News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Sleep Depravation: బీకేర్ ఫుల్, నిద్రలేమి వల్ల మీ మెదడు ప్రతికూల ప్రభావం

నిద్రలేమి దీర్ఘకాలిక ఎన్నో వ్యాధులని తీసుకొస్తుంది. మెదడుకి హాని చేస్తుంది.

FOLLOW US: 
Share:

నిద్రలేమి ఇప్పుడు ఒక సాధారణ సమస్యగా మారింది. పని ఒత్తిడిలో పని నిద్రకు తక్కువ టైమ్ కేటాయిస్తున్నారు. సుదీర్ఘ నిద్రలేమి శారీరకంగా, మానసికంగా మనిషిని కుంగదీస్తుంది. అంతే కాదు కొన్ని నాది సంబంధిత రుగ్మతలు కూడా వచ్చేలా చేస్తుంది. నిద్రపోతున్నప్పుడు మెదడు ముఖ్యమైన కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటుంది. నిద్ర ప్రధాన వీధుల్లో ఒకటి మెమరీ కన్సాలీడేషన్. గాఢ నిద్ర దశలలో మెదడు రోజంతా సేకరించిన సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుంది. కొత్త జ్ఞానాన్ని నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. సరైన నిద్ర మంచి నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. సమస్యలు పరిష్కరించడంలో తెలివిగా వ్యవహరించేలా చేస్తుంది.

తగినంత నిద్రలేకపోవడం లేదా అధిక నిద్ర అభిజ్ఞా సామర్థ్యాలకి హాని చేస్తుంది. స్థిరంగా ఒక వ్యక్తి ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోయినప్పుడు దృష్టి, ఏకాగ్రత సామర్థ్యం తగ్గిపోతుంది. నిద్ర లేకపోవడం మానసిక స్థితి, భావోద్వేగ నియంత్రణను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అభిజ్ఞా పనితీరుని అడ్డుకుంటుంది.

నిద్రలేమి వల్ల నాడీ సంబంధిత సమస్యలు

అల్జీమర్స్: నిద్రలేమి వల్ల ఎక్కువగా వచ్చే న్యూరోడెజెనరేటివ్ పరిస్థితి ఇది. మెదడు నుంచి బీటా అమిలాయిడ్ వంటి హానికరమైన వ్యర్థ పదార్థాలని తొలగించడంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. నిద్ర సరిపోనప్పుడు లేదా అంతరాయం కలిగినప్పుడు ఈ టాక్సిన్స్ పేరుకుపోతాయి. ఇది అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. ఏకాగ్రత సన్నగిల్లుతుంది. ఏ విషయం కూడా ఎక్కువ సేపు గుర్తుకు ఉండదు.

నిద్రలేమి: దీర్ఘకాలిక నిద్రలేమి గ్లింఫాటిక్ వ్యవస్థ వ్యర్థాల తొలగింపుకు అంతరాయం కలిగిస్తుంది. బీటా అమిలాయిడ్ వంటి హానికరమైన ప్రోటీన్ నిర్మాణానికి దారి తీస్తుంది. అల్జీమర్స్ వ్యాధి, మానసిక రుగ్మతలు, శ్రద్ద తగ్గడానికి కారణమవుతుంది.

స్లీప్ అప్నియా:  స్లీప్ అప్నియా వల్ల నిద్రలో శ్వాస తీసుకోవడంలో తరచుగా అంతరాయం ఏర్పడుతుంది. మెదడుకి ఆక్సిజన్ సరఫరా జరగదు. దీని వల్ల అభిజ్ఞా లోపాలు, జ్ఞాపకశక్తి సమస్యలు, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

నార్కోలెప్సీ: నార్కోలెప్సీ నిద్ర- మేల్కొనే చక్రాలని నియంత్రించే మెదడు సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. పగటి నిద్రకు ఎక్కువగా దారి తీస్తుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రతని దెబ్బతీస్తుంది.

రాత్రి నిద్ర ఎంత ముఖ్యమంటే?

మెదడు పనితీరుకి రాత్రి నిద్ర చాలా ముఖ్యం. గ్లింఫాటిక్ వ్యవస్థ మెదడులో పేరుకుపోయే హానికరమైన టాక్సిన్స్, వ్యర్థ పదార్థాలని సమర్థవంతంగా తొలగిస్తుంది. మెదడు ఆరోగ్యం, ఆలోచన పనితీరుకి ఈ వ్యర్థాల తొలగింపు ప్రక్రియ చాలా అవసరం. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. స్లీప్ హార్మోన్ మెలటోనిన్ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తుంది. మెలటోనిన్ మెదడులోని పీనియల్ గ్రంథి ద్వారా చీకటికి ప్రతి స్పందనగా ఉత్పత్తి అవుతుంది.

మెలటోనిన్ స్థాయిలని పెంచడానికి కొన్ని అలవాట్లు చేసుకోవడం మంచిది. ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వచ్చే బ్లూ లైట్ కి వీలైనంత దూరంగా ఉండాలి. నిద్రవేళకి ముందు ఇది మెలటోనిన్ ఉత్పత్తిని అణచివేస్తుంది. పగటి పూజ సహజమైన సూర్యరశ్మి శరీరానికి తగలడం వల్ల మెలటోనిన్ స్రావాన్ని నియంత్రించడంలో, నిద్ర నాణ్యత మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మంచి నిద్రకి పుస్తకం చదవడం, ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also Read: విద్యార్థులు MIND డైట్ ఫాలో అయితే మతిమరుపు సమస్యే రాదు

Published at : 30 Jul 2023 07:26 AM (IST) Tags: Sleep Sleeping Sleep Apnea Alzimers Sleep Depravation Sleep Depravation Side Effects

ఇవి కూడా చూడండి

Paschima Namaskarasana: పశ్చిమ నమస్కార ఆసనం అంటే ఏంటి? ఎలా వేయాలి? ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

Paschima Namaskarasana: పశ్చిమ నమస్కార ఆసనం అంటే ఏంటి? ఎలా వేయాలి? ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

Late Night: లేట్ నైట్ నిద్రపోతున్నారా? అది ఎంత ప్రమాదమో తెలుసా

Late Night: లేట్ నైట్ నిద్రపోతున్నారా? అది ఎంత ప్రమాదమో తెలుసా

Curry leaves: కరివేపాకే కదా అని తీసిపారేయకండి, బరువుని ఇట్టే తగ్గించేస్తుంది

Curry leaves: కరివేపాకే కదా అని తీసిపారేయకండి, బరువుని ఇట్టే తగ్గించేస్తుంది

Silent Walking: వాకింగ్ చేస్తున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండడం ఎంత ముఖ్యమో తెలుసా

Silent Walking: వాకింగ్ చేస్తున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండడం ఎంత ముఖ్యమో తెలుసా

Children Memory Booster: మీ పిల్లలకి జ్ఞాపకశక్తి పెరగాలంటే ఈ పండ్లు తినిపించండి

Children Memory Booster: మీ పిల్లలకి జ్ఞాపకశక్తి పెరగాలంటే ఈ పండ్లు తినిపించండి

టాప్ స్టోరీస్

Nara Brahmani: హోటల్ రూంకు తాళం- వాట్సాప్ చాటింగ్ సైతం చెకింగ్ - పోలీసుల చర్యతో బ్రాహ్మణి షాక్

Nara Brahmani: హోటల్ రూంకు తాళం- వాట్సాప్ చాటింగ్ సైతం చెకింగ్ - పోలీసుల చర్యతో బ్రాహ్మణి షాక్

Nagababu: టీడీపీ, జనసేన ఆశయాలు ఒక్కటే, ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతాం - నాగబాబు వార్నింగ్

Nagababu: టీడీపీ, జనసేన ఆశయాలు ఒక్కటే, ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతాం - నాగబాబు వార్నింగ్

వద్దంటే పెళ్లి, ఏంది భాయ్ ఈ లొల్లి - సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతోన్న పులిహోర కథలు!

వద్దంటే పెళ్లి, ఏంది భాయ్ ఈ లొల్లి - సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతోన్న పులిహోర కథలు!

Chittoor Inter Student Death: బావిలో శవమై తేలిన ఇంటర్‌ విద్యార్థిని- అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపణలు

Chittoor Inter Student Death: బావిలో శవమై తేలిన ఇంటర్‌ విద్యార్థిని- అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపణలు