బ్యాక్టీరియాను వృద్ధి చేసే ప్రమాదం ఉంది.

Also Read: జంతువుల్లో వచ్చే రోగాలు ఇకపై మనుషులకు, స్టడిలో షాకింగ్ విషయాలు వెల్లడి

అధిక తీపి వద్దు: మీరు స్వీట్లు ఎక్కువగా తింటారా? ఇకనైనా కాస్త వాటికి దూరంగా ఉండండి. స్వీట్లు కావిటీస్‌ ప్రమాదాన్ని పెంచుతాయి. దంతాలకు రంథ్రాలు చేస్తాయి. అధిక చక్కెర వల్ల ఏర్పడే డయాబెటీస్ కూడా దంతాల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

Also Read: మగాళ్లు జాగ్రత్త! మొబైల్ అతిగా వాడితే ‘అది’ మటాష్, షాకింగ్ న్యూస్ చెప్పిన నిపుణులు

పళ్ళను పట్టకర్రలా వాడొద్దు: చాలామంది తమవి బలమైన పళ్లంటూ సాహసాలు చేస్తుంటారు. డ్రింకు మూతలు తెరవడం, ఐస్‌ను నమిలేయడం, వాల్‌నట్స్ పగలగొట్టడానికి తమ దంతాలను ఉపయోగిస్తారు. ఈ అలవాటు వల్ల చిగుళ్లకు గాయలవుతాయి. దంతాలు విరిగే ప్రమాదం కూడా ఉంది.   

Published at : 30 Apr 2022 08:08 AM (IST) Tags: Dental Problems Heart Disease With Dental Problem Dental Care Oral Health Problems Dental Heart Problems Link Between Heart and Mouth

సంబంధిత కథనాలు

Bermuda Triangle Tour: డెడ్లీ ఆఫర్, నౌకలో బెర్ముడా ట్రయాంగిల్‌కు టూర్, తిరిగి రాకపోతే ఫుల్ రిఫండ్!

Bermuda Triangle Tour: డెడ్లీ ఆఫర్, నౌకలో బెర్ముడా ట్రయాంగిల్‌కు టూర్, తిరిగి రాకపోతే ఫుల్ రిఫండ్!

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Vulvar Cancer: కనిపించని శత్రువు వల్వార్ క్యాన్సర్, మహిళలూ ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

Vulvar Cancer: కనిపించని శత్రువు వల్వార్ క్యాన్సర్, మహిళలూ ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

Menstrual Hygiene Day: రుతుక్రమంలో ‘అక్కడ’ సబ్బు వాడకూడదా? ఈ టిప్స్ పాటిస్తే ఇన్ఫెక్షన్లు దూరం!

Menstrual Hygiene Day: రుతుక్రమంలో ‘అక్కడ’ సబ్బు వాడకూడదా? ఈ టిప్స్ పాటిస్తే ఇన్ఫెక్షన్లు దూరం!

Vitamin D vs Diabetes: ‘విటమిన్-D’ సప్లిమెంట్లు మధుమేహాన్ని అడ్డుకుంటాయా? ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్

Vitamin D vs Diabetes: ‘విటమిన్-D’ సప్లిమెంట్లు మధుమేహాన్ని అడ్డుకుంటాయా? ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్

టాప్ స్టోరీస్

Mahanadu Chandrababu : నేను వస్తా.. దోచినదంతా కక్కిస్తా - మహానాడులో చంద్రబాబు హెచ్చరిక !

Mahanadu Chandrababu :  నేను వస్తా.. దోచినదంతా  కక్కిస్తా - మహానాడులో చంద్రబాబు హెచ్చరిక !

YSR Rythu Ratham: ఏపీలో రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు, ఇలా అప్లై చేసుకోండి - లాస్ట్ డేట్ ఎప్పుడంటే

YSR Rythu Ratham: ఏపీలో రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు, ఇలా అప్లై చేసుకోండి - లాస్ట్ డేట్ ఎప్పుడంటే

Vijayashanthi: విజయశాంతి - వీకే శశికళ రహస్య భేటీ! మూడేళ్ల క్రితం సాధ్యంకానిది ఇప్పుడవుతుందా?

Vijayashanthi: విజయశాంతి - వీకే శశికళ రహస్య భేటీ! మూడేళ్ల క్రితం సాధ్యంకానిది ఇప్పుడవుతుందా?

Amalapuram Violence: కొనసాగుతున్న అరెస్టుల పర్వం - మరో 7 రోజులపాటు 144 సెక్షన్ పొడిగింపు, మరో కీలక నిర్ణయం

Amalapuram Violence: కొనసాగుతున్న అరెస్టుల పర్వం - మరో 7 రోజులపాటు 144 సెక్షన్ పొడిగింపు, మరో కీలక నిర్ణయం