By: ABP Desam | Updated at : 29 Dec 2021 07:19 PM (IST)
Image Credit: Twitter
వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్ర గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన ఏదైనా ట్వీట్ చేశారంటే.. క్షణాల్లో వైరల్ కావల్సిందే. సమయస్ఫూర్తిలోనే కాదు.. సేవల్లో ఆయన ఎప్పుడూ ముందే ఉంటారు. ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే.. ఆయనకు తోచిన సాయం చేస్తారు. అందుకే.. చాలామంది నెటిజనులకు ఆనంద్ మహీంద్ర అంటే ఇష్టం. ఆయన ట్వీట్లంటే మహా ఇష్టం. ఇటీవల ఆనంద్ మహీంద్ర చేసిన మరో ట్వీట్ కూడా నెటిజనులకు బాగా నచ్చేసింది. అంతేకాదు.. ఆయన మానవత్వానికి అంతా సలాం చేస్తున్నారు. ఇంతకీ ఏమైందంటే..
ఢిల్లీలో కాళ్లు-చేతుల్లేని ఓ వ్యక్తి త్రివీలర్ నడుపుతున్న వీడియోను ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. కాళ్లు, చేతులు లేకపోయినా.. అతడు ఆ వాహనాన్ని ఎంతో సులభంగా నడపడం చూసి నెటిజనులు ఆశ్చర్యపోయారు. ‘‘నాకు భార్య, ఇద్దరు పిల్లలు, తండ్రి ఉన్నారు. వారి బాగోగులు చూడాలంటే నేను సంపాదించాలి’’ అని ఆ వీడియోలో ఉన్నర వ్యక్తి చెప్పాడు. సుమారు ఐదేళ్ల నుంచి ఈ వాహనాన్ని నడుపుతున్నానని ఆ వ్యక్తి పేర్కొన్నాడు.
ఈ వీడియో చూసి చలించిన మహీంద్ర.. ‘‘నా టైమ్‌లైన్‌లో ఈ వీడియో కనిపించింది. ఈ వీడియో ఇప్పటిదో, ఎక్కడిదో కూడా నాకు తెలీదు. కానీ, ఈ వీడియోలో ఉన్న వ్యక్తి వైకల్యంతో బాధపడుతున్నా.. అతడి ఆత్మస్థైర్యం చూసి చాలా గొప్పగా అనిపించింది. మెయిల్ డెలివరీలో అతడిని బిజినెస్ అసోసియేట్‌గా నియమించడం సాధ్యమేనా?’’ అంటూ ఆయన తన లాజిస్టిక్స్ కంపెనీ మేనిజంగ్ డైరెక్టర్, సీఈవో రామ్ ప్రవీణ్ స్వామినాథన్‌ను అడిగారు. దీనికి ఆయన సమాధానమిస్తూ.. ‘‘తప్పకుండా ఆనంద్.. వీలైనంత త్వరగా అతడి ఆచూకీ తెలుసుకుంటాం’’ అని తెలిపారు. అతడికి ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధమైన ఆనంద్ మహీంద్రాను నెటిజనులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సార్.. థాంక్యూ.. అంటూ ఆ వ్యక్తి తరఫును కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
Received this on my timeline today. Don’t know how old it is or where it’s from, but I’m awestruck by this gentleman who’s not just faced his disabilities but is GRATEFUL for what he has. Ram, can @Mahindralog_MLL make him a Business Associate for last mile delivery? pic.twitter.com/w3d63wEtvk
— anand mahindra (@anandmahindra) December 27, 2021
Also Read: వామ్మో.. కొప్పులో పాము, ఆమె జడను చూసి జడుసుకున్న జనం, వీడియో వైరల్
Also Read: ఇలా హగ్ చేసుకుంటే.. శృంగారానికి ‘సై’ అన్నట్లే.. ఒక్కో కౌగిలింతకు ఒక్కో అర్థం!
Also Read: ఓనరమ్మతో భర్త సయ్యాట.. డోర్ బెల్ కెమేరాకు చిక్కిన శ్రీవారి లీలలు! (వీడియో)
Also Read: బాయ్‌ఫ్రెండ్ ముద్దు పెట్టలేదని పోలీసులకు కాల్ చేసిన ప్రియురాలు, చివరికి..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Diabetes: అధ్యయనంలో షాకింగ్ రిజల్ట్, టైప్ 2 డయాబెటిస్ ఉంటే మెదడు త్వరగా ముసలిదైపోతుంది
Jail Sentece To Sheep: గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష, ఎందుకో తెలిస్తే షాకవుతారు!
Dhaniya Powder: ఈ ధనియాల పొడిని అన్నంతో, ఇడ్లీతో తినొచ్చు, ఎలా చేయాలో తెలుసా?
Brain Foods: పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే బ్రెయిన్ ఫుడ్స్ ఇవన్నీ, రోజుకొకటైనా తప్పకుండా తినిపించాల్సిందే
Sleeping Pills: స్లీపింగ్ పిల్స్ అధికంగా వాడుతున్నారా? వాటి వల్ల కలిగే నష్టాలు ఇవే
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం
Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Horoscope Today 26th May 2022: ఈ రాశివారి బలహీనతను ఉపయోగించుకుని కొందరు ఎదుగుతారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
LSG vs RCB, Eliminator Highlights: LSGని ఎలిమినేట్ చేసిన RCB - రాహుల్ సేనను ముంచిన క్యాచ్‌డ్రాప్‌లు!