By: Haritha | Updated at : 09 Jul 2022 11:17 AM (IST)
(Image credit: myhomeTastes)
మునక్కాడలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవి. వీటిని కూరగా లేకుంటే సాంబారుకు జతగా మాత్రమే వాడుకుంటారు. కానీ దీనితో ఎంతో రుచికరమై టేస్టీ నిల్వ పచ్చడి చేసుకోవచ్చు. ఒక్కసారి తిన్నారా మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. చేయడం కూడా చాలా సులువు. మునగలో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. అలాగే కాల్షియం కూడా లభిస్తుంది. ఎన్నో శారీరక సమస్యలకు మునక్కాయలోని పోషకాలు పరిష్కారాన్ని చూపిస్తాయి. దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. తరచూ జ్వరం, జలుబు బారిన పడుతున్న వారు ములక్కాడలతో వండిన వంటలను అధికంగా తింటే చాలా మంచిది. అంతేకాదు సంతానోత్పత్తి సమస్యలకు మునక్కాయ మేలు చేస్తుంది.
కావాల్సిన పదార్థాలు
మునక్కాయలు - నాలుగు
చింతపండు - 50 గ్రాములు
ఎండు మిర్చి - 8
కరివేపాకులు - రెండు రెబ్బలు
వెల్లుల్లి రెబ్బలు - పది
మిపప్పప్పు - రెండు స్పూనులు
శెనగ పప్పు - రెండు స్పూనులు
మెంతులు - అర టీస్పూను
ఆవాలు - మూడు టీస్పూనులు
పసుపు - ఒక టీస్పూను
ఉప్పు - రుచికి సరిపడా
కారం - మూడు స్పూనులు
ఇంగువ - పావు టీస్పూను
నూనె - ఎనిమిది టీస్పూనులు
తయారీ ఇలా...
1. మునక్కాయలను కడిగి నాలుగు సెంమీల పొడవున కోసుకోవాలి. బాగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి.
2. చింతపండును ముందుగా నానబెట్టుకుని గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఆవాలు, మెంతులు వేసి వేయించాలి. వాటిని తీసి మెత్తటి పొడిలా చేసుకోవాలి.
4. అదే కళాయిలో నూనె వేసి వేడెక్కాక మునక్కాయ ముక్కలను వేసి అయిదు నిమిషాల వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
5. కళాయిలో మిగిలిన నూనెలో మినపప్పు, శెనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి కాసేపు వేయించాలి. అవి వేగాక వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకులు, ఎండు మిరపకాయలు వేసి వేయించాలి. తరువాత పసుపు, ఇంగువ కూడా వేయాలి. అన్నీ వేగాక చింత పండు గుజ్జు వేసి కలపాలి.
6. మిశ్రమం చిక్కగా అయ్యేవరకు ఉడికించాలి. తరువాత స్టవ్ కట్టేయాలి.
7. ఇప్పుడు పెద్ద గిన్నెను తీసుకుంది అందులో మునక్కాయ ముక్కలు వేసి, కారం, ఉప్పు, ముందుగా చేసి పెట్టుకున్న పొడిని వేసి బాగా కలపాలి.
8. ఆ మిశ్రమంలో కళాయిలో వేయించుకున్న చింతపండు మిశ్రమాన్ని కూడా వేసి కలపాలి.
9. ఆ మొత్తం మిశ్రమాన్ని ఒక సీసాలోకి మార్చి మూత పెట్టాలి.
10. ఒక రోజు తరువాత ఓపెన్ చేసి చూస్తే నూనె పైకి తేలుతుంది. అప్పుడు మళ్లీ గరిటెతో కలపాలి.
11. మీకు నూనె తక్కువగా అనిపించినా, మరికొంచెం నూనె కావాలనిపించినా వేడి చేసి చల్లారాక అందులో కలుపుకోవచ్చు.
12. పికెల్ చేసిన ఒక రోజు తరువాత దీన్ని తినడం ప్రారంభించవచ్చు. రుచి అదిరిపోతుంది. వేడివేడి అన్నంలో తింటే ఆ కిక్కే వేరు.
Also read: డయాబెటిక్ రోగులకు గ్రీన్ టీ మంచిదేనా? తాగడం వల్ల షుగర్ కంట్రోల్‌లో ఉంటుందా?
Also read: హీరో విక్రమ్‌కు ఛాతీ నొప్పి? గుండె నొప్పి - ఛాతీ నొప్పి వేరు వేరా? ఏది ఏంటో ఎలా తెలుసుకోవాలి?
Okinawa Town: ఎక్కువ కాలం జీవించాలని ఉందా? ఈ ప్రాంతానికి వెళ్లండి, 100 ఏళ్లు గ్యారంటీ, ఎందుకంటే..
Heart Attack: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? గుండె ప్రమాదంలో పడినట్లే
WhatsApp Emojis: వాట్సాప్‌లో ఆ రంగుల హార్ట్ ఎమోజీలకు అర్థం తెలుసా? ఒక్కో కలర్‌కు ఒక్కో భావం!
Viral news: కోడి కూసిందని కోర్టుకెక్కిన జంట, వీరి కష్టం ఏ పక్కింటోడికి కూడా రాకూడదు!
Ethiopian Airlines: గాఢ నిద్రలో పైలట్లు, ల్యాండ్ కాకుండా గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం, చివరికి..
High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?
Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్
Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!