వీడియో: యముడు లీవ్‌లో ఉంటే ఇంతే.. జెట్ స్పీడ్‌తో బస్సు మీదకు దూసుకొచ్చాడు, కానీ..
రోడ్డు మీద ఇడియెట్స్ కొదవ ఉండదు. అతివేగంతో ప్రాణాలు తీసేవారు కొందరైతే.. ప్రాణాలు తీసుకొనేవారు మరికొందరు ఉంటారు. మరి, ఇతడు ఏ కోవకు చెందుతాడు?
మితిమీరిన వేగం.. ఎప్పటికీ ప్రమాదకరమే. క్షణం ఆలస్యమైనా పర్వాలేదు. ఆ సమయాన్ని ఎలాగోలా భర్తి చేసుకోవచ్చు. కానీ, ఆ వేగం వల్ల ప్రాణాలు పోతే.. మళ్లీ తీసుకురాలేం. రోడ్డు మీద నిత్యం జరిగే ప్రమాదాలన్నీ నిర్లక్ష్యం, అతి వేగం, ఏమర్పాటు వల్లే జరుగుతాయి. తాజాగా కర్ణాటకలో ఓ ద్విచక్ర వాహనదారుడు యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్న విధానం చూస్తే.. తప్పకుండా మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అది చూసిన తర్వాత అతడికి భూమి మీద ఇంకా నూకలు ఉన్నాయనిపిస్తుంది.
మంగళూరులో ఓ బస్సు రోడ్డు మీద యూ టర్న్ తీసుకుంటోంది. అదే సమయంలో ఓ యువకుడు స్కూటీపై వేగంగా దూసుకొచ్చాడు. బస్సు సరిగ్గా రోడ్డు మొత్తాన్ని బ్లాక్ చేస్తున్న సమయానికి చిన్న సందులో నుంచి అతడు స్కూటీని వేగంగా తీసుకెళ్లాడు. బస్సు డ్రైవర్ స్కూటీని గుర్తించాడు కాబట్టి సరిపోయింది. వెంటనే బ్రేక్ వేయడం వల్ల అతడు బస్సును ఢీకొట్టకుండా తప్పించుకున్నాడు. అయితే, అప్పటికీ అతడు వేగాన్ని తగ్గించలేదు. రోడ్డు పక్కన ఉన్న ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్ గేట్‌ను గుద్దుకుంటూ.. మరింత వేగంగా దూసుకెళ్లాడు. ఆ తర్వాత ఓ షాపు, చెట్టుకు మధ్య ఉన్న చిన్న గ్యాప్ నుంచి స్కూటీని పోనిచ్చాడు. వెనక్కి తిరిగి చూడకుండా.. అదే వేగంతో వెళ్లిపోయాడు. బహుశా.. యముడు సెలవులో ఉంటే ఇలాగే జరుగుతుంది కాబోలు.
ఈ ఘటన సీసీటీవీ కెమేరాలో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లుకొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజనులు.. ‘‘అతడు చాలా లక్కీ.. కొద్దిలో తప్పించుకున్నాడు’’ అని అంటున్నారు. ‘‘అంత ప్రమాదం తప్పినా.. ఏమీ జరగనట్లు అలా వెళ్లిపోయాడేంటీ’’ అని మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌దే తప్పని కూడా కొందరు అంటున్నారు. మలుపు రోడ్డుపై ఎలా యూటర్న్ తీసుకుందామని బస్సును అడ్డంగా తిప్పాడని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇద్దరిదీ తప్పేనని అంటున్నారు. ఈ వీడియో చూసి.. ఎవరిది తప్పో మీరే చెప్పండి.
Also Read: ఓర్నీ.. చేప వీర్యంతో స్పెషల్ కర్రీ.. అంత కరువేంది బ్రో!
Viral video of a young man who was speeding on a scooter and miraculously avoided colliding with a bus that was taking a U-turn near Elyarpadavu, Mangalore. 🚌💨🛵
— Mangalore City (@MangaloreCity) January 11, 2022
The scooter then hits the door of the fish processing unit and passed in between a shop and a tree. 😱 pic.twitter.com/c4vAvbbikj
Also Read: ఈ చేప భలే డ్రైవింగ్ చేస్తోంది.. ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ కేసు పెట్టరు కదా?
Also Read: తత్కాల్‌లో రైల్వే టికెట్స్ వేగంగా బుక్ చేయాలా? ఇదిగో ఇలా చేయండి
Also Read: నరక ద్వారం.. 50 ఏళ్లుగా ఇక్కడి భూమి మండుతూనే ఉంది.. చిన్న తప్పు ఎంత పనిచేసింది!
Also Read: షాకింగ్ వీడియో: విహారంలో విషాదం.. పర్వతం విరిగి బోటుపై పడింది
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి