Modern Men Makeovers : మగవారిలో పెరుగుతున్న సెల్ఫ్ కేర్ ట్రెండ్.. స్కిన్ కేర్ నుంచి ప్లాస్టిక్ సర్జరీల వరకు
Rise of Male Self Care : అంతర్జాతీయ పురుషుల దినోత్సవం నవంబర్ 19న జరుపుతున్నారు. అయితే ఇండియాలో పురుషుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం కోసం ఫాలో అవుతున్న బ్యూటీ ట్రీట్మెంట్స్ ఏంటో చూసేద్దాం.

Modern Men and Makeovers : మగవారికి గ్రూమింగ్ అంటే షేవింగ్, హెయిర్ కట్, అప్పుడప్పుడు ముఖం కడుక్కోవడం. అయితే ఈ ధోరణి ఈ మధ్య మారుతుంది. ఈ మధ్యకాలంలో చాలామంది తమ లుక్స్‌పై దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఎలా కనిపిస్తున్నారు? వయసు పెరిగేకొద్దీ ఎలా మారుతున్నారు? అనే అంశాలపై శ్రద్ధ చూపుతున్నారు. ఇలా పురుషుల్లో కూడా స్వీయ సంరక్షణ గురించి ఆలోచించే విధానం మారుతోంది. ఒకప్పుడు బ్యూటీ అంటే స్త్రీలకు మాత్రమే అనే రోజులు మారి.. పురుషులు కూడా తమ లుక్స్‌పై శ్రద్ధ వహించడం మంచి పరిణామంగా చెప్పవచ్చు. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం (International Mens Day 2025) సందర్భంగా బ్యూటీ విషయంలో పురుషుల్లో వచ్చిన మార్పులు ఏంటో చూసేద్దాం.
మగవారికి కూడా ప్లాస్టిక్ సర్జరీలు..?
మహిళలే తమ శారీరక రూపాన్ని సర్జరీలతో మార్చుకుంటున్నారు అంటే పొరపాటే. ఆ ఖాతాలో ఇప్పుడు పురుషులు కూడా చేరుతున్నారు. తమ శారీరక రూపాన్ని సరిదిద్దడానికి ఎన్నో క్లినిక్స్, ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. అలాంటి విధానాలను ఎంచుకోవడానికి మగవారు వెనుకాడటం లేదు. ఇండియాలో ఎక్కువమంది శారీరక మార్పుల కోసం చేయించుకుంటున్న సర్జరీలు ఏంటో చూసేద్దాం.
- గైనెకోమాస్టియా సర్జరీ (పురుషుల్లో ఛాతీ తగ్గింపు): ఛాతీలో అధిక కొవ్వు లేదా గ్రంథి కణజాలం వల్ల కొందరు మగవారు బిగుతైన టీ-షర్టులు వేసుకోలేరు. అలాగే వారికి అసౌకర్యంగా అనిపించినప్పుడు.. చాలామంది సర్జరీలను ఆశ్రయిస్తున్నారు.
- రినోప్లాస్టీ, ముఖ ఆకృతి: ముక్కును కరెక్ట్ చేసుకోవడం, జా లైన్ షార్ప్ చేయించుకోవడం వంటివి కూడా పురుషులు ఎంచుకుంటున్నారట. అయితే ప్రతిదీ సహజంగా కనిపించేలా చూసుకుంటున్నారు.
- శరీర ఆకృతి, లిపోసక్షన్: మొండి కొవ్వు అనేది ఆహారం, వ్యాయామానికి పెద్దగా స్పందించవు. దానివల్ల బరువు ఎక్కువగా కనిపిస్తారు. ఇది మగవారిలో ప్రధాన సమస్యగా మారినప్పుడు.. కొవ్వు తగ్గించుకోవడం కోసం లిపోసక్షన్ ఆశ్రయిస్తున్నారు.
- నాన్-సర్జికల్ ట్రీట్మెంట్స్ : డౌన్‌టైమ్ అవసరం లేని చికిత్సల పట్ల కూడా ఆసక్తి పెరుగుతోంది. స్కిన్ హెల్త్ కోసం ఇంజెక్షన్లు, స్కిన్ టోన్ మెరుగు చేసుకోవడం కోసం లేజర్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటున్నారు.
సోషల్ మీడియా యుగంలో ఎక్కువమంది స్క్రీన్‌పై కనిపించడం, వెబ్కాల్లో మీటింగ్స్‌కి అటెండ్ అవ్వడం వల్ల స్క్రీన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల జుట్టు, రంగు, రూపు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. లేదంటే బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతున్నారు. హెయిర్ విషయంలో కూడా లేజర్ ట్రీట్మెంట్స్ లేదా.. హెయిర్ గ్రోత్‌ని పెంచే ఆయిల్స్, సీరమ్స్ వాడేందుకు కూడా మగవారు వెనకబడట్లేదు. అందుకే ఇప్పుడు పురుషుల్లో సెల్ఫ్ కేర్ అనేది గ్రూమింగ్‌ని దాటి చాలా దూరం వెళ్లిందని చెప్పవచ్చు.
కేవలం ట్రీట్మెంట్స్ ద్వారానే కాదు.. జిమ్‌కి వెళ్లేవారి సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతుంది. డైట్ విషయంలో కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతూ తమ లుక్స్‌ని ప్రజెంటబుల్గా మారుస్తున్నారు. ఫోటోల్లో కనిపించడానికి ఇంట్రోవర్ట్స్ అంటూ సిగ్గుపడేవారు కూడా ఇప్పుడు స్క్రీన్‌పై కనిపించి మాట్లాడుతున్నారు. ఇన్సెక్యూరిటీలను దూరం చేసుకుని.. తమని తాము అధిగమిస్తున్నారు.






















