ఇది తాగితే డయాబెటిస్ సమస్యే ఉండదట, గ్లూకోజ్‌ను అదుపులో ఉంచే బెస్ట్ డ్రింక్ ఇదేనట!
కొన్ని ట్రెండీ డ్రింక్స్ తో రక్తంలో గ్లూకోజ్ ను నియంత్రించడంలో సమర్థవంతంగా ఉన్నట్టు ఫెర్మెంట్ చేసిన టీలో ఆరోగ్యవంతమైన బ్యాక్టీరియా అభివృద్ధి చెందినట్టు దీన్ని డయాబెటిస్ అదుపు కోసం సూచిస్తున్నారు.
శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు గణనీయంగా పడిపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు చాలా పెరిగిపోతాయి. ఇలా శరీరంలో గ్లూకోజ్ నిల్వలు పెరిపోవడం పాదాల్లో నాడులు దెబ్బతినేందుకు, రక్తనాళాలల్లో సమస్యలకు, కళ్లు, గుండె, కిడ్నీ వంటి ముఖ్యమైన అన్నిఅవయవాల మీద చెడు ప్రభావం పడుతుంది. అందుకే డయాబెటిస్ తో బాధపడే వారు తప్పనిసరిగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిని అదుపులో పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరిని ఆలోచింపజేస్తున్న అతి పెద్ద హెల్త్ బర్డెన్ డయాబెటిస్. దీని గురించి రకరకాల పరిశోధనలు ప్రపంచం నలుమూలలా జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల జరిపిన అధ్యయనంలో రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే పానియం గురించి ఆసక్తికర విషయాలు తెలిశాయి.
కొంబుచా అనే పానీయం తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించుకోవచ్చని కొత్త అధ్యయానాన్ని ఈ విషయాన్ని ధృవీకరిస్తుంది. ఈట్రెండీ డ్రింక్ తాగిన టైప్-2 డయాబెటిస్ పేషెంట్లలో నాలుగు వారాల్లో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గినట్లు అమెరికాకు చెందిన పరిశోధకులు గుర్తించారు. ఫెర్మెంట్ చేసిన ఈ టీలో అభివృద్ధి చెందే ఆరోగ్యవంతమైన బ్యాక్టీరియా రక్తంలో గ్లూకోజ్ స్థాయిల నియంత్రిస్తుందని గుర్తించారు.
ఫ్రాంటియర్స్ ఇన్ న్యూట్రిషన్‌లో ప్రచురితమైన ఈ తాజా అధ్యయనంలో డయాబెటిస్ రోగులకు ఒక నెల పాటు కొంబుచా పానీయం తీసుకున్న వారిలో రక్తంలో గ్లూకోజ్ తక్కువగా నమోదు కావడాన్ని గమనించారట. కొంబుచా వంటి ట్రెండీ డ్రింక్‌పై జరిపిన మొదటి క్లినికల్ ట్రయల్ ఇదే. ఇది ప్రారంభం మాత్రమే ఇలాంటి పరిశోధనలు ఇంకా జరగాలని జార్జ్ టౌన్ యూనివర్సిటికి చెందిన డాక్టర్ డాన్ మెరెన్ స్టెయిన్ అభిప్రాయపడ్డారు.
కొంబుచా ఇచ్చిన నాలుగు వారాల వ్యవధిలో ఇదే రుచితో ఉండే ప్లెసిబో కూడా ఇచ్చారు. ప్లెసిబో కంటే కొంబుచా డయాబెటీస్ మీద ఎక్కువ ప్రభావాన్ని చూపించడాన్ని పరిశోధకులు గమనించారు. అయితే, దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని పరిశోధకులు తెలుపుతున్నారు.
2000 ఏళ్లనాటి పురాతన పానీయం ఇది
కొంబుచా 2000 సంవత్సరాలు పురాతనమైన పానీయం. ఇందులో కేవలం టీ మాత్రమే ఉంటుందని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే . ఫర్మెంట్ చేసిన కొద్దిగా ఫిజీ గా ఉండే డ్రింక్ ఇది. ఇప్పుడు ఈ డ్రింక్ చాలా ప్రాచూర్యంలో ఉంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఇది దీని వ్యాపారం బిలియన్లకు చేరింది. కీస్తుపూర్వం నుంచి దీని తయారీకి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయి. దీనికి అతి పురాతన పానీయంగా గుర్తింపు కూడా ఉంది. ఇందులో టీ ఉంటుంది. అది బ్లాక్ లేదా గ్రీన్ టీ ఏదైనా కావచ్చు. చక్కెర లేదా టర్బినాడో లేదా తేనె ను స్వీటెనర్ గా వాడుతారు. పులిసేందకు గాను ఈస్ట్ ను కలుపుతారు. పులిసిన ఈ పానీయంలో ప్రొబయోటిక్స్ ఉంటాయి. దీన్ని తయారు చేసిన తర్వాత వారం నుంచి నెల రోజుల వరకు పులియబెడతారు. చివరగా కొద్దిగా కార్బోనెట్ అయిన పానీయం తయారవుతుంది. రుచికి కొద్దిగా వెనిగర్ మాదిరిగా పుల్లగా ఉంటుంది. ఇందులో ఆల్కహాల్ 0.5 శాతం కంటే తక్కువే ఉంటుంది. కొంబుచా ఆల్కహాల్ రహిత పానీయంగానే మార్కెట్లో అమ్ముతారు.
Also read : వర్షాలు పడుతున్నాయ్, మీ కళ్లు జర భద్రం - ఈ జాగ్రత్తలు పాటిస్తే ఇన్ఫెక్షన్స్ దూరం!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial