matki dal uses: మట్కి పప్పు రుచి అమోఘం, పోషకాలు పుష్కలం
ఏంటి ఈ పప్పు.. ? దీని ప్రత్యేకతలేంటో తెలుసుకుందామా..
మట్కి పప్పు లేదా మటికల పప్పు గురించి ఎప్పుడైనా విన్నారా? కందిపప్పు, పెసరపప్పు ఉన్నాయి కానీ ఈ మట్కి పప్పు ఎంటా అని అనుకుంటున్నారా. అయితే మీరు దీని తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఆరోగ్యానికి ఇది ఎంతో మంచిది. బోలెడు పోషకాలు కూడా అందిస్తుంది. వీటిని మోత్ బీన్స్ లేదా మట్ బీన్స్ అని కూడా అంటారు. ఇవి లేత గోధుమ రంగులో ఉంటాయి. ఇందులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అన్నీ దుకాణాల్లో ఇవి సులభంగా దొరుకుతాయి. వాటిని కొనే ముందు పగుళ్లు లేకుండా ఉన్నవి చూసుకోవాలి. రోగనిరోధక శక్తి పెరగడానికి అవసరమైన అన్నీ పోషకాలు ఇందులో ఉంటాయి. సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ రుజిత దివాకర్ మట్కి పప్పును “సూపర్ ఫుడ్” అని అంటారు.
ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులో అధికంగా ఫైబర్, జింక్ పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గడానికి ఈ ఫుడ్ చాలా మంచి ఎంపిక. శరీర పనితీరుకు అవసరమైన విటమిన్ బి ఇందులో దొరుకుతుంది. హృద్రోగులు ఈ మోత్ బీన్స్ తమ డైట్ లో భాగంగా చేసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఇది తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్, రక్త పోటుని అదుపులో ఉంచుతుంది. అంతే కాదండోయ్ చర్మ సౌందర్యానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. వృద్దాప్య ఛాయలు ముఖంలో కనిపించకుండా మెరిసే చర్మ కాంతి మీ సొంతం అవుతుంది.
దుకాణాల నుంచి తెచ్చుకున్న మట్కా పప్పులో రాళ్ళు లేకుండా శుభ్రంగా ఏరుకోవాలి. ఆ తర్వాత వాటిని మంచి నీటిలో వేసి శుభ్రంగా కడగాలి. వండటానికి ముందుగా సుమారు 4-6 గంటలపాటు చల్లటి నీటిలో నానబెట్టుకోవాలి. ఈ మట్కా పప్పు తో ఎన్నో రుచికరమైన వంటకాలు కూడా మనం చేసుకోవవచ్చు.
* ప్రతీ ఇంట్లో ఈ పప్పుని తప్పనిసరిగా వండుకుంటున్నారు. సాధారణంగా కందిపప్పు చేసుకున్నట్టే ఇందులో కూడా మనం కూరగాయలు వేసి రుచికరంగా వండుకోవవచ్చు. ఇది చాలా సులభమైన వంటకం.
* వీటిని రైస్ తో కలిపి కిచిడిలాగా కూడా చేసుకోవచ్చు.
* పొడి మసాలాలతో కలిపి పరోటా, పూరీలలో కూడా ఉపయోగించుకోవచ్చు.
* మట్కా పప్పుతో చేసిన వంటకాలు రుచికరంగా ఉండటమే కాదు.. బోలెడు పోషకాలు కూడా ఉంటాయి.
* ఈ పప్పుతో టేస్టి సూప్ కూడా చేసుకోవవచ్చు. మాంసాహార ప్రియులు ఈ పప్పుని చికెన్ వంటకాల్లో వేసుకుంటే మంచి రుచి కూడా వస్తుంది.
* ఇందులో పొటాషియం, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి.