అన్వేషించండి

Male vs Female Condoms : కండోమ్స్ మగవారి వాడితే మంచిదా? ఆడవాళ్లు ఉపయోగించాలా? ఏది ఎక్కువ సురక్షితం?

Men or Women Use Condoms : లైంగిక సమస్యలు రాకుండా, అవాంఛిత గర్భధారణను నివారించేందుకు కండోమ్స్ ఉపయోగిస్తారు. అయితే వీటిని మగవాళ్లు వాడితే మంచిదా? ఆడవారు ఉపయోగించాలా?

Male Condom vs Female Condom : లైంగిక జీవితం సురక్షితంగా లేకుంటే.. STI, HIV, STD వంటి రోగాలు వ్యాపిస్తాయి. అందుకే ప్రభుత్వం కూడా కండోమ్స్ ఉపయోగించాలనే ప్రకటనలు చేస్తుంది. అలాగే ప్రెగ్నెన్సీ వద్దు అనుకునేవారు కూడా వీటిని ఉపయోగిస్తారు. అయితే కండోమ్స్ రెండు రకాలు ఉంటాయి. ఒకటి మగవారు ఉపయోగించేందుకు.. రెండు ఆడవారికి. అయితే ఈ రెండిటిలో ఏవి ప్రభావవంతంగా ఉంటాయి. నిపుణులు ఏమంటున్నారో చూసేద్దాం. 

మేల్ కండోమ్.. ఫీమేల్ కండోమ్

కండోమ్ మగవారు ఉపయోగిస్తే ప్రభావంతంగా ఉంటుందా? ఆడవారు ఉయోగిస్తే ఎక్కువ ఎఫెక్టివ్​గా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. మగవారు ఉపయోగించే నిరోధ్​లు లాటెక్స్ లేదా పాలియురేతేన్​తో తయారు చేస్తారు. ఇది లైంగిక సమయంలో పురుషాంగంపై ధరిస్తారు. అలాగే ఫీమేల్ కండోమ్ యోనిలో ముందుగానే ఉంచుతారు. దీనిని పాలియురేతేన్ లేదా నైట్రైల్​తో తయారు చేస్తారు. 

కండోమ్ మగవారు ధరిస్తే సేఫా? ఆడవారు వేసుకుంటే మంచిదా?

మగవారు కండోమ్ సరైన పద్ధతిలో ఉపయోగిస్తే గర్భధారణను 98 శాతం నివారించవచ్చని శాస్త్రీయంగా చెప్తున్నారు. కాస్త తప్పుగా అటు, ఇటుగా వేసుకుంటే 85 శాతం వరకు ప్రెగ్నెన్సీ నివారించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. పైగా ఇవి సులభంగా అందుబాటులో ఉంటాయి. తక్కువ ఖర్చు. లైంగిక వ్యాధులు సంక్రమించకుండా మంచి రక్షణ ఇస్తాయి. 

ఫిమేల్ కండోమస్ 95 శాతం వరకు ప్రభావవంతంగా ఉంటాయి. సాధారణ వినియోగంలో 79-82 శాతం ఎఫెక్టివ్​గా ఉంటాయని పరిశోధనలు చెప్తున్నాయి. అయితే లైంగిక చర్యకు ముందే వీటిని పెట్టుకోవచ్చు. దీనిపై మహిళకు పూర్తి నియంత్రణ ఉంటుంది. లాటెక్స్ అలెర్జీ ఉండేవారికి మంచి ఆప్షన్​గా చెప్తున్నారు. 

వీటిలో ఏది మంచిది?

గైనకాలజిస్ట్ డాక్టర్ అనితా శర్మ ప్రకారం.. మగవారు కండోమ్ సరిగ్గా వాడితే అది గోల్డ్ స్టాండర్డ్ అని.. ఆడవారికి కంట్రోల్ అవసరమైతే ఫీమేల్ కండోమ్ మంచిదని చెప్తున్నారు. అయితే రెండింటిలో ఏది మంచిది అనే దానికన్నా.. ఏది సరిగ్గా వాడాలో తెలుసుకోవాలంటున్నారు. సరైన విధంగా వాడితే రెండూ మంచివేనని చెప్తున్నారు. 

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Telugu Movies OTT : ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
Brezza vs Venue EMI Comparison: Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Embed widget