Breastfeeding : శిశువు ఆరోగ్యానికి తల్లి పాలే అసలైన రక్ష.. భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలకు కూడా చెక్
Mothers Milk for Kids Health : తల్లిపాలే శిశువుకు మొదటి టీకాలాంటిదని చెప్తున్నారు నిపుణులు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందని.. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ అందిస్తుందని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపారు.

Breastfeeding Benefits : బిడ్డ పుట్టిన క్షణం నుంచి వారిలో రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ ఇమ్యూనిటీని పెంచడంలో తల్లి పాలు బాగా హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా డెలివరీ తర్వాత మొదటిరోజుల్లో వచ్చే చిక్కటి పసుపు రంగు పాలు చాలా మంచివని చెప్తున్నారు కాశీపూర్లో నియోనటాలజిస్ట్గా చేస్తూ.. పీడియాట్రిక్స్ విభాగంలో HODగా చేస్తున్న డాక్టర్ కుశల్ అగర్వాల్ తెలిపారు. దీనిని కొలోస్ట్రమ్ అంటారని.. దానిలో యాంటీబాడీలు, తెల్ల రక్త కణాలు.. బిడ్డలో రోగనిరోధక శక్తిని పెంచడంలో హెల్ప్ చేస్తాయన్నారు. పోషకాలతో నిండిన యాంటీబాడీలు.. వైరస్లు, బ్యాక్టీరియాను ఎదుర్కోవడానికి సహాయపడతాయని పేర్కొన్నారు. అంతేకాకుండా ఫ్యూచర్లో వచ్చే అలెర్జీలు, ఆస్తమా ప్రమాదాన్ని తగ్గిస్తాయని తెలిపారు.
రక్షణ పొర
తల్లిపాలలో సెక్రెటరీ IgA కూడా ఉంటుంది. ఇది బిడ్డలోని పేగులు, శ్వాసకోశ మార్గంలో ఉండే ఒక శక్తివంతమైన యాంటీబాడీ. ఇది క్రిములు, ఇతర బ్యాక్టీరియా నుంచి రక్షణ కవచంగా పనిచేస్తుంది. పిల్లలు బలహీనంగా మారకుండా ఇది హెల్ప్ చేస్తుంది.
రక్షణ వ్యవస్థ
బిడ్డ అవసరాలకు అనుగుణంగా తల్లి పాలలో కూర్పును శరీరం తనకి తానే తయారు చేస్తుందట. మీ బిడ్డ ఏదైనా ఇన్ఫెక్షన్ బారిన పడితే.. మీ శరీరం ఆ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన యాంటీబాడీలను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుందని కుశల్ తెలిపారు. ఆపై అవి తల్లి పాల ద్వారా అందుతాయి.
తల్లిపాలు ఇవ్వడం వల్ల అతిసారం, న్యుమోనియా, చెవి ఇన్ఫెక్షన్లు, ఇతర వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుంది. ఇది కేవలం బాల్య దశలో మాత్రమే రక్షణ కల్పించడం కాకుండా.. ఫ్యూచర్లో బలమైన రోగనిరోధక శక్తిని అందిస్తుంది. పెద్దయ్యాక కూడా ఆరోగ్య సమస్యలు తక్కువగా వస్తాయని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి.
తల్లిపాలు ఇచ్చేటప్పుడు ఎదురయ్యే సమస్యలివే
వాస్తవానికి తల్లికి తల్లిపాలు ఇవ్వడమనేది సులభం కాదు. చనుమొనలు నొప్పి రావడం, బిడ్డ పాలు తాగడానికి ఇబ్బంది పడటం లేదా పాల సరఫరా గురించి ఆందోళనలు వంటి సవాళ్లు ఉండవచ్చు. కాబట్టి చనుబాలివ్వడంపై మీకున్న అపోహలను కన్సల్టెంట్లు, పిల్లల వైద్యులు ద్వారా తెలుసుకోవచ్చు. వారు మీకు సరైన, మంచి అంశాలను చెప్తారు.
తల్లిపాలు పోషణ, రోగనిరోధక శక్తితో నిండి ఉంటాయి. కాబట్టి మీరు తల్లిపాలు ఇవ్వగలిగితే.. ప్రతి చుక్క విలువైనదని గుర్తించుకోవాలి. ప్రేమతో వారికి మీరు ఇచ్చే ఈ పాలు వారి జీవితాంతం కొన్ని సమస్యలు రాకుండా.. స్ట్రాంగ్ ఇమ్యూనిటీతో ఉండేలా చేస్తాయని చెప్తున్నారు.






















