Pain Killers : పెయిన్ కిల్లర్స్ 2 ఏళ్లు వాడితే కిడ్నీలు ఫెయిల్.. ఆవేదనతో వీడియో చేసిన బాధితుడు, పూర్తి వివరాలివే
Painkiller Side Efects :పెయిన్ కిల్లర్స్ ఎక్కువ కాలం వాడొద్దని వైద్యులు సూచిస్తూ ఉంటారు. కానీ వారి మాట వినకుండా ఎక్కువ రోజులు వినియోగిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఈ వ్యక్తిని చూస్తే తెలుస్తుంది.

Kidney Damage from Painkillers : భరించలేని నొప్పి, ఇతర కారణాలతో వైద్యులు పేషెంట్లకు పెయిన్ కిల్లర్స్ సజెస్ట్ చేస్తారు. ఏ వైద్యుడైనా వీటిని సూచించేప్పుడు ఎక్కువరోజులు వాటిని కంటిన్యూ చేయవద్దనే సూచిస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏమి సైడ్ ఎఫెక్ట్స్ లేవని 2 సంవత్సరాలు పెయిన్ కిల్లర్స్ ఉపయోగించాడు. ఇప్పుడతని పరిస్థితి ఏంటి? అసలు పెయిన్ కిల్లర్స్ ఎక్కువకాలం వాడితే ఏమవుతుంది వంటి విషయాలు చూసేద్దాం.
ఇన్‌స్టాలో రెట్రోట్రావెల్స్1811 (retrotravels1811) అనే పేరుతో ఓ వ్యక్తి రీల్స్ చేస్తున్నాడు. దానిలో భాగంగా రీసెంట్గా ఓ వీడియో పోస్ట్ చేశాడు. దానిలో వైద్యుల అనుమతి లేకుండా పెయిన్ కిల్లర్స్ ఉపయోగించినట్లు తెలిపాడు. ఆ తర్వాత పరిస్థితి దారుణంగా మారిందని తెలిపాడు. అసలు ఏమి జరిగిందో తెలుసుకుందాం.
ఏమైందంటే..
షేక్ మోహిద్ అనే వ్యక్తికి రెండేళ్ల క్రితం చేతి వేళ్లు నొప్పి వచ్చాయట. ఆ సమయంలో ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు వెళ్లాడు. డాక్టర్ కొన్ని పెయిన్ కిల్లర్స్ రాసి ఇచ్చి కేవలం మూడు రోజులు మాత్రమే వినియోగించమని చెప్పాడని కూడా బాధితుడు తెలిపాడు. అవి బాగా పని చేశాయి కూడా. నొప్పి సులభంగా తగ్గడంతో వాటిని బాధితుడు కంటిన్యూ చేశాడు. అలా రెండు సంవత్సరాలు ఆ పెయిన్ కిల్లర్స్ వేసుకున్నాడు.
రిజల్ట్ ఇదే..
చేతుల్లో నొప్పి అయితే తగ్గింది కానీ.. ఎక్కువకాలం పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల అతని రెండు కిడ్నీలు పూర్తిగా పనిచేయడం ఆగిపోయాయి. కిడ్నీల పరిమాణం కూడా చాలా తగ్గిపోయిందని వైద్యులు చెప్పినట్లు తెలిపాడు. కళ్లల్లో వాపులు, ముఖంలో వాపులు వంటి లక్షణాలు కనిపించడంతో అతను డాక్టర్ దగ్గరకు వెళ్లగా ఈ విషయం బయట పడిందని తెలిపాడు. ఇప్పుడు జీవితాంతం డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు వీడియోలో తెలిపాడు. తాను చేసిన తప్పు ఇంకెవరూ చేయకూడదని ఈ విషయాన్ని తెలిపాడు బాధితుడు.
View this post on Instagram
ఈ బాధితుడే కాదు చాలామంది కొన్ని పెయిన్ కిల్లర్స్‌ని బఠాణీలు మాదిరి వేసేసుకుంటారు. ఎంత వైద్యులు సూచించినా వాటిని ఎక్కువ మోతాదులో తీసుకుని.. మళ్లీ డాక్టర్ దగ్గరికి వెళ్లనవసరం లేదనుకుని వేసేసుకుంటారు. ఈ పెయిన్ కిల్లర్స్ మంచి ఫలితాలే ఇచ్చినా.. లాంగ్ రన్లో ఇలాంటి దీర్ఘకాలిక, ప్రాణాంతక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
పెయిన్‌కిల్లర్స్ రోజూ వాడితే..
పెయిన్ కిల్లర్స్ రెగ్యులర్‌గా వాడితే కిడ్నీలకు రక్త ప్రసరణ తగ్గుతుంది. కిడ్నీ ఫెయిల్యూర్ అవుతాయి. డీహైడ్రేషన్, కిడ్నీ సమస్యలు బాగా ఎక్కువ అవుతాయి. క్రానిక్ కిడ్నీ డీసిజ్ రావొచ్చు. డయాలసిస్ సమస్యలు రెట్టింపు అవుతాయి. ఇన్ఫ్లమేషన్ పెరగడంతో పాటు ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వైద్యుల సూచనలు లేకుండా అస్సలు పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. అలాగే వాటిని ఉపయోగిస్తే ఎక్కువ నీటిని శరీరానికి అందించాలి. ఇప్పటికే కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. వృద్ధులు, బీపీ ఎక్కువగా ఉండేవారు, మధుమేహం, డీహైడ్రేషన్‌తో ఇబ్బంది పడేవారు కూడా పెయిన్ కిల్లర్స్‌కి దూరంగా ఉండాలి.





















