By: ABP Desam | Updated at : 05 Feb 2022 03:42 PM (IST)
Edited By: harithac
(Image credit: Pexels)
ప్రతి ఇంట్లో అన్నం మిగిలిపోవడం సర్వసాధారణం. అన్నం మిగిలిపోతే మరుసటి చద్దన్నంలా తినడమో లేక పడేయడమో చేస్తుంటారు చాలా మంది. లేదా అన్నం పోపు పెట్టుకుని తింటారు. మిగిలిపోయిన అన్నంతో కేవలం ఇంతే చేయగలమా? కాదు, ఎన్నో వంటకాలు చేయచ్చు.
అన్నం ఇడ్లీ
ఇడ్లీని మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. ఇడ్లీ రవ్వను ముందుగానే నానబెట్టుకోవాలి. తరువాత మిగిలిపోయిన అన్నా్ని మిక్సీలో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. అందులో నానబెట్టుకున్న రవ్వ, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇడ్లీ ప్లేట్లకు నూనె రాసి రుబ్బు వేసుకోవాలి. పావుగంట తరువాత వేడి వేడి ఇడ్లీలు రెడీ అయిపోతాయి.
దోశెలు
మిగిలిపోయిన అన్నంతో క్రిస్పీ దోశెలను వేసుకోవచ్చు.
కావాల్సిన పదార్థాలు
అన్నం - ఒక కప్పు
పెరుగు - ఒక కప్పు
వరిపిండి - అరకప్పు
గోధుమపిండి - పావుకప్పు
ఉప్పు - రుచికి సరిపడినంత
తయారీ: అన్నం, పెరుగు కలిపి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. అందులో వరిపిండి, గోధుమపిండి పావుకప్పు, ఉప్పు వేసి బాగా కలపాలి. మరీ మందంగా కాకుండా పలుచగా కలుపుకోవాలి. స్టవ్ పై పెనం పెట్టి పలుచగా దోశెల్లా వేసుకోవాలి.
Also Read: ఇతడో మంచి దొంగ, ఏమీ ఎత్తుకుపోలేదు సరికదా తిరిగి ఇచ్చి వెళ్లాడు
.........................
పునుగులు
అన్నంతో వేసే పునుగులు చాలా టేస్టీ ఉంటాయి.
కావాల్సిన పదార్థాలు
అన్నం - రెండు కప్పులు
శెనగ పిండి - ఒక కప్కపు
అల్లం పేస్టు - ఒక స్పూను
పచ్చిమిర్చి - రెండు
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
జీలకర్ర - ఒక స్పూను
కారం - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - డీప్ ఫ్రైకు సరిపడా
నీళ్లు -తగినన్ని
తయారీ
మిక్సీలో మిగిలిపోయిన అన్నాన్ని మెత్తగా రుబ్బుకోవాలి. అందులో శెనగపిండి, జీలకర్ర, కారం, ఉప్పు, అల్లం పేస్టు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి బాగా కలపాలి. స్టవ్ పై పాన్ పెట్టి ఆయిల్ వేయాలి. నూనె బాగా వేడెక్కాక రుబ్బుని పునుగుల్లా వేసుకోవాలి. టొమాటో చట్నీతో తింటే మంచి రుచిగా ఉంటాయి.
................................
వడియాలు
కావాల్సిన పదార్థాలు
అన్నం - ఒక కప్పు
జీలకర్ర - ఒక స్పూను
ఎండు మిర్చి - రెండు
ఉప్పు - సరిపడినంత
తయారీ విధానం
అన్నాన్ని నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. జీలకర్ర, ఎండు మిర్చి, ఉప్పు వేసి బాగా దంచుకోవాలి. ఆ పొడిని అన్నం రుబ్బులో కలపాలి. పల్చని కవర్ మీద వడియాల్లా పెట్టుకోవాలి. ఇవి చాలా రోజులు నిల్వ ఉంటాయి. నూనెలో వేయించుకుని తింటే బావుంటాయి.
Also Read: మధుమేహం ఉన్నా అరటి పండు తినొచ్చు, కానీ ఈ జాగ్రత్తలతో..
Healthy Fats: హెల్తీగా ఉండాలంటే ఈ మూడు కొవ్వులున్న ఆహారాలు తీసుకోవాల్సిందే
Egg Freezing: తల్లి కావడానికి ప్రియాంక చోప్రా పాటించిన ‘ఎగ్ ఫ్రీజింగ్’ పద్ధతి గురించి మీకు తెలుసా?
ఏడాదిలో 8428 ప్లేట్ల ఆర్డర్- ఆశ్చర్యపరుస్తున్న హైదరాబాదీ ఇడ్లీ ప్రేమ
Heart Health: మీ గుండెని కాపాడుకోవాలంటే వీటిని దూరం పెట్టాల్సిందే
Summer Drinks: వేసవి తాపాన్ని తగ్గించి మిమ్మల్ని చల్లగా ఉంచే సూపర్ ఫుడ్స్ ఇవే
Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ
AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!
IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!
Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి