Types of Kisses : కిస్ డే స్పెషల్, ముద్దులు ఎన్ని రకాలో తెలుసా? ఒక్కో ముద్దుకి ఒక్కో అర్థం
Kiss Day 2025 : ప్రేమను వ్యక్తం చేయడంలో ముద్దు కీలకపాత్ర పోషిస్తుంది. అలాగే అన్ని ముద్దులు రొమాన్స్‌నే కాదు.. ఎఫెక్షన్‌ని కూడా సూచిస్తాయి. ఇంతకీ ముద్దుల్లోని రకాలు, వాటి అర్థాలు ఏంటో తెలుసా?

Most Popular Kisses : వాలెంటైన్స్ డే (Valentines Day 2025) మరికొద్ది రోజుల్లో వస్తుంది. వారం ముందు నుంచే వాలెంటైన్స్ వీక్ (Valentines Week) రూపంలో సందడి మొదలైపోయింది. దానిలో చివరి రోజైన కిస్ డేని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీన జరుపుకుంటారు. దీని తర్వాత వాలెంటైన్స్ డే వస్తుంది. ప్రేమికుల జీవితాల్లో కిస్కి అంతటి ప్రాధన్యం ఇస్తారు. అయితే కిస్ అనేది కేవలం రొమాన్స్‌ని మాత్రమే కాదు.. అభిమానాన్ని కూడా సూచిస్తుంది.
ముద్దు అనేది ఓ ఆర్ట్‌ని చెప్తారు. అలాంటి కిస్లలో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా? రొమాన్స్‌ని రెట్టింపునిచ్చే ముద్దులే కాదు.. అభిమానాన్ని, ప్రేమను వ్యక్తం చేసే ముద్దు కూడా ఉన్నాయి. ఒక్కో రకమైన ఎమోషన్‌కి ఒక్కో విధమైన ముద్దు ఉంది. ప్రతీ ముద్దు ప్రత్యేకమైన అర్థాన్ని వ్యక్తీకరణను కలిగి ఉంటుంది. అలా ప్రజాదరణ పొందిన ముద్దులు ఏంటో? వాటి అర్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రొమాన్స్‌ని తెలిపే ముద్దులివే
ఫ్రెంచ్ కిస్ (French Kiss): రొమాంటిక్ వెర్షన్లో ఫ్రెంచ్ కిస్కి ఉండే క్రేజ్ వేరు. ఈ ముద్దులో రొమాన్స్ ప్రధాన అంశంగా ఉంటుంది. డీప్ రొమాన్స్‌ని సూచిస్తుంది.
లిప్ కిస్ (Lip Kiss) : రొమాంటిక్ కిస్లలో లిప్ కిస్ ఒకటి. ఇది దాదాపు అందరికీ తెలుసు. పెదాలపై మృదువుగా, ప్రేమతో ఇచ్చిన లవ్‌ని ఇది సూచిస్తుంది.
టంగ్ కిస్ (Tongue Kiss) : ఇది ఫ్రెంచ్ కిస్కి చాలా దగ్గరగా ఉంటుంది. కాకుండా దానిలో ఉండేంత ఇన్టెన్సిటీ దీనిలో ఉండదు.
మెడ మీద కిస్ పెట్టుకోవడం కూడా రొమాన్స్‌ని, ఇంటిమేట్ని సూచిస్తుంది.
ఆప్యాయతను తెలిపే ముద్దులివే
బుగ్గపై (Cheek Kiss) : చిన్న పిల్లల నుంచి.. పెద్దలవరకు ఎలాంటి వల్గర్ ఉద్దేశాలు లేకుండా ఇచ్చే ముద్దుల్లో ఇది ఒకటి. బుగ్గపై ఫ్రెండ్స్, ఫ్యామిలీ మధ్య ఈ తరహా ముద్దులు ఉంటాయి.
నుదిటిపై (Forehead Kiss) : ప్రేమను, అభిమానాన్ని వ్యక్తం చేస్తూ.. నీకు నేనున్నాను అనే సపోర్ట్ నుదిటిపై ముద్దు ఇవ్వొచ్చు. ఇది ఎక్కువ సందర్భాల్లో ఓదార్పును, ధైర్యం ఇవ్వడాన్ని సూచిస్తుంది.
చేతిపై (Hand Kiss) : చేతిపై ఇచ్చే ముద్దు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి రెస్పెక్ట్‌తో ఇచ్చేది కావొచ్చు. మరొకటి రొమాంటిక్‌గా ప్రపోజ్ చేస్తూ కూడా ఈ తరహా ముద్దు ఇస్తూ ఉంటారు.
భుజాలపై ధైర్యాన్ని చెప్తూ.. ఆప్యాయతనిస్తూ, ఊరటనిస్తూ కిస్ చేస్తూ కూడా అభిమానాన్ని చూపిస్తారు.
కొత్తగా, క్రేజీగా
పెక్ కిస్ (Peck Kiss) : బుగ్గలపై లేదా పెదాలపై సడెన్‌గా, క్షణకాలంలో చేసే ముద్దును పెక్ కిస్ అంటారు.
బటర్‌ఫ్లై కిస్ (Butterfly Kiss) : కనురెప్పలను తెరిచి మూయడాన్ని బుగ్గపై లేదా కళ్లపై చేసే కిస్ని బటర్‌ఫ్లై కిస్ అంటారు.
ముక్కుపై కిస్ (Nose Kiss) : ప్రేమతో, ఆప్యాయతతో, క్యూట్‌గా పెట్టుకునే ముద్దుల్లో నోస్ కిక్ కూడా ఒకటి.
ఇవేకాకుండా ఎన్నో కిస్‌లు కూడా ఉన్నాయి. Air Kissని చాలామంది ఆడుకుంటూ.. టీజ్ చేస్తూ వీటిని ఇస్తూ ఉంటారు. ఈ కిస్‌లో పార్టనర్‌ని టచ్ చేయడం ఏమి ఉండదు. జస్ట్ గాలిలో ముద్దు ఇచ్చుకోవడమే. డబుల్ చీక్ కిస్ కూడా గ్రీటింగ్లో భాగంగా ఇచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి కిస్లలో రకాలు తెలుసుకుని.. మీ ఎమోషన్స్‌కి అనుగుణంగా అవతలి వ్యక్తి అనుమతితో ట్రై చేయవచ్చు.
Also Read : కిస్ డే చరిత్ర, ప్రాముఖ్యత ఇదే.. మరి మీ కిస్ డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

